)
Heavy Rain In Hyderabad: గత కొన్నిరోజులు హైదరాబాద్ నగరాన్ని వర్షాలు కుదిపేస్తున్నాయి. బంగాళఖాతంలో తీవ్ర వాయుగుండం కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గడిచిన రెండు రోజులుగా తెలంగాణ, ఏపీ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ప్రజలకు హెచ్చరిక జారీ చేస్తూ తెలంగాణ వెదర్ మ్యాన్ ప్రకటన చేశారు. హైదరాబాద్ వ్యాప్తంగా రాబోయే 24 గంటల్లో ఉరుములు, మెరుపులతో కూడా భారీ వర్షాలు కురువనున్నాయని స్పష్టం చేశారు.
హైదరాబాద్ నగరంలోని షేక్ పేట్, నార్సింగి, గచ్చిబౌలి, నానక్‌రామ్ గూడ, రాయ్ దుర్గ్, టౌలీ చౌకీ, మెహదీపట్నం, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, శేర్లింగంపల్లి, నాంపల్లి, అబిడ్స్, గోషామహాల్ ప్రాంతాల్లో తీవ్రమైన వర్షపాతం నమోదు కానుందని తెలంగాణ వెదర్ మ్యాన్ ఓ ప్రకటనలో తెలిపారు. వీటితో పాటు ఇతర ప్రాంతాలైన కూకట్ పల్లి, అమీర్ పేట్, సనత్ నగర్ వంటి సమీప ప్రాంతాల్లో ఓ మాదిరి వర్షపాతం నమోదు కానుందని స్పష్టం చేశారు.
ఏది ఏమైనా హైదరాబాద్ సిటీ వ్యాప్తంగా రాగల 24 గంటల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షపాతం నమోదు కానున్నట్లు అధికారులు హెచ్చరించారు. లోతట్టు ప్రాంత ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వారు సూచించారు. వీలైతే లోతట్టు ప్రాంతాల ప్రజలు ఆయా ప్రదేశాలను ఖాళీ చేయాలని సూచించారు. అంతే కాకుండా సెప్టెంబరు 14 రాత్రి నుంచి సెప్టెంబరు 15 వరకు భారీ వర్షపాతం నమోదు కానున్న నేపథ్యంలో ప్రజలు బయటకు రావొద్దని అధికారులు సూచించారు.
గుంటూరును దంచికొట్టిన వాన..
అటు ఆంధ్రప్రదేశ్‌లోనూ వానలు దంచికొట్టాయి. గడిచిన 24 గంటల్లో ఏపీ వ్యాప్తంగా అక్కడక్కడ భారీ వర్షాలు నమోదు అయ్యాయి. ముఖ్యంగా ఉమ్మడి గుంటూరు జిల్లాలో భారీ వర్షపాతం నమోదయ్యింది. ఈ ఏడాది మునుపెన్నడూ లేని విధంగా విపరీతమైన వర్షం కారణంగా వాగులు, వంకలు పొంగి పొర్లాయి. హైదరాబాద్, గుంటూరు రహదారిపై నీటి ప్రవాహం ఉధృతి కారణంగా రాకపోకలు స్తంభించిపోయాయి. అయితే రాబోయే 24 గంటల్లో ఇరు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు అవసరం ఉంటే తప్ప బయటకు రావొద్దని అధికారులు సూచిస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook