)
Rocket Sarees Shopping: భాద్రపద మాసం ఇంకొన్ని రోజుల్లో ముగియనుంది. రాబోయే అమావాస్య తర్వాత నుంచి ఆశ్వీయుజ మాసం ప్రారంభంకానుంది. దసరా నవరాత్రి ఉత్సవాలతో కొత్త నెల ప్రారంభం కానుంది. ఈ ప్రారంభం శుభకార్యాలకు ఆరంభం కూడా. తెలుగు వారి ఇంట శుభకార్యం అంటే చీరల గురించి ప్రధానంగా ఉంటుంది. పట్టుచీరల్లో ట్రెండీకి తగ్గట్లు ఇప్పుడు కళాధర్ చీరలు మార్కెట్లలో ఆకర్షిస్తున్నాయి. రాబోయే రోజుల్లో కళాధర్ చీరలు మార్కెట్లను దాదాపుగా ఆక్రమించినా అతిశయోక్తి లేదు. అయితే అలాంటి నేతన్నలు చేసే కళాధర్ చీరల తయారీ మందగించింది. అయితే కళాధర్ చీరల తయారీలో ఎదురయ్యే ఛాలెంజ్‌లు.. ఆ చీరలకు ఉన్న విలువ.. కళాధర్ చీరల సంస్కృతి, సంప్రదాయాలతో పాటు వాటి ప్రాముఖ్యతను నేతన్నల మాటల్లోనే ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రశ్న: కళాధర్ చీరల గురించి వివరించండి..?
జవాబు: కళాధర్ అనేది కేవలం శారీ (చీరల) బ్రాండ్ మాత్రమే కాదు... ఇదొక భావోద్వేగం. తరతరాలుగా చేనేత సంప్రదాయంలో భాగం. కళాధర్ ఆ వారసత్వాన్ని నేటి ప్రపంచానికి సందర్భోచితంగా అందించాలనే లోతైన ఆలోచన, ఆశయం నుండి పుట్టింది. భారతదేశమంతా చేతితో నేసిన చేనేత వస్త్రాలను ఒకచోట చేర్చి, ప్రతి చీర ఒక అందమైన కథను చెప్పేలా జాగ్రత్తగా క్యూరేట్ చేస్తాము. కస్టమర్ సంతృప్తి పొందే అనుభవాలు, సాటిలేని నాణ్యత, ప్రామాణికత ఫిలాసఫీతో ఈ కళాధర్ శారీలను విక్రయిస్తారు. ఆన్లైన్ లేదా ఆఫ్‌లైన్ ఏదైనా.. వారు కేవలం కళాధర చీరను మాత్రమే కొనడం కాదు.. శతాబ్దాలుగా కొనసాగిస్తున్న అతిపెద్ద సంస్కృతి - సంప్రదాయంలో భాగమవుతున్నారని వారికి అనిపించాలని కోరుకుంటున్నాము.
ప్రశ్న: ఈ చీరల అమ్మకం ప్రారంభించడానికి మిమ్మల్ని ప్రేరేపించిన అంశం ఏమిటి?
జవాబు: కళాధర్ మూలాలు చేనేత నేపథ్యానికి చెందినవి. అలాంటి ప్రతి చీర తరతరాలుగా నైపుణ్యం, గర్వం, గౌరవం, త్యాగాలను మోసుకెళ్లింది. కానీ సంవత్సరాలు గడిచేకొద్దీ., చేనేత వ్యాపారం క్షీణించడాన్ని ఎంతోమంది దగ్గరగా చూశారు. పవర్‌లూమ్‌లు, సామూహిక ఉత్పత్తి, చౌకైన వ్యాపారాలు చేనేతను ఆక్రమించడం ప్రారంభమయ్యింది. నేతన్నలు తమ జీవితాలను అంకితం చేసిన కుటుంబాలు మనుగడ సాగించడమే కష్టతరం అవుతున్నాయి. మరీ ముఖ్యంగా యువ తరాలు ఈ వృత్తిలో గౌరవం - స్థిరత్వాన్ని చూడలేక ఈ రంగంలో కొనసాగడానికి ఇష్టపడట్లేదు. ప్రయత్నంలో, భవిష్యత్ ప్రణాళికల్లో ఈ వృత్తి ఒక ఆప్షన్ గా కూడా తీసుకోవట్లేదని అనిపించింది. ఇలాంటి సమయంలో ఈ చీరల ఘనతను ఇప్పటి తరానికి తెలియజేయడమే దీని ముఖ్యభావం. కొన్నిసార్లు మనలో మనం ఒక విషయం ఆలోచిస్తాము. ఎవరూ చేయకపోతే ఇంకెవరు దీన్ని కొనసాగిస్తారు అని.. అలా దీన్ని ఆపకుండా నిరంతర ప్రక్రియలా మార్చారు.
కళాధర్ ఈ బాధ్యత, భావన నుంచే ఆవిష్కృతమైంది. చేనేత వస్త్రాలకు రూపమిస్తూ, నేత కార్మికుల ఆశకు ఆయువు పోస్తూ, కస్టమర్లకు ఇప్పటికీ ప్రామాణికమైన వస్త్రాలను అందించడంలోని ఆనందం, సంతృప్తిని ఆస్వాదించగల వేదికని సృష్టించడం మా లక్ష్యం మా దార్శనికత. ఆ కోణంలో... కళాధర్ కేవలం ఒక బ్రాండ్ మాత్రమే కాదు, ఇది వారసత్వ వైభవానికి కొనసాగింపు.
ప్రశ్న: మీ కొత్త కలెక్షన్ రాకెట్ చీరల గురించి వివరించండి.
జవాబు: రాకెట్ చీరలు... సంప్రదాయాన్ని ఆధునిక జీవితంలోకి ముందుకు తీసుకెళ్లే మా సరికొత్త మార్గం. నేటి మహిళలు ఎప్పుడూ లేనంత బిజీగా ఉన్నారని, కెరీర్, కుటుంబం తదితర విషయాలతో లెక్కలేనన్ని బాధ్యతలను మోస్తున్నారని మాకు తెలుసు. అయినప్పటికీ, చీరల పట్ల వారి ప్రేమ.. వారిని వారి వారసత్వంతో అనుసంధానించే వస్త్రాలను తయారు చేయడంలో విశిష్టత ఎప్పుడూ తగ్గలేదు. కేవలం 20 సెకన్లలోపు ధరించేలా రూపొందించబడిన ఈ వినూత్న చీరలు ఆధునిక మహిళలకు సౌందర్యాన్ని జోడిస్తూనే సాంప్రదాయ చీరల అందం, అభినయాన్ని చెక్కుచెదరకుండా ప్రదర్శిస్తాయి. ఈ ‘రాకెట్’ అనే పేరు రెండు ఆలోచనల నుండి వచ్చింది... 'రాపిడ్':— ఎందుకంటే దీనిని త్వరగా అలంకరించుకోవచ్చు, 'పాకెట్':— ఆలోచనాత్మక సృజనాత్మకత రోజువారీ జీవితాన్ని సులభతరం చేస్తుంది.
రాకెట్ చీరలు కేవలం సౌలభ్యం గురించి మాత్రమే కాదు. ఈ చీరలు ఒక జీవన సంప్రదాయంగా ఉండేలా చూసుకోవడం ప్రధాన అంశం. ప్రస్తుత జీవనశైలి మారినప్పటికీ.. చీర దాని ప్రశస్తిని కోల్పోకుండా అభివృద్ధి చెందగలదని అవి నిరూపిస్తున్నాయి. వారసత్వం దాని సారాంశాన్ని ఎప్పుడూ రాజీ పడకుండా స్వీకరించగలదని మేము చెప్పే విధానమిది.
ప్రశ్న: హైదరాబాద్‌లో ఏ రకమైన నేత, ఇతర వస్త్రాలు ఎక్కువగా అమ్ముడవుతున్నాయని మీరు గమనించారు?
జవాబు: చీరల విషయానికి వస్తే హైదరాబాద్ చాలా వైవిధ్యమైన అభిరుచిని కలిగి ఉంది. గద్వాల్, బనారసి, కాంచీపురం వంటి విలాసవంతమైన పట్టులను ప్రజలు ఇష్టపడుతుండగా, రోజువారీ దుస్తులు, సన్నిహిత వేడుకలకు సరిపోయే ఆర్గాన్జా, లినెన్, టస్సార్ పట్టు వంటి తేలికైన డ్రెప్లకు కూడా డిమాండ్ పెరుగుతోంది.
మేము గమనించిన విషయం ఏమిటంటే.. ఇక్కడి కస్టమర్లు ప్రామాణికమైనవి, ప్రత్యేకమైనదిగా భావించేదాన్ని ఎక్కువగా కోరుకుంటారు. వారు భారతీయ నేత సంప్రదాయాలలో పాతుకుపోయిన కళకు ఆకర్షితులవుతారు. కానీ వారి ఆధునిక జీవనశైలిలో ఇమడగలిగే వాటికి ఆకర్షితులవుతారు. ప్రస్తుతం వారసత్వం, బహుముఖ ప్రజ్ఞ మధ్య సమతుల్యత ఎక్కువగా అమ్ముడవుతోంది.
ప్రశ్న: పెళ్ళిళ్ళ సీజన్ వస్తోంది., ఏ రకమైన చీరలు ట్రెండింగ్‌లో ఉన్నాయి?
- వివాహ షాపింగ్ అనేది ఎల్లప్పుడూ ప్రత్యేకమైనది. ఈ ఏడాది మనం రెండు ప్రత్యేకమైన ధోరణులను చూస్తున్నాము.
- క్లాసిక్ వైభవం: సాంప్రదాయ కాంచీపురాలు, బనారసీలు, ఆభరణాల టోన్స్ లో హస్తకళతో నేసిన పట్టు వధువులకు, సన్నిహిత కుటుంబ సభ్యులకు శాశ్వతంగా ఉంటాయి. ఇవి తరతరాలుగా ప్రజలు పెట్టుబడి పెట్టే వారసత్వ ఉత్పత్తులు.
సమకాలీన సౌందర్యం: యువ వధువులు, అతిథులు పాస్టెల్ టోన్స్, ఆర్గాన్జా చీరలతో పాటు ఆధునిక అలంకరణలతో కూడిన తేలికైన నేతలను కూడా అన్వేషిస్తున్నారు. అప్పుడప్పుడు కాక్టెయిల్ పార్టీల మాదిరిగానే వారు పెళ్లికి మించి కూడా ధరించవచ్చు.
ప్రశ్న: భవిష్యత్తు ప్రణాళికలు ఏంటి?
- మాకు., భవిష్యత్తు కొనసాగింపుతో పాటు పరిణామం ప్రధానం అని భావిస్తున్నాం. వ్యాపార వేదిక పై కళాధర్‌ను వ్యక్తిగతంగా ఆస్వాదించేలా మా స్టోర్స్ విస్తరించడాన్ని కొనసాగించాలనుకుంటున్నాము. సంప్రదాయం అధునాతనాతన సమ్మేళనం 'రాకెట్ శారీస్' వంటి మరిన్ని ఆవిష్కరణలను కూడా మేము అన్వేషిస్తున్నాము.
మా లక్ష్యం మాత్రం 'చేనేత వారసత్వాన్ని సజీవంగా ఉంచడం, నేత కార్మికులను శక్తివంతం చేయడం, కస్టమర్లకు అద్భుతమైన, ఆకర్షణీయమైన, అనువైన వస్త్రాలను అందించడమే'. కళాధర్ ఎల్లప్పుడూ దీని కోసమే ప్రయత్నిస్తుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook