)
Jubilee Hills: 'జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కింగ్ అవుతున్నాం. అవతలి వాళ్లు విమర్శిస్తారు కానీ మెచ్చుకుంటారా? టీడీపీలో ఉన్న కార్యకర్తలు సానుభూతి చూపిస్తున్నారు. జూబ్లీహిల్స్‌లో త్రిముఖ పోటీ ఉంది' అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. సర్వే చేసినవాళ్లు బెడ్ రూమ్‌లో చేశారా? బాత్రూంలో చేశారా? అని ప్రశ్నించారు. అందరూ గెలుస్తాం అనే చెప్తారని.. రాజకీయ పార్టీలు విమర్శలు చేసేటప్పుడు పరిమితి ఉండాలని సూచించారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో మీడియాతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చిట్‌చాట్ చేశారు. 'జూబ్లీహిల్స్‌కి పాకిస్తాన్‌కు లింక్ పెట్టడం సరికాదు. ఇచ్చిందే రెండు ఉచిత బస్సు, సన్న బియ్యం' అని తెలిపారు. సన్న బియ్యం కేంద్రం వాటా ఎక్కువ అని కిషన్ రెడ్డి చెప్పారు. 'ఫ్రీ బస్సు ఎక్కి రోజు షాపింగ్‌లు చేస్తున్నారు. బజార్లో ఎవరూ నమ్మే పరిస్థితి లేదు. చెప్పులు ఎత్తుకపోయే వారి లాగా చూస్తున్నారని స్వయంగా సీఎం చెబుతున్నారు . ఎమ్మెల్సీలో మేము గెలిచాం అప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ మాకు మద్దతు ఇచ్చిందా?' అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు.
'దేశంలో ఉన్న 7 ఉప ఎన్నికల కోసం ఒకేసారి అభ్యర్థిలనీ ప్రకటించాం. మేము ఎప్పుడూ సర్వేలు చేయలేదు. ఫీల్డ్‌పైన ఉండి ఒక్కో ఓటర్ కలిశాక సర్వే చేయాల్సిన అవసరం లేదు. బూత్ స్థాయి నాయకులను నమ్ముకున్నాం' కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. రాజకీయ పార్టీల్లో ఎవరికి వారు గెలవాలని కోరుకోవడంలో తప్పులేదని ప్రకటించారు. సన్నబియ్యంలో కేంద్రం ఇచ్చేవి రూ.42 ఉన్నాయని.. రేవంత్ రెడ్డి రూ.13 మాత్రమే ఇస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.
'నన్ను కోసినా రేవంత్‌రెడ్డి రూపాయి లేదన్నారు, చెప్పులు ఎత్తుకెళ్లే వారిలా చూస్తున్నారని అన్నారు' అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గుర్తుచేశారు. అజారుద్దీన్ వల్ల ఓట్లు వస్తాయని భావిస్తే టికెట్ ఆయనకే ఇచ్చేవారు కదా? అని సందేహం వ్యక్తం చేశారు. ముస్లింలపై ప్రేమతో ఆయనకు మంత్రి పదవి ఇవ్వలేదని.. ఒక సామాజిక వర్గం ఓట్ల కోసమే ఇచ్చారని కిషన్ రెడ్డి తెలిపారు. 'అజారుద్దీన్‌పై కేసులు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఇవ్వడం మాకు ప్లస్ అవుతుంది' అని వివరించారు.
'ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వమంటే విజిలెన్స్ పేరిట బెదిరిస్తారా? ప్రభుత్వ అనాలోచిత వైఖరితో నష్టపోయేది విద్యార్థులు. యాజమాన్యాలను భయపెడితే భయపడే పరిస్థితిలో లేరు. యాజమాన్యాలు నిబంధనలు పాటించడం లేదని అనిపిస్తే సర్కార్ రెండేళ్లు ఏం చేసింది?' అని రేవంత్ రెడ్డి తీరుపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు. తప్పులు ఉంటే చర్యలు తీసుకోకుండా ఏం చేస్తున్నారని నిలదీశారు. నిబంధనలు పాటించని కాలేజీలకు అడ్మిషన్లు నిలిపివేయాలని కిషన్ రెడ్డి సూచించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి