Hyderabad Rains: భాగ్యనగరంలో ఎండా కాలంలో కురిసిన అకాల వర్షంతో మరోసారి ప్రజలు తీవ్ర ఇక్కట్లపాలయ్యారు. ముఖ్యంగా హైదరాబాద్ లో ఐటీ కారిడార్ మాదాపూర్, జూబ్లీ హిల్స్, బేగంపేట తో పాటు ఆమీర్ పేట, బల్కంపేట, చత్రినాక, చార్మినార్, నాంపల్లి, కంచన్ బాగ్, బహదూర్ పుర ప్రాంతాల్లో కురిసి వర్షాలకు నగరంలో ఎక్కడి నీరు అక్కడే నిలిచిపోవడంతో పలు చోట్ల ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
వర్షాల వల్ల ఆఫీసు నుంచి ఇంటికి బయలు దేరిన వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లు చెరువులను తలపించాయి. పలు చోట్ల మ్యాన్ హోల్స్ పొంగిపొర్లాయి. ఇక జీహెచ్ఎంసీ, విద్యుత్, పోలీసు, డిజాస్టర్ మేనేజిమెంట్ సరైన సమయంలో స్పందించి ఎక్కడికక్కడ ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. కొన్ని చోట్ల వర్షాలకు తోడు ఈదురు గాలులు తోడు కావడంతో పలు చోట్ల చెట్లకు నేలకొరిగాయి. ఉదయం నుంచి భానుడు భగ భగ మనిపించినా.. సాయంత్రం మాత్రం ఒక్కసారి వరుణుడు విజృంభించాడు.
ఈదురు గాలుకు నగర వ్యాప్తంగా దాదాపు 60 చెట్లు నేలకొరిగాయి. బండ్లగుడ, కంచన్ బాగ్ ప్రాంతాల్లో అత్యధికంగా 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయింది. వర్షానికి ఈదురు గాలులు తోడు కావడంతో నగరంలో దాదాపు 200కి పైగా కాలనీల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. అటు హైదరాబాద్ పక్కనే ఉన్న సిద్దిపేట, మేడ్చల్ మల్కాజ్ గిరి, రంగారెడ్డి జిల్లాలో జోరు వానకు మామిడి పంటతో పాటు వరి, మొక్కజొన్న పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది.
ఇదీ చదవండి: బడా స్టార్స్ సహా 900 సినిమాల్లో నటించిన నటి.. భర్త చనిపోవడంతో తాగుడుకు బానిసై జీవితం నాశనం..
ఇదీ చదవండి: ఈ చెట్లు ఉంటే.. పాములకు మీ ఇంట్లోకి రెడ్ కార్పెట్ పరిచినట్టే.. తస్మాత్ జాగ్రత్త..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









