)
Musi River: గోదావరి ఫేజ్ 2, 3 శంకుస్థాపన కార్యక్రమంలో రేవంత్ రెడ్డి ప్రసంగించారు. '1908లో ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నిర్మించి నిజాం ప్రభుత్వం హైదరాబాద్ ప్రజలను వరదల నుంచి కాపాడింది. వందేళ్లకు పైగా ఈ నగరానికి తాగు నీరు అందుతున్నాయంటే ఆనాటి నిజాం సర్కార్ దూరదృష్టినే కారణం. కోటికిపైగా జనాభా ఉన్న హైదరాబాద్ నగరానికి తాగునీరు అందించేందుకు ప్రభుత్వాలు ఎంతో కృషి చేశాయి' అని తెలిపారు.
'1965లో మంజీరా నది నుంచి నగరానికి తాగునీరు అందాయి. 2002లో కృష్ణా నదీ జలాలను మూడు దశల్లో నగరానికి తరలించి ప్రజల దాహార్తిని తీరింది. గోదావరి జలాలను నెత్తి మీద చల్లుకుని తామే ఏదో చేసినట్టు కొందరు నమ్మించారు. నెత్తిమీద నీళ్లు చల్లుకున్నంత మాత్రాన పాపాలు తొలగిపోవు' అని రేవంత్ రెడ్డి ప్రకటించారు. మళ్లీ ఇప్పుడు గోదావరి జలాల తరలింపునకు ముందడుగు పడిందని తెలిపారు. 'కాలుష్యమయమైన మూసీతో నల్లగొండ జిల్లా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విషతుల్యమైన మూసీని ప్రక్షాళన చేస్తానని నల్లగొండ జిల్లా ప్రజలకు ఆనాడే మాట ఇచ్చా. 20 టీఎంసీల గోదావరి జలాలను హైదరాబాద్ కు తరలించబోతున్నాం' అని వెల్లడించారు.
'20 టీఎంసీల్లో 16 టీఎంసీలను హైదరాబాద్ తాగునీటి కోసం వినియోగించబోతున్నాం. చెరువులను నింపుకుంటూ 4 టీఎంసీలను మూసీకి తరలించి మూసీని ప్రక్షాళన చేస్తాం' అని రేవంత్ రెడ్డి ప్రకటించారు. 'శ్రీపాద ఎల్లంపల్లి నుంచే గోదావరి జలాలను హైదరాబాద్ తరలిస్తున్నాం. ఆ సంగతి మరిచిపోయి కొందరు మల్లన్నసాగర్ అని మాట్లాడుతున్నారు' అని మాజీ మంత్రి కేటీఆర్‌ను ఉద్దేశించి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు.
'చేవెళ్లలో వైఎస్ ప్రారంభించిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును కాసుల కక్కుర్తితో తలను తొలగించింది మీరు కాదా? చేవెళ్ల, తాండూరు, పరిగికి సాగునీరు అందకపోవడానికి కారణం మీరు కాదా? తుమ్మిడిహెట్టీ దగ్గర ప్రాణహిత చేవెళ్ల కట్టి ఆదిలాబాద్, రంగారెడ్డి జిల్లాల రైతులకు సాగునీరు అందిస్తాం' అని రేవంత్ రెడ్డి తెలిపారు. 'గంగా నది, యమునా, సబర్మతీ నదులు ప్రక్షాళన చేయొచ్చు. కానీ మేం మూసీ నదిని ప్రక్షాళన చేయొద్దా? పదేళ్లు అధికారంలో ఉన్నవాళ్లు ఎందుకు మూసీ నది ప్రక్షాళన చేపట్టలేదు' అని రేవంత్ రెడ్డి వివరించారు.
'ప్రపంచ స్థాయి నగరంగా హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేస్తాం. అభివృద్ధికి అందరూ కలిసి రావాలని కోరుతున్నా. మా విజన్ డాక్యుమెంట్‌ను డిసెంబర్ 9వ తేదీన తెలంగాణ సమాజానికి అంకితం ఇవ్వబోతున్నాం. ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా మా ప్రభుత్వం తిప్పికొడుతుంది' అని రేవంత్ రెడ్డి తెలిపారు. నగర అభివృద్ధిలో అందరూ కలిసిరావాలని పిలుపునిచ్చారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.