)
Flag Football League in Hyderabad: సికింద్రాబాద్ జిమ్ఖానా గ్రౌండ్స్ వేదికగా అమెరికన్ ఫ్లాగ్ ఫుట్‌బాల్ నేషనల్ ఛాంపియన్షిప్ 2025 పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తెలంగాణ పురుషుల జట్టు అద్భుత ప్రదర్శన చేసి, అన్ని లీగ్ మ్యాచ్‌లలో గెలిచి నాకౌట్ దశలోకి దూసుకెళ్లింది.
తెలంగాణ జట్టు మహారాష్ట్రపై (20–12), ఉత్తర ప్రదేశ్‌పై (14–6) విజయం సాధించగా.. బిహార్, హర్యానా జట్లపై వాక్‌ఓవర్‌తో దూసుకుపోయి టైటిల్ ఫేవరెట్లుగా నిలిచింది. ఇతర పురుషుల జట్లలో ఆంధ్రప్రదేశ్ జట్టు ఝార్ఖండ్ (18–8), ఢిల్లీ (6–0) జట్లపై గెలిచి మెప్పించగా, కేరళ జట్టు కూడా రెండు మ్యాచ్‌ల్లో విజయాలు సాధించింది. ఇందులో ఝార్ఖండ్‌పై 28–6 తేడాతో దుమ్మురేపింది. కర్ణాటక–కేరళ మ్యాచ్ 6–6తో డ్రాగా ముగిసింది. ఉత్తరప్రదేశ్ మహారాష్ట్రను 30–0 తేడాతో ఓడించింది.
మహిళల విభాగంలో తెలంగాణ జట్టు మిశ్రమ ఫలితాలు సాధించింది. ఉత్తర ప్రదేశ్ చేతిలో 0–24తో ఓడిపోయినా.. ఆంధ్రప్రదేశ్‌తో 6–6 సమంగా ఆడి మ్యాచ్ డ్రా చేసింది. కర్ణాటక మహిళల జట్టు ఢిల్లీపై 68–0, బిహార్‌పై 42–0తో గెలిచి సత్తాచాటింది. ఉత్తరప్రదేశ్ మహిళల జట్టు కూడా ఆంధ్రప్రదేశ్‌ను 42–0 తేడాతో ఓడించింది.
నేషనల్ ఛాంపియన్షిప్ 2025లో దేశవ్యాప్తంగా ఉన్న పురుషుల, మహిళల సీనియర్ జట్లు పాల్గొంటున్నాయి. రేపు అనగా ఆదివారం (ఆగస్టు 31) నాకౌట్ దశలో టాప్ జట్లు తలపడనున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook