
Kukatpally murder accused arrested by Hyderabad police: హైదరాబాద్ లో కూకట్ పల్లి మైనర్ బాలిక హత్య ఘటన పెను సంచలనంగా మారింది. దీనిపై పోలీసులు సీరియస్ గా విచారణ చేపట్టారు. ఈనెల 18న మధ్యాహ్నం సమయంలో బాలిక సహస్ర ఇంట్లో ఉండగా.. తల్లిదండ్రులు ఇద్దరు కూడా రోజులానే తమ ఉద్యోగాలకు వెళ్లారు. తండ్రి మధ్యాహ్నం సమయంలో ఇంటికి వచ్చి చూడగా కూతురు రక్తపు మడుగులో పడింది. వెంటనే చుట్టుపక్కైల వారికి సమాచారం ఇచ్చాడు.
బాలికపై గొంతు పిసికి, 21 సార్లు కత్తితో పొడిచిన ఆనవాళ్లు పోస్ట్ మార్టంలో రిపోర్టులో బైటపడ్డాయి. ఈ క్రమంలో రంగంలోకి దిగిన పోలీసులు ఈ ఘటనలో పలు కోణాల్లో విచారణ చేపట్టారు. మొత్తంగా ఈ ఘటనకు సంబంధించిన ఎలాంటి క్లూలు దొరక్క పొవడంతో పోలీసులు పలు కోణాల్లోవీరి నివాసం ఉంటున్న చుట్టుపక్కల వారిని సైతంకొంత మందిని అదుపులోకి తీసుకుని విచారించారు.
చివరకు బాలిక తండ్రిని సైతం పోలీసులు అనుమానంతో విచారించారు. ఈ క్రమంలో పక్క బిల్డింగ్ లో ఉన్న ఒక బాలుడి కదలికలు అనుమానంగా ఉండటంతో పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. అతను పొంతనలేని సమాధానాలు చెప్పడంతో... తమదైన స్టైల్ లో విచారించారు. దీంతో ఈ ఘోరం తాను చేసినట్లు అంగీకరించాడు.
ఈ బాలుడు పదో తరగతి చదువుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. సహస్ర ఇంటి పక్కన బిల్డింగ్ లో ఉంటున్న బాలుడు ఉంటున్నాడు. ఇంట్లో ఎవరు లేరనుకొని చోరీకి వచ్చాడు. కానీ అప్పటికే బాలిక ఉండటంతో అతను చోరీ చేసుకుని వెళ్తుండగా ఆమె అడ్డుకుంది. దీంతో అతను బాలిక గొంతు పిసికి చంపేశాడు. అప్పటికే పక్కా ప్లాన్‌తో కత్తితో వచ్చాడు. బాలిక చనిపోయిందో లేదో అనుకుని.. ఆమెను ఇష్టమున్నట్లు 21 సార్లు కత్తితో పొడిచాడు. ఆ తర్వాత రూ. 80 వేలను తీసుకుని పారిపోయాడు.
అయితే.. దోంగతనంను ముందే పక్కా ప్లాన్ ప్రకారం పేరర్ మీద రాసి పెట్టుకుని మరీ బాలుడు చోరీ చేసినట్లు అధికారులు గుర్తించారు. ఇంగ్లీష్ లో దొంగతనం గురించి బాలుడు రాసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. బాలుడు పక్క బిల్డింగ్ నుండి లోపలికి వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. మొత్తంగా పోలీసులు ఎట్టకేలకు కూకట్ పల్లి బాలిక మర్డర్ కేసును ఛేదించారు. ప్రస్తుతం బాలుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు తదుపరి చర్యలకు సిద్దమౌతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి