
Route Map Of Ganesh Immersion: వినాయక ఉత్సవాలు అంటే ముంబై తర్వాత హైదరాబాద్ గుర్తుకు వస్తుంది. భారీ స్థాయిలో అత్యంత వైభవంగా వినాయక నిమజ్జనం హైదరాబాద్‌లో జరుగుతుంది. వినాయక నవరాత్రులు ముగుస్తుండగా ఎల్లుండి అంటే సెప్టెంబర్ 6వ తేదీన గణేశుడు గంగమ్మ ఒడికి చేరనున్నాడు. ఇప్పటికే చిన్న చిన్న వినాయకులు నిమజ్జనం కాగా ప్రధాన శోభయాత్ర శనివారం జరగనుంది. మహా నిమజ్జనానికి హైదరాబాద్‌లో భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే ఏయే మార్గాల్లో శోభయాత్ర ఉంటుందో తెలుసుకుందాం. శోభయాత్ర జరిగే ప్రధాన రూట్లపై ఇతర వాహనాలకు అనుమతి లేదని పోలీసులు ప్రకటించారు.
నగరంలో విధించిన ఆంక్షలు.. ప్రత్యేక ఏర్పాట్లు సెప్టెంబర్ 6 ఉదయం 6 గంటల నుంచి సెప్టెంబర్ 8 ఉదయం 6 గంటల వరకు అమలులో ఉంటాయి. నిమజ్జనం కోసం 10 బేబీ పాండ్లు, 8 పోర్టబుల్ వాటర్ ట్యాంకులు, 8 ఎక్స్కవేషన్ పాండ్లు పోలీస్ శాఖ, జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసింది. నిమజ్జనం సమయంలో భక్తుల కోసం హెల్ప్‌లైన్ నంబర్లు 040-27852482, 8712660600, 9010203626 ఏర్పాటు చేశారు.
నిమజ్జనం రూట్ మ్యాప్
సెప్టెంబర్ 6 ఉదయం 6 గంటల నుంచి సెప్టెంబర్ 7 ఉదయం 10 గంటల వరకు ట్రాఫిక్ పరిమితులు
ప్రధాన శోభాయాత్ర
బాలాపూర్ నుంచి చార్మినార్-అబిడ్స్-లిబర్టీ-ట్యాంక్‌బండ్- నెక్లెస్ రోడ్
సికింద్రాబాద్ వైపు
సికింద్రాబాద్ నుంచి పాట్నీ- ప్యారడైజ్ - రాణిగంజ్ - కర్బలామైదాన్ - ట్యాంక్‌బండ్ మార్గం
దిల్సుఖ్నగర్, ఉప్పల్ వైపు
దిల్సుఖ్నగర్, అంబర్పేట్, నారాయణగూడ, ఉప్పల్ నుంచి ప్రాసెషన్లు లిబర్టీ వద్ద కలుస్తాయి
మెహిదీపట్నం మార్గం
టోలిచౌకీ, మెహిదీపట్నం నుంచి వచ్చే విగ్రహాలు ఖైరతాబాద్ మీదుగా నెక్లెస్ రోడ్ చేరతాయి
పాతబస్తీ వైపు
టప్పచబుత్రా, ఆసిఫ్‌నగర్ నుంచి వచ్చిన విగ్రహాలు ఎంజే మార్కెట్లో కలుస్తాయి
ట్రాఫిక్ మళ్లింపులు
సౌత్ఈస్ట్ జోన్ డైవర్షన్ పాయింట్లు: కేశవగిరి, చాంద్రాయణగుట్ట, మూసారాంబాగ్, చంచల్‌గూడ
సౌత్ జోన్: అలియాబాద్, మదీనా, నయాపూల్, ఎంజే మార్కెట్, దరుశ్షిఫా
ఈస్ట్ జోన్: శివాజీ బ్రిడ్జ్, పుత్లిబౌలి, హిమాయత్‌నగర్, వైఎంసిఏ
సెంట్రల్ జోన్: లిబర్టీ, అబిడ్స్, ఖైరతాబాద్, ట్యాంక్‌బండ్, బుద్ధభవన్
నార్త్ జోన్: పాట్నీ, పరడైజ్, రాణిగంజ్
పార్కింగ్ ఇక్కడ
మహా నిమజ్జనం తిలకించేందుకు వచ్చే భక్తుల కోసం ట్రాఫిక్ ఏర్పాట్లు కూడా చేశారు. ఎన్టీఆర్ స్టేడియం, కట్టమైసమ్మ టెంపుల్, పబ్లిక్ గార్డెన్స్, బుద్ధభవన్ వెనుక, ఆదర్శనగర్, బీఆర్కే భవన్, ఖైరతాబాద్ ఎంఎంటీఎస్ స్టేషన్ ప్రాంతాల్లో వాహనాలను నిలపవచ్చు. అక్కడి నుంచి ట్యాంక్‌బండ్‌పై నిమజ్జన కోలాహలాన్ని తిలకించవచ్చు.
లారీలకు ప్రవేశం నిషేధం
నిమజ్జనం అనంతరం లారీలు నగరంలోకి రాకుండా ఔటర్ రింగ్ రోడ్ మీదుగా మాత్రమే అనుమతి. సెప్టెంబర్ 6 ఉదయం 8 నుంచి సెప్టెంబర్ 7 రాత్రి 11 వరకు నగరంలోకి లారీలు ప్రవేశం లేదు.
ఆర్టీసీ, ఎయిర్‌పోర్టు వారికి..
నిమజ్జనం తిలకించేందుకు వచ్చే భక్తుల కోసం ఆర్టీసీ బస్సులపై కూడా ఆంక్షలు ఉన్నాయి. ఆర్టీసీ బస్సులు మెహిదీపట్నం, కూకట్పల్లి, సికింద్రాబాద్, ఉప్పల్, దిల్సుఖ్నగర్, నారాయణగూడ వరకు మాత్రమే పరిమితం కానున్నాయి. అంతర్ రాష్ట్ర, జిల్లా బస్సులు చాదర్‌ఘాట్ వైపు మాత్రమే దారి మళ్లింపు. శంషాబాద్ విమానాశ్రయం వెళ్లేవారు పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్‌వే లేదా ఔటర్ రింగ్ రోడ్ మాత్రమే వాడాలి.
ఈ జంక్షన్లు బంద్
ఎంజే మార్కెట్, ఖైరతాబాద్, అబిడ్స్, లిబర్టీ, రాణిగంజ్, తెలుగు తల్లి చౌరస్తా, ట్యాంక్‌బండ్, నెక్లెస్ రోడ్, పీపుల్స్ ప్లాజా జంక్షన్లు బంద్ చేయనున్నాయి. కేవలం వినాయక విగ్రహాల వాహనాలకు మాత్రమే అనుమతి ఇస్తారు.
రైలు మార్గం
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వెళ్లేవారు బేగంపేట్–ప్యారడైజ్ మార్గం మాత్రమే వాడాలి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.