)
Hyderabad Rains: హైదరాబాద్ లో గత కొన్ని రోజులుగా ఎన్నడు లేనట్టుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాల నీట మునిగిపోతున్నాయి. మరోవైపు హైదరాబాద్ లో జూబ్లీహిల్స్, బంజారా హిల్స్ లో అన్నపూర్ణ స్టూడియో నుంచి ఎన్టీఆర్ ట్రస్ట్ భవనం వరకు వర్ష కాలంలో ఎప్పుడు నీళ్లు ప్రవహిస్తుంటాయి. అందులో డ్రైనేటీ నీళ్లే ఎక్కువగా ఉంటున్నాయి. ఎంత టెక్నాలజీ పెరిగిన పలు సాఫ్ట్ వేర్ కంపేనీల చుట్టు ఈ మురుగు నీరు చేరి అడుగు కింద పెట్టాలంటే భయపడే పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు సికింద్రాబాద్ లోని ఓలిఫాంట బ్రిడ్డి తో పాటు మెట్టుగూడ నుంచి సికింద్రాబాద్ వెళ్లే ప్రాంతాల్లో రైల్వే అండర్ బ్రిడ్జి కింద వర్షం పడినా పడకపోయినా.. ఓ వైపు మాత్రం 365 నీళ్లు నిలిచి ఉంటాయి. వాహన దారులు ఆ దారి గుండా ప్రయాణాలంటే గుండెలను అరచేతిలో పెట్టుకోవాల్సిందే.
అటు కేపీహెచ్ బీ నుంచి హైటెక్ సిటీ వెళ్లే ప్రాంతంతో పాటు కేపీహెచ్ బీ నుంచి బాచుపల్లి దారిలో కూడా వర్షం పడిదంటే చాలు అక్కడ నీరు రోడ్డుపై చేరి చెరువులను తలపిస్తున్నాయి. ముఖ్యంగా పాదచారులతో పాటు వాహనదారులకు ఎక్కడ గోతి ఉందో ఎక్కడ రోడ్డు వుందో తెలియని పరిస్థితి. అటు బేగంపేట నుంచి సికింద్రాబాద్ వెళ్లే రోడ్డుతో పాటు రామ్ నగర్, పాత బస్తీలోని కందికల్ గేట్ నల్లవాగుతో పాటు బాలాపూర్ చెరువు, కర్మన్ ఘాట్ నుంచి ఎయిర్ పోర్ట్ వెళ్ల రహదారితో పాటు చాంద్రాయణ గుట్ట నుంచి మైలార్ దేవ్ వెళ్లే దారిలో కూడా పలు చెరువులున్నాయి. అక్కడ వర్షం పడిదంటే పక్కనే ఉన్న చెరువుల్లోని నీరు రోడ్డుపై చేరి వాహనదారులతో పాటు పాదచారులను భయానికికి గురి చేస్తున్నాయి. మొత్తంగా నగర వ్యాప్తంగా ఇలాంటి ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి. జీహెచ్ ఎంసీ, హైడ్రా కూడా నిమ్మకు నీరెత్తినట్టు వర్షం పడినపుడే పనులు చేస్తున్నాయి. వర్షాలు పడితే ఎలాంటి ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవడం లేదని స్థానికంగా ఉండేవాళ్లు చెబుతున్న మాట. ఇక భారీ వర్షాలు, ప్రకృతి విపత్తులు వంటివి సంభవిస్తే.. ఎంతటి ప్రభుత్వాలైన ఏమి చేయలేవనేది కూడా ఉన్నమాట.
హైదరాబాద్ వాసులు మునుపెన్నడూ చూడని వరదలతో ఆగమాగం అవుతున్నారు. రెండు నెలలుగా నగరవాసులను భారీ వర్షాలు ముప్పతిప్పలు పెడుతోంది. చినుకు పడితే చాలు నగరం మొత్తం మునిగిపోతుంది. కాలనీలు కొట్టుకుపోతున్నాయి. ఇక బండ్లు ఓడలవుతున్నాయి. మనుషులు గల్లంతవుతున్నారు. బురద మేటలు వేస్తోంది. గతంలో ఎన్నడూ చూడని విపత్తును నగరవాసులు చూస్తున్నారు. వరుణ దేవుడు పగబట్టాడా అన్నట్టుగా వర్షాలు కురవడంపై ఆవేదన చెందుతున్నారు. ఉన్నట్టుండి భీకర వర్షం విరుచుకుపడటం, క్షణాల్లో వరద ముంచెత్తి మొత్తం తుడిచిపెట్టేయడం ఆందోళన కలిగిస్తోంది. ఇంకెన్ని రోజులు ఇలా అంటూ హైదరాబాదీలు గోడు వెల్లబోసుకుంటున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.