Hyderabad Rains: GHMC రెస్క్యూ టీమ్ బిగ్ ఆపరేషన్.. మూసీ నదిలో చిక్కుకున్న వారిని రక్షించిన సిబ్బంది..

Hyderabad Rains: గురువారం మధ్యాహ్నం నుంచి అర్ధరాత్రి వరకు కురిసిన వర్షాలతో నగరం అతలాకుతలమైంది. ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే సమయం కాబట్టి ప్రజలు తీవ్ర ఇక్కట్లను ఎదుర్కొన్నారు. ఇక భారీ వర్షాలకు తోడు ఈదురు గాలులు వీయడంతో పలు చోట్ల చెట్లు కూలడంతో పాటు హోర్డింగులు కింద పడ్డాయి. భారీ వర్షాల నేపథ్యంలో మూసీ నదిలో కొంత మంది చిక్కుకుపోయారు.

Written by - TA Kiran Kumar | Last Updated : Apr 4, 2025, 10:20 AM IST
Hyderabad Rains:  GHMC రెస్క్యూ టీమ్ బిగ్ ఆపరేషన్.. మూసీ నదిలో చిక్కుకున్న వారిని రక్షించిన సిబ్బంది..

Hyderabad Rains:తెలంగాణలో ఉపరితల ద్రోణి ప్రభావంతో హైదరాబాద్ పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడ్డాయి. దీంతో ఎండ వేడిమితో అల్లాడిన వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది.  పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వడగళ్ల వానలు కురవడంతో పాటు చెట్లు నేలకొరగడంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ స్థభించి పోయింది. నిన్న అత్యధికంగా  కామారెడ్డిలో అత్యధిక వర్షపాతం 65 నుంచి 100 మిల్లీ లీటర్లకు పైగా నమోదు అయింది. నిజామాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్, హైదరాబాద్ చిగురుటాకులా వణికింది.
 
ముఖ్యంగా హైదరాబాద్‌ మహా నగరంలో  కుంభవృష్టి కురిసింది. నేటి నుంచి మరో మూడు రోజుల పాటు ఇదే పరిస్థితి వుంటుందని వాతావరణశాఖ హెచ్చరించింది. ఈమేరకు ఈరోజు  కూడా ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. అవసరమైతేనే బయటకు రావాలని నగర వాసులకు వాతావరణశాఖ సూచించింది.  

Add Zee News as a Preferred Source

నిన్న సాయంత్రం నుంచి  అర్ధరాత్రి వరకూ  వాన దంచికొట్టింది.  నగరంలోని  పది కేంద్రాల్లో 9-8సెం.మీ మధ్య, మరో 12 కేంద్రాల్లో 8-7సెం.మీ వర్షం కురిసింది. మొత్తానికి  నగరంలోని  38 ప్రాంతాల్లో భారీగా వర్షం కురిసినట్లు వాతావరణశాఖ తెలిపింది. తెలంగాణలో  రానున్న మూడు రోజులు  భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.  ఈమేరకు రాష్ట్రంలో  22 జిల్లాలకు అలర్ట్ ప్రకటించింది.ఉపరితల ఆవర్తనం మరాఠ్వాడా, దానిని ఆనుకుని ఉన్న మధ్య మహారాష్ట్ర ప్రాంతంలో  సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఆవర్తనం ఏర్పడింది.  దీని ప్రభావంతో మూడు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.  ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు, వడగళ్లతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.  ఈ మేరకు ఉత్తర తెలంగాణలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.

READ ALSO:  Chiranjeevi: చిరంజీవికి భార్యగా..చెల్లిగా.. అక్కగా.. తల్లిగా నటించిన ఏకైక హీరోయిన్..

READ ALSO:  Prabhas Vs Venkatesh: కథ ఒక్కటే.. వెంకటేష్ డిజాస్టర్.. ప్రభాస్ బ్లాక్ బస్టర్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News