)
Hyderabad Ganesh Nimajjanam 2025: హైదరాబాద్ లో వినాయక నిమజ్జనోత్సవం ఘనంగా జరిగింి. నిన్న మధ్యాహ్నమే ఖైరతాబాద్ బడా గణేష్ నిమజ్జనం పూర్తి కాగా… రాత్రి బాలాపూర్ గణపతి విగ్రహం నిమజ్జనం ముగిసింది. ఇక నగరంలోని మిగిలిన భారీ విగ్రహాలు గంగమ్మ ఒడికి తరలిపోయేందుకు మెల్లగా కదులుతున్నాయి. అటు పెద్ద సంఖ్యలో భక్తులు నిమజ్జనోత్సవాన్ని తిలకించి పులకించారు. ఈ ఇక రెండో ఆదివారం కూడా ట్యాంక్ బండ్ ప్రాంతం విగ్రహాలతో కిటకిటలాడుతున్నాయి. అధికారులు లెక్కల ప్రకారం …నిన్న రాత్రి 8 గంటల వరకు జీహెచ్ఎంసీ పరిధిలో దాదాపు 2 లక్షల 32 వేల 520 వినాయక విగ్రహాల నిమజ్జనం పూర్తయ్యియినట్టు అధికారులు తెలిపారు.
అన్ని పాయింట్లలో విగ్రహాల నిమజ్జనం సాఫీగా, సురక్షితంగా జరిగేలా జీహెచ్ఎంసీ యంత్రాంగం జాగ్రత్తలు తీసుకుంది. మరో వైపు పారిశుద్ధ్య కార్మికులు ఎప్పటి కపుడు రోడ్లను శుభ్రం చేస్తున్నారు. మరోవైపు గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా పరిశీలించేందుకు వెళ్లారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ నియంత్రణ, భద్రతా ఏర్పాట్లు, శుభ్రత, ప్రజల రాకపోకలపై ఆయన సూచనలు చేశారు. ఆదివారం ఉదయం కూడా వినాయక్ సాగరం వైపు విగ్రహాలు తరలివస్తున్నాయి. నిమజ్జనం పూర్తి కావడానికి మరి కొన్నిగంటలు పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.
కాగా అర్థరాత్రి గణేష్ శోభయాత్ర చార్మినార్ దాటింది. దీంతో ప్రశాంతంగా వినాయక నిమజ్జనం ముగిసిందని పాత బస్తీ వాసులతో పాటు పోలీసులు, ఉన్నతాధికారులు ఊపిరిపీల్చుకున్నారు. రాత్రి 12 గంటల నుంచి తెల్లవారుఝాము వరకు రూడ్లపై భక్తుల సందడి కొనసాగుతూనే ఉంది. ఊరేగింపుగా వస్తూ ఒక్కో వినాయకున్ని క్యూ పద్దతిలో నిమజ్జనం చేస్తున్నారు. చిన్న వినాయకుడి విగ్రహాలు ఒకవైపు, పెద్ద విగ్రహాలను ఒకవైపు నిమజ్జనం చేస్తున్నారు. మధ్యాహ్నం మూడు గంటల వరకు మొత్తం కార్యక్రమం పూర్తి కానుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.