)
Heavy Rain In Across Hyderabad: భారీ వర్షం హైదరాబాద్‌ను మరోసారి ముంచెత్తింది. ఉన్నఫళంగా వాతావరణం మారిపోయి పూర్తి మేఘావృతమై సాయంత్రం నుంచి రాత్రి వరకు కుండపోత వర్షం పడింది. హైదరాబాద్ అంతటా వర్షం కురిసింది. మోస్తరు నుంచి భారీ వర్షం కురవడంతో హైదరాబాద్‌లోని పలు ప్రాంతాలు వరదలో మునిగాయి. భారీ వర్షం కారణంగా హైదరాబాద్ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పలుచోట్ల వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
భారీ వర్షానికి హైదరాబాద్‌లోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. జేకే కాలనీ నీటి మునగడంతో వాహనదారులు, కాలనీవాసులు ఇబ్బందులు పడుతున్నారు. మల్కాజిగిరి, మౌలాలి, ఆనంద్‌బాగ్ తదితర ప్రాంతాల్లో వర్షం పడింది. పెద్ద అంబర్‌పేట మున్సిపాలిటీ పరిధిలోని లక్ష్మారెడ్డి పాలెంలో కాలనీలోకి భారీగా వరద నీరు చేరింది. ఇళ్లలోకి వెళ్లలేక కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జాతీయ రహదారిపై నుంచి భారీగా వరదనీరు రావడంతో కాలనీలోకి భారీ వరదనీరు చేరడంతో ఇబ్బందులు ఎదురయ్యాయి.
ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం హైదరాబాద్ శివారు ప్రాంతంలో కురిసింది. కుషాయిగూడ, కీసర, మల్కాజిగిరి, నేరెడ్మెట్, మౌలాలి, సైనిక్‌పురి, రాంపల్లి, చర్లపల్లి తదితర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. మధ్యాహ్నం ఎండ కొట్టి సాయంత్రం ఒకసారిగా వాతావరణం చల్లబడింది. ఉప్పల్, రామంతాపూర్, చిలుకనగర్, నాచారం, మల్లాపూర్, లాలాపేట్, లాలాగూడ, తార్నాక, ఉస్మానియా విశ్వవిద్యాలయం క్యాంపస్, మేడిపల్లి, పోచారం, ఘట్కేసర్ పరిసర ప్రాంతాలలో వర్షం పడింది. ఇక విజయవాడ రహదారిలోని ఎల్బీనగర్, వనస్థలిపురం, హయత్ నగర్, బీఎన్ రెడ్డీ నగర్, పెద్ద అంబర్పేట్, అబ్దుల్లా పూర్ మెట్టు ప్రాంతాల్లో భారీగా వర్షం కురిసింది.
వ్యక్తి ఆత్మహత్యాయత్నం
సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని చెరువు గట్టుపై లేఖ రాసి చెరువులోకి ఓ వ్యక్తి దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. అతడి చెప్పులు, మొబైల్, లెటర్ చెరువు మెట్లపై వదిలేశాడు. ఘటన స్థలానికి చేరుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అతడి కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గాలిస్తున్నాయి. వ్యక్తి ఒక వివరాలు తెలియాల్సి ఉంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook