)
Balapur Ganeshas Laddu Auction: వినాయక చవితి అంటే చాలు మనకు ముందుగా గుర్తుకొచ్చేవి.. హైదరాబాద్‌లో జరిగే గణేశుడి లడ్డూ వేలం పాటలు, శోభాయాత్రలు. గణపతి చేతిలో ఉన్న లడ్డూను కొనేందుకు భక్తులు ఎంతో ఆసక్తిగా పోటీ పడతారు. ఈ లడ్డూ కొనుగోలు చేస్తే కుటుంబం సంతోషంగా ఉంటుందని, ఆర్థికంగా బలం చేకూరుతుందని భక్తుల నమ్మకం. అయితే, గణనాథుడి లడ్డూ వేలంపాట అంటే.. అందరికీ ముందుగా గుర్తుకొచ్చేది బాలాపూర్ గణేశ్ లడ్డూనే. కానీ ఈసారి రాజేంద్రనగర్ పరిధిలోని బండ్లగూడజాగీర్ కీర్తి రిచ్మండ్ విల్లాలో.. లడ్డూ వేలం రూ.2 కోట్ల 30 లక్షల ధరతో రికార్డు సృష్టించింది.
బాలాపూర్ గణేశుడి లడ్డూ వేలం ఎప్పుడూ ప్రసిద్ధమే. ఈసారి కూడా బాలాపూర్ గణనాథుడి లడ్డూను దక్కించుకునేందుకు తీవ్ర పోటీ జరిగింది. గతేడాది వేలంలో లడ్డూను రూ. 30 లక్షల ఒక వెయ్యికి దక్కించుకున్నారు. అయితే ఈ సంవత్సరం బాలాపూర్ లడ్డూను లింగాల శశిథర్ గౌడ్ 35 లక్షల రూపాయలకు కొనుగోలు చేశారు. ఇది బాలాపూర్ వేలంలో ఇప్పటివరకు అత్యధిక ధర.
అయితే ఈ సారి రాజేంద్రనగర్‌లోని బండ్లగూడ జాగీర్ కీర్తి రిచ్మండ్ విల్లాస్‌లో లడ్డూ 2 కోట్ల 30 లక్షల రూపాయలకు రికార్డు ధరకు అమ్ముడైంది. అలాగే నాలెడ్జ్ సిటీలోని మైహోమ్ భుజ గేటెడ్ కమ్యూనిటీ గణేశ్ లడ్డూ 51 లక్షల రూపాయలకు పలికింది. గత ఏడాది ఇక్కడ గణేశుని లడ్డూ 29 లక్షలకు అమ్ముడు కాగా.. ఈసారి రూ.51,07,777 రికార్డు ధర పలికింది.
ఈ లడ్డూ వేలంతో వచ్చిన డబ్బులతో ఏం చేస్తారు..?
1. బాలాపూర్ గణేశ్ లడ్డూ..
* బాలాపూర్ గణపతి లడ్డూ వేలంపాట ద్వారా వచ్చిన డబ్బులను గ్రామాభివృద్ధి కోసం ఉపయోగిస్తారు.
* ఇప్పటివరకు రూ.1,60,87,970 ఖర్చు చేసినట్లు ఉత్సవ సమితి తెలిపింది.
* ఈ ఏడాది రూ.80,000 జిల్లా పరిషత్ పాఠశాలలో మరుగుదొడ్ల నిర్మాణానికి వినియోగించారు.
* నిధుల వినియోగంలో పారదర్శకత కోసం ఉత్సవ కమిటీ ప్లెక్సీ ఏర్పాటు చేస్తుంది.
2. బండ్లగూడ జాగీర్ కీర్తి రిచ్మండ్ విల్లాస్..
* ఇక్కడ లడ్డూ ధర వేలంలో రూ.2 కోట్ల 30 లక్షల రికార్డు ధరకు పలికింది.
* వేలం ద్వారా వచ్చిన డబ్బులను 42 ఎన్జీవోలను నిర్వహించే ట్రస్టుకు.. నిర్వాహకులు విరాళంగా ఇస్తారు.
* పూర్తిగా వాలంటీర్లతో నడిచే ఈ ట్రస్టు ద్వారా 10,000 మందికి సాయం అందుతుంది.
* ప్రతీపైసాను పూర్తిగా క్షేత్రస్థాయిలో సామాజిక సేవలకు వినియోగిస్తారు.
3. నాలెడ్జ్ సిటీ మైహోమ్ భుజ గేటెడ్ కమ్యూనిటీ..
* నాలెడ్జ్ సిటీ లడ్డూ ధర వేలంలో రూ.51,07,777 ధరకు.. ఖమ్మం జిల్లాకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి కొండపల్లి గణేశ్ దక్కించుకున్నారు.
* గత సంవత్సరం (2024)లో కూడా కొండపల్లి గణేశ్ రూ.29 లక్షలకు లడ్డూను దక్కించుకున్నారు.
* వేలంలో వచ్చిన డబ్బును బ్యాంక్ డిపాజిట్‌గా ఉంచి.. వడ్డీని వచ్చే ఏడాది గణేశ్ ఉత్సవాల కోసం ఉపయోగిస్తారు.
ఈ వేలం పాటలు కేవలం ఆధ్యాత్మిక నమ్మకాలే కాక.. సామాజిక సేవలకు, గ్రామాభివృద్ధికి దోహదపడే ఒక ప్రత్యేక సంప్రదాయంగా నిలుస్తున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook