)
Ganesh Nimajjanam 2025: భాగ్యనగరం కాషాయ వర్ణ శోభితం అయింది. వీధి వీధినా గణేష్ శోభాయాత్ర సందడి నెలకొంది. వినాయక చవితి తర్వాత మూడో రోజు నుంచే గణనాథులు గంగమ్మ ఒడికి చేరుకుంటున్నారు. ఇక గణేష నవరాత్రల్లో విశేష పూజలందుకున్న గణపయ్యలు గంగమ్మ ఒడిలో చేరుకోబోతున్నారు. గణపయ్యల నిమజ్జనాలను తిలకించేందుకు భక్తులు తండోపతండాలుగా వినాయక సాగర తీరానికి చేరుకుంటున్నారు. దీంతో ట్యాంక్ బండ్ పరిసరాలు భక్తుల కోలాహాలంతో నిండిపోయాయి. నిమజ్జనాలకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు ఇప్పటికే పటిష్ట చర్యలు చేపట్టారు. దీంతో ఒక్కొక్కటిగా గణపతి ప్రతిమలు నిమజ్జనానికి అర్ధరాత్రి నుంచే తరలివస్తున్నాయి. దీంతో భక్తుల తాకిడి అధికంగా ఉంది. మరికాసేట్లో ఈ తాకిడి మరింత పెరిగే అవకాశాలున్నాయి. అందుకు తగినట్లుగా అన్ని శాఖల అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. హైదరాబాద్ లో ప్రభధాన ఊరేగింపు బాలాపూర్ నుంచి మొదలై చాంద్రాయణ గుట్ట, ఫలక్ నుమా, లాల్ దర్వాజా మోడ్, చార్మినార్, అఫ్జల్ గంజ్, ఎంజే మార్కెట్, ఆబిడ్స్ మీదుగా ట్యాంక్ బండ్ మార్గంలో వెళ్లనున్నాయి.
మరోవైపు ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జనోత్సవానికి ట్యాంక్‌బండ్ వైపునకు తరలొచ్చే భక్తుల కోసం కాచిగూడ, రాంనగర్, కొత్తాపేట, మిథానీ, బోడుప్పల్, మేడిపల్లి, మల్కాజిగిరి తదితర ప్రాం తాల నుంచి ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉంటాయి. వీటి పర్యవేక్షణకు కోఠి, రేతిఫైల్లో కమ్యునికేషన్ విభాగాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.
గ్రేటర్ హైదరాబాద్ నగరంలో 20 ప్రధాన లేక్ లతోపాటు జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 72 కృత్రిమ కొలనులలో నిమజ్జనం కోసం ఏర్పాట్లు చేశారు. దీనివల్ల ట్రాఫిక్ ఇబ్బందులు దూరం అవ్వడంతో పాటు భక్తులకు సౌలభ్యంగా ఉంటుంది. ప్రధాన జల వనరులపై ఒత్తిడి తగ్గనుంది. 134 స్టాటిక్ క్రేన్లు, 259 మొబైల్ క్రేన్లు, ఒక బాహుబలి క్రేన్, 10 పెద్ద క్రేన్లు సహా హుస్సేన్ సాగర్ చుట్టూ మొత్తం 20 క్రేన్లు ఏర్పాటు చేశారు. ఫలితంగా కీలకమైన ఈ హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం వేగంగా, స్మూత్ గా జరగనుంది. బాహుబలి క్రేన్ నెంబర్ 4 ద్వారా ఖైరతాబాద్ మహా గణేష్ విగ్రహం నిమజ్జనం చేయనున్నారు.
నిమజ్జన పాయింట్ ల వద్ద అవాంఛనీయ ఘటనలు జరగకుండా హైడ్రా, పర్యాటక శాఖ సమన్వయంతో హుస్సేన్ సాగర్ లో 9 బోట్లను, డీఆర్ఎఫ్ టీమ్‌లను, 200 గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచారు. పోలీసుల సహకారంతో 13 కంట్రోల్ రూమ్ లో ఏర్పాటు చేశారు. ఆధ్యాత్మిక వాతావరణంలో భక్తి శ్రద్ధలతో నిమజ్జనం ప్రశాంత వాతావరణంలో జరిగేలా చూసేందుకు పోలీస్, రెవెన్యూ, ఎలక్ట్రిసిటీ, హెచ్ఎండీఏ, జలమండలి, ట్రాఫిక్ పోలీస్ , ఆర్ అండ్ బీ, హైడ్రా, వైద్య ఆరోగ్య, పర్యాటక, సమాచార శాఖ లను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతోంది.
నిమజ్జన కార్యక్రమంలో స్వచ్ఛతకు పెద్దపీట వేసేలా 15 వేల మంది శానిటేషన్ వర్కర్స్ ను మూడు షిఫ్టుల్లో పని చేస్తున్నారు. వినాయక చవితి ప్రారంభం ఇప్పటి వరకూ 125 జీసీబీ లు, 102 మినీ టిప్పర్ లు ఉపయోగించి 10,500 మెట్రిక్ టన్నుల కు పైగా అధిక వ్యర్థాలను సేకరించి జవహర్ నగర్‌లోని ప్రాసెసింగ్ సెంటర్ కు తరలించారు. నిమజ్జన పాయింట్లలో మూడు షిఫ్టులలో పని చేసేలా అంబులెన్స్ లతో సహా 7 మెడికల్ క్యాంపులను సిద్ధంగా ఉంచారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.