)
Telangana Bathukamma Wishes: 'అక్కాచెల్లెళ్లకు, ఆడబిడ్డలకు, రాష్ట్ర ప్రజలందరికి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు' అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. 'తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ పండుగను ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలి. ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు' అని తెలిపారు. బతుకమ్మ పండుగ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని, మహిళల గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పే గొప్ప పండుగ అని కేటీఆర్ పేర్కొన్నారు.
బతుకమ్మ పండుగ ప్రకృతితో మమేకమై పర్యావరణ పరిరక్షణకు ఇచ్చే ప్రాధాన్యం తెలుపుతుందని మాజీ మంత్రి కేటీఆర్ వివరించారు. పూల బతుకమ్మను తీర్చిదిద్దడం, సామూహికంగా పాటలు పాడుతూ నృత్యం చేయడం తెలంగాణ మహిళల ఐక్యతకు, ఆనందానికి నిదర్శనమని ప్రకటించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రభుత్వం బతుకమ్మ పండుగను రాష్ట్ర పండుగగా గుర్తించి, అధికారికంగా నిర్వహించిందని కేటీఆర్ గుర్తు చేశారు.
బతుకమ్మ పండుగకు కేసీఆర్ ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వడంతోనే ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ సంస్కృతికి మరింత గుర్తింపు వచ్చిందని ఈ సందర్భంగా మాజీ మంత్రి కేటీఆర్ గుర్తుచేసుకున్నారు. తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత పది సంవత్సరాలపాటు ప్రతి ఆడబిడ్డకు అన్ని రకాలుగా అండగా ఉండేలా, అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో వారిని సాగించామని మాజీ మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు. బతుకమ్మ చీరల పంపిణీతో మహిళలకు ఆడబిడ్డలుగా పండగ పూట గౌరవ సూచకంగా అందించామని గుర్తు చేశారు. బతుకమ్మ పండుగ ప్రతి ఇంట్లో సుఖసంతోషాలను, సౌభాగ్యాన్ని నింపాలని, ఆడబిడ్డలందరూ సురక్షితంగా, సంతోషంగా ఉండాలని మాజీ మంత్రి కేటీఆర్ ఆకాంక్షించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook