)
Hyderabad goat theft incident smash by animal loyalty: చాలా మంది తమ ఇళ్లలో శునకాలు, పిల్లులు, మేకల్ని ఎంతో ప్రేమతో పెంచుకుంటారు. అంతే కాకుండా.. వీటికి తమ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ గాచూసుకుంటారు. ఎక్కడకు వెళ్లిన కూడా అస్సలు వదలరు. సరైన సమయంలో ఫుడ్, వాకింగ్ లకు తీసుకెళ్తారు. ప్రతినెల కూడా.. వెటర్నరీ డాక్టర్ దగ్గరకు తీసుకెళ్తారు. ఇదంతా మనం చూస్తుంటాం.
అయితే.. ఈ జీవాలు తమ యజమానులు లేకుంటే అస్సలు ఫుడ్ తీసుకొవు. తమ ఓనర్ చుట్టుపక్కల ఉండేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తాయి. ఈ నేపథ్యంలో వీటిని ఎవరైన చోరీలు చేసిన లేదా దూరంగా వదిలేసిన తిరిగి తమ ఇంటిని వెతుక్కుంటూ వస్తాయి.ఈ నేపథ్యంలో ప్రస్తుతం హైదరాబాద్ లో జరిగిన ఘటన వార్తలలో నిలిచింది.
హైదరాబాద్ పాతబస్తీలోని జియాగూడ మార్కెట్లో జరిగిన ఈ ఘటన అందరినీ ఆశ్చర్యపరిచింది. రంగారెడ్డి జిల్లా చౌదరిగూడ మండలం పెద్ది ఎల్కిచర్లకు చెందిన వెంకటయ్యకు 30 మేకలు ఉన్నాయి.కొన్నిరోజుల క్రితం గుర్తు తెలియని వ్యక్తులు వీరి మేకల్ని చోరీ చేశారు.
అప్పటి నుంచి వెంకటయ్య కుటుంబ సభ్యులు వాటి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. ఈ క్రమంలో 11న వెంకటయ్య కుమారుడు ప్రవీణ్, మేకల కోసం వెతుకుతూ జియాగూడ మార్కెట్‌కు వెళ్లాడు.
అప్పుడు ఒక కంటైనర్‌లో ఉన్న మేకలు.. ప్రవీణ్ ను చూసి గట్టిగా అరవడం ప్రారంభించాయి. అవి తమ ఓనర్ కొడుకును గుర్తుపట్టాయి. అయితే.. అతను ప్రతిరోజు మేకల్ని పిలిచే కోడ్ భాషలో గట్టిగా పిలిచాడు. వెంటనే ఆ మేకలన్ని కూడా ప్రవీణ్ దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చాయి. ఇంకా ఇవితమవే నంటూ పక్కాగా అతనికి తెలిసిపోయింది.
దీనిపై వారిని ప్రశ్నించగా.. రివర్స్ లో బెదిరింపులకు గురిచేశారు. తాము ఆ మేకలను రూ.25 లక్షలకు కొనుగోలు చేశామని, ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని వారు ప్రవీణ్ కు వార్నింగ్ ఇచ్చారు. వెంటనే ప్రవీణ్ తన తండ్రికి, కుల్సుంపుర పోలీసులకు సమాచారం అందించాడు. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన పోలీసులు వారిని తమదైన స్టైల్ లో విచారించగాచేసిన తప్పును అంగీకరించారు.
ఈ సమాచారంతో చౌదరిగూడ పోలీసులు.. పరిగికి వెళ్లి మిగతా ముగ్గురిని కూడా అరెస్ట్ చేశారు. వారి వద్ద దాచి ఉన్న సుమారు 200 మేకలను స్వాధీనం చేసుకున్నారు. మూగజీవాల విశ్వాసంతో ఒక పెద్ద దొంగల ముఠాను పోలీసులుకు చిక్కినట్లైంది. ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook