)
Woman molested by ar constable in hyderabad: మహిళల భద్రత ప్రస్తుతం దేశంలో పెనుసవాల్ గా మారిందని చెప్పుకొవచ్చు. ఇంట్లో నుంచి వెళ్లిన వారు మరల సెఫ్ గా తిరిగి వచ్చే వరకు కూడా టెన్షన్ గా మారిపోయింది. కామంధులు ప్రతిచోట దాపురించారు. పబ్లిక్ ప్రదేశాలు, ఆఫీసులు, మెట్రోలు.. ఎక్కడ చాన్స్ దొరికిన కూడా వేధింపులకు పాల్పడుతున్నారు.
పసిపాప నుంచి పండు ముసలి వరకు ఏ ఒక్కర్ని వదలడం లేదు. మొత్తంగా ప్రతిరోజు అమ్మాయిలపై వేధింపులకు చెందిన ఘటనలు ఎక్కువగా వార్తలలో ఉంటున్నాయి. మరోవైపు ఎవరికైన వేధింపులు, అన్యాయం జరిగితే వెంటనే పోలీస్ స్టేషన్ లలో వెళ్లి ఫిర్యాదులు చేస్తారు. అక్కడ కూడా కొంత మంది ఖాకీచకులు వేధింపులకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ప్రజలకు న్యాయం చేయాల్సిన పోలీసు పాడుపనులు చేశారు. హైదరాబాద్ లోని మధురానగర్ లో చోటు చేసుకున్న ఘటనపై నెట్టింట దుమారం చెలరేగింది.
హైదరాబాద్ లో గత కొన్ని నెలలుగా తరచుగా అనేక షాకింగ్ ఘటనలు జరుగుతున్నాయి. గ్యాంగ్ వార్ లు, చైన్ స్నాచింగ్ లు, అత్యాచారా ఘటనలు, ఇటీవల మరీ ఎక్కువగా వార్తలలో ఉంటున్నాయి. ఇక బస్టాండ్ లు, మెట్రోలు, రద్దీ ప్రాంతాల్లో యువతుల్ని టార్గెట్ చేసుకుని పోకీరిలు వేధిస్తుంటారు. అయితే.. మధురానగర్ లో ఒక కానిస్టేబుల్ పోకిరిలా మారాడు.
రోడ్డుపైన వెళ్తున్న మహిళ పట్లపాడు పనిచేశారు. మధురానగర్ లో ఒక మహిళ రోడ్డుమీద నడుచుకుంటూ వెళ్తుంది. ఇంతలో ఒక వ్యక్తి ఆమెను అసభ్యంగా ప్రైవేటు పార్ట్ లను తాకుతూ వెళ్లాడు. దీంతో ఆమె షాక్ కు గురైంది .
వెంటనే తన ఇంటికి చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు.. ఆ ప్రాంతంలోని సీసీటీవీని జల్లెడ పట్టి బైక్ నంబర్ ఆధారంగా యువకుడ్ని అదుపులోకి తీసుకున్నారు. అయితే.. అతను ఏఆర్ కానిస్టేబుల్ గా పోలీసులు గుర్తించారు. వెంటనే అతడ్ని అరెస్ట్ చేసిరిమాండ్ కు తరలించారు. ఈ ఘటన ప్రస్తుతం సంచలనంగా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook