)
Ganesh Nimajjan 2025 Updates: ట్యాంక్ బండ్ ను ఈరోజు 30 లక్షలు మంది వరకు భక్తులు సందర్శించే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో భారీ ఎత్తున బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ప్రత్యేక పోలీసుల పహార కూడా నిర్వహిస్తున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో గణపయ్యను దర్శించుకోవడానికి ట్యాంక్‌బండ్‌కు ఇప్పటికే తరలివస్తున్నారు. ఇక మొత్తానికి ఖైరతాబాద్ గణనాథుడి శోభాయాత్ర కూడా ప్రారంభమైంది. మరోవైపు బాలాపూర్ గణనాథుడు లడ్డూ వేలం కూడా మరికొద్ది గంటల్లో ప్రారంభం కానుంది.
నేడే మహా నిమజ్జనం ఈ అపురూప ఘట్టం వీక్షించేందుకు లక్షల మంది ఎదురు చూస్తున్నారు. 9 రోజుల పాటు పూజలు అందుకున్న గణనాథుడు ఇవాళ గంగమ్మ ఒడికి చేరుకోనున్నాడు. హైదరాబాద్ వ్యాప్తంగా ఇప్పటికే భారీ ఏర్పాట్లు చేశారు. దాదాపు 50 వేల విగ్రహాలు ఈ రోజు నిమజ్జనానికి వస్తాయని అంచనాతో 30 వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటికే 20 చెరువులు, 74 కృత్రిమ కొలనులు, 134 క్రేన్లు, 259 మొబైల్ క్రేన్లు ఏర్పాటు చేశారు. ఇక హుస్సేన్ సాగర్ మొత్తంలో 9 బోట్లు, 200 మంది గజ ఈతగాళ్లతో భారీ ఏర్పాట్లు చేశారు.
నగరం కిటకిట..
ఈరోజు అన్ని స్కూళ్లు, ఆఫీసులు అన్ని బంద్ ఉండడంతో నగరం మొత్తం కిటకిటగా మారిపోయింది. గణేష్ నిమజ్జనం ఘట్టం కోసం కొన్ని లక్షల మంది ఎదురుచూస్తున్నారు. నగర ప్రజలకు ఈరోజు కనువిందు కానుంది. ఈ వేడుక చూసేందుకు పెద్ద, చిన్న అందరు ట్యాంక్‌బండ్ వైపుగా వెళ్తున్నారు. నగరవాసులే కాక తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు ప్రజలు కూడా ఇప్పటికే నగరానికి చేరుకున్నారు. దాదాపు 40 లక్షల మంది నిమజ్జన ఘట్టాన్ని తిలకరించనున్నారు గణేష్ ఉత్సవ కార్యదర్శి శశిధర్ తెలిపారు. సాగర తీరంలో సంబరంగా మారింది. ఖైరతాబాద్ గణనాథుని శోభాయాత్ర ప్రారంభం కావడంతో ఇక లక్షలాది మంది భక్తులు ట్యాంక్‌బండ్ వైపుగా వస్తున్నారు. దీనికి సంబంధించి ప్రత్యేక ఏర్పాట్లు కూడా అధికారులు చేశారు.
గుర్రపు దళంతో మహిళా పోలీసులు..
ఈసారి గుర్రపు దళంలో మహిళా పోలీసుల పహారా ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. సిటీ పోలీసుల చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. సీపీ సీవీ ఆనంద్ ఆధ్వర్యంలో గోషామహల్ మౌంటెడ్ యూనిట్లో శిక్షణ పొందిన పదిమంది మహిళ కానిస్టేబుళ్లు గుర్రపు పోలీస్ శిక్షణలో చేరారు. దేశంలో ఇదే తొలి ప్రయత్నం అని కమిషనర్ తెలిపారు. భారీ బందోబస్తు, విఐపి భద్రత, పెట్రోలింగ్ వంటి విధుల్లో వీటిని వినియోగిస్తారు. మహిళలు అన్ని రంగాల్లో ముందుకు రావాలన్న లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీపీ అన్నారు.
ట్రాఫిక్ ఆంక్షలు..
నేడు మహా నిమజ్జనం వేల నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. చంద్రాయన్ గుట్ట, మూసారంబాగ్, చంచల గూడా ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలను మళ్లింపులు ఇస్తారు. నయాపూల్, MJ మార్కెట్, ఆలియాబాద్, మదీనా ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టారు. ఇక హిమాయత్ సాగర్. వైఎంసీఏ ప్రాంతాల్లో కూడా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
గణేష్ నిమజ్జనానికి ప్రత్యేక ఏర్పాట్లు :సీపీ
ఇక గణేష్ నిమజ్జనానికి ప్రత్యేకంగా ట్రాఫిక్ ఏర్పాట్లు చేశామని సిటీ జాయింట్ సీపీ జోయల్ డేవిస్ తెలిపారు. బారికేడ్లు ఏర్పాటు చేసి తగినంత సిబ్బందిని కూడా మోహరించామని కమ్యూనికేషన్ ప్లాన్ కూడా సిద్ధమైందని ఆయన చెప్పారు. శోభాయాత్ర సజావుగా సాగేందుకు హై రిజల్యూషన్ కెమెరాలతో పర్యవేక్షణ కూడా చేపడుతున్నట్లు తెలిపారు.
ప్రైవేట్ బస్సులకు అనుమతి లేదు: సీపీ
గణేష్ నిమజ్జనం సాఫీగా సాగేందుకు ఇప్పటికే కట్టిన చర్యలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఉదయం 6 గంటల నుంచి రేపు ఉదయం 8 గంటల వరకు సిటీలోకి ప్రైవేట్ బస్సులు అనుమతి కూడా లేదని రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు స్పష్టం చేశారు. కేవలం ఓఆర్ఆర్ మీదుగానే ప్రయాణించాలని ఇబ్బందులు ఎదురైతే సిటీలో ఉన్న భారీ వాహనాలు ప్రైవేట్ బస్సులను కూడా బయటకు పంపే అవకాశం ఉండదన్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook