Hanuman Jayanthi: హనుమాన్ శోభాయాత్ర సందర్భంగా హైదరాబాద్ లో పకడ్బందీ ఏర్పాట్లు..

Hanuman Jayanthi: తెలుగు క్యాలెండర్ ప్రకారం చైత్ర శుద్ధ పౌర్ణమిని హనుమాన్ జయంతిగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ  నెల ఏప్రిల్ 11న హనుమాన్ జయంతిని దేశ వ్యాప్తంగా భక్తులు ఎంతో కోలాహలంగా జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా భాగ్యనగరంలో ఎంతో అట్టహాసంగా హనుమాన్ శోభాయాత్ర జరగనుంది. దీని కోసం హైదరాబాద్ పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసారు.

Written by - TA Kiran Kumar | Last Updated : Apr 11, 2025, 07:34 PM IST
Hanuman Jayanthi: హనుమాన్ శోభాయాత్ర సందర్భంగా హైదరాబాద్ లో పకడ్బందీ ఏర్పాట్లు..

Hanuman Jayanthi: హనుమాన్ జయంతి సందర్భంగా నిర్వహించే శోభాయాత్రకు పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. భగవాన్ ఆంజనేయ స్వామి అంజనా దేవి, కేసరి దంపతులకు శివుడి అనుగ్రహంతో వాయు దేవుడి అంశతో హనుమాన్ జన్మించారు. హనుమాన్ అంటే గట్టి దవడలు కలిగిన వాడని అర్ధం. హను అంటే జ్ఞానం. కాబట్టి జ్ఞానవాన్ అనే అర్ధం. అజ్ఞానమును హనము చేయునది కనుక హనమ అని పేరు వచ్చింది. ఇక హైదరాబాదల్ హనుమాన్ జయంతి సందర్భంగా పెద్ద ఎత్తున హనుమాన్ శోభాయాత్రను నిర్వహించనునారు. భాగ్యనగరంలోని  గౌలిగూడలోని శ్రీ రామమందిరం నుంచి సికింద్రాబాద్ లోని తాడుబంద్‌లోని శ్రీవీరాంజనేయస్వామి ఆలయం వరకు హనుమాన్ జయంతి సందర్భంగా (ఏప్రిల్ 12) న చేపట్టనున్న వీర హనుమాన్‌ విజయయాత్ర నిర్వహించనున్నారు.

Add Zee News as a Preferred Source

ఇదీ చదవండి: Sri Rama Navami 2025: వెండితెరపై సీతమ్మ వారి పాత్రల్లో మెప్పించిన నటీమణులు..

ఇదీ చదవండి:  Sri Rama Navami 2025: వెండితెర శ్రీరాముళ్లు..

ఈ ర్యాలీ విజయవంతమయ్యేలా చర్యలు చేపడుతున్నట్లు నగర సీపీ సీవీ ఆనంద్‌ తెలిపారు. వీహెచ్‌పీ, భజరంగ్‌దళ్, ధార్మిక సంఘాల నాయకులతో కలిసి ఆయన మార్గాన్ని ఇప్పటికే  పరిశీలించారు. మొత్తం 42 ర్యాలీలు విజయయాత్రలో కలుస్తాయని వివరించారు. 17 వేల మంది సిబ్బంది, 3 వేల మంది అధికారులతో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు.

అలాగే హనుమాన్ జయంతి సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో భారీగా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. హనుమాన్ శోభాయాత్ర చేపట్టే ప్రాంతాల్లో ఆంక్షలు విధిస్తున్నట్లు నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. దీంతో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించాలని సూచించారు. దీనికి సంబంధించి శోభాయాత్ర రూట్‌మ్యాప్‌ను హైదరాబాద్ పోలీసులు తమ సోషల్‌ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేశారు.

READ ALSO:  Chiranjeevi: చిరంజీవికి భార్యగా..చెల్లిగా.. అక్కగా.. తల్లిగా నటించిన ఏకైక హీరోయిన్..

READ ALSO:  Prabhas Vs Venkatesh: కథ ఒక్కటే.. వెంకటేష్ డిజాస్టర్.. ప్రభాస్ బ్లాక్ బస్టర్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News