Mayasabha: ఆసక్తి రేకిత్తిస్తోన్న ‘మయసభ’ ట్రైలర్.. సాయి దుర్గ తేజ్ ప్రశంసల ఝల్లు..

Mayasabha Trailer Talk: ప్రస్తుతం మేకర్స్ బయోపిక్స్ పై దృష్టి సారిస్తున్నారు. ఈ రూట్లో సినిమాలతో పాటు బయోపిక్స్ ను తెరకెక్కిస్తున్నారు. ఇపుడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మాజీ సీఎం వైయస్ రాజశేఖర్ రెడ్డి పోలిన పాత్రలతో ‘మయసభ’ అనే పొలిటికల్  థ్రిల్లర్ నేపథ్యంలో వెబ్ సిరీస్ రాబోతుంది. తాజాగా ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ ను విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వస్తోంది. 

Written by - TA Kiran Kumar | Last Updated : Aug 1, 2025, 07:40 AM IST
Mayasabha: ఆసక్తి రేకిత్తిస్తోన్న ‘మయసభ’ ట్రైలర్.. సాయి దుర్గ తేజ్ ప్రశంసల ఝల్లు..

Mayasabha Trailer Talk: ప్రస్తుతం తెలుగు నాట  ‘మయసభ : రైజ్ ఆఫ్ ది టైటాన్స్’ వెబ్ సిరీస్ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. బహుముఖ ప్రజ్ఞాశాలి ఫిల్మ్ మేకర్ దేవా కట్టా, కిరణ్ జయ కుమార్ ద్వయం దర్శకత్వంలో హిట్ మ్యాన్ అండ్ ప్రూడోస్ ప్రొడక్షన్స్ ఎల్.ఎల్.పి బ్యానర్స్‌పై విజయ్ కృష్ణ లింగమనేని, శ్రీహర్ష ఈ వెబ్ సిరీస్‌ను నిర్మించారు. ఇక ‘మయసభ’ సిరీస్ టీజర్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.  ఇక ఈ సిరీస్‌ను ఆగస్ట్ 7 నుంచి ప్రముఖ ఓటీటీ సోనీ లివ్ లో  స్ట్రీమింగ్ కు రాబోతుంది. తాజాగా ఈ వెబ్ సిరీస్  ట్రైలర్‌ లాంఛ్ ఈవెంట్ భాగ్యనగరంలో ఘనంగా జరిగింది.  అంతేకాదు ట్రైలర్ కు విశేష స్పందన వస్తోంది. 

Add Zee News as a Preferred Source

ఈ సందర్భంగా సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్ మాట్లాడుతూ ..* ‘దేవా కట్టాతో నాది పదేళ్ల జర్నీ. ‘ఆటోనగర్ సూర్య’ చూసిన వెంటనే దేవా గారికి ఫోన్ చేసి మాట్లాడాను. అప్పటి నుంచి మా ప్రయాణం మొదలైంది. అలా ఆ ప్రయాణం నుంచి ‘రిపబ్లిక్’ వచ్చింది. ‘రిపబ్లిక్’ టైంలో జరిగిన ఘటనలో నాకు ఎప్పుడూ అండగా నిలిచారు. ఇప్పుడు ఇలా మళ్లీ దేవా కట్టా  కోసం ఇలా ఈవెంట్‌కు రావడం జరిగిందన్నారు.   ‘మయసభ’ గురించి గతంలోనే ఎప్పుడో చెప్పారు. ఆది, చైతన్య నాకు చాలా ఏళ్ల నుంచి తెలుసు. 30 వెడ్స్ 21 చూసి మా అమ్మ నన్ను పెళ్లి గురించి అడుగుతూ ఉండేవారు. అలా నా లైఫ్‌లో చైతన్య విలన్‌లా మారిపోయాడు. ‘రిపబ్లిక్’ సమయంలో సాయి కుమార్ నాకు ఎంతో సపోర్ట్ ఇచ్చారు. ‘మయసభ’ ఈవెంట్‌కు రావడం హ్యాపీగా  ఉంది. ఈ సిరీస్ అద్భుతాలు సృష్టించాలని కోరుకుంటున్నానన్నారు. 

దేవా కట్టా మాట్లాడుతూ ..*‘మా కోసం వచ్చిన మా డియర్ బ్రదర్ తేజ్‌కు థాంక్స్. ‘మయసభ’ అనేది అందమైన ఊహ. ఇద్దరు ప్రాణ స్నేహితుల ప్రయాణమే ఈ స్టోరీ . పరిస్థితుల వల్ల వారిద్దరి మధ్య ఎలాంటి అగాథం ఏర్పడింది. ఈ కాన్సెప్ట్ నాకు చిన్నప్పటి నుంచీ మెదడులో కదులుతూనే ఉండేదన్నారు.  అయితే శ్రీ హర్ష అనే వ్యక్తి నా వద్దకు వచ్చి ఏపీ రాజకీయాల గురించి మాట్లాడారు. అప్పుడు మొదలైందే ఈ ‘మయసభ’ సిరీస్.  ముందుగా మూడు పార్టులుగా సినిమాకు సంబంధించిన కథ రాసుకున్నాను. అయితే సినిమాగా తీయడం అంటే మామూలు విషయం కాదు. ఆ తరువాత ఇదే కథను ఓ సిరీస్‌లా ఓ సీజన్‌ను రాసుకున్నాను. ‘మయసభ’ ఇక్కడి వరకు రావడానికి చాలా టైం పట్టిందన్నారు. . ధనీష్‌ను కలిసిన తరువాతే ‘మయసభ’కు ఈ లుక్ వచ్చింది. స్కామ్, మహారాణి వంటి ఎన్నో సెన్సేషనల్ సిరీస్‌లను సోనీ లివ్ అందించింది. సోనీ నుంచి అద్భుతమైన కథలు వచ్చాయన్నారు. వారి వద్దకు ఏదో ఒక ప్రాజెక్ట్ కోసం వెళ్లాను. అప్పుడు ధనీష్ కలిశారు. ఆయనకు ‘మయసభ’ పాయింట్ చెప్పాను. ఆయనకు అద్భుతంగా నచ్చేసింది. ఆయన వల్లే ఈ ప్రాజెక్ట్ జనాల్లోకి వెళ్లిందన్నారు. 

కిరణ్ నాతో ఎన్నో ఎళ్ల నుంచి ప్రయాణిస్తున్నారు. బాహుబలి, రిపబ్లిక్ టైంలోనూ ఆయన నాకు రైటింగ్ టైంలో తోడు నిలిచారు. విజయ్ నాకు ఎప్పుడూ సపోర్ట్ ఇస్తూనే ఉంటారన్నారు. విజయ్ వల్లే ‘ప్రస్థానం’ వచ్చింది. ఈ ప్రాజెక్ట్‌కి కూడా విజయ్ బ్యాక్ బోన్‌‌లా నిలిచారన్నారు.  ఆది నటన అంటే నాకు చాలా ఇష్టం. హీరో, విలన్, ఏ పాత్ర అయినా కూడా అద్భుతంగా నటించేస్తారు. ఈ కథ అనుకున్న వెంటనే నాకు ఆది గుర్తుకు వచ్చారు. ఆదిని మ్యాచ్ చేసేందుకు చైతన్య కష్టపడ్డారు  ఈ ప్రాజెక్ట్ కోసం 264 మందిని తీసుకున్నామన్నారు. 

*సోనీ లివ్ బిజినెస్ హెడ్ ధనీష్ కాంజీ మాట్లాడుతూ ..* ‘మా ‘మయసభ’ ఈవెంట్‌కు వచ్చిన సాయి దుర్గ తేజ్ కు థాంక్స్. కరోనా కంటే కాస్త ముందుగా మా ఓటీటీ సంస్థను ప్రారంభించాము. మన భారతీయ కథల్ని ప్రపంచ వ్యాప్తంగా చూపించాలని అనుకున్నాం. అందులో భాగంగా హిందీ, మలయాళంలో గొప్ప గొప్ప కథల్ని తెరకెక్కించాము. ఇక బ‌ృందాతో కలిసి మేం మొదటగా సిరీస్ చేశామన్నారు. ఇప్పుడు తెలుగులో ‘మయసభ’ అనే అద్భుతమైన సిరీస్‌ను నిర్మించామన్నారు. శక్తి మ్యూజిక్ ఈ సిరీస్‌కు ప్రత్యేక ఆకర్షణ. 2022లో ఈ కథను దేవా కట్టా గారు మాకు వినిపించారు. సోనీ లివ్‌లో ఇదొక గొప్ప సిరీస్‌గా నిలిచిపోతుందన్నారు.  ఈ సిరీస్ ఆగస్ట్ 7న సోనీ లివ్‌లో స్ట్రీమింగ్ కు రానుందన్నారు. 

ఆది పినిశెట్టి మాట్లాడుతూ ..* ‘మా ఈవెంట్‌కు వచ్చి సపోర్ట్ చేసిన సాయి దుర్గ తేజ్ కు ప్రత్యేక ధన్యవాదాలు. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ ఉన్న ప్రాజెక్ట్ చేయాలని నాకు ఎప్పటి నుంచే ఉండేది. దేవా కట్టా  ‘మయసభ’ను అద్భుతంగా రాశారు. అంతే అద్భుతంగా తెరకెక్కించారు. చైతన్య రావ్ అద్భుతమైన నటుడు. ‘మయసభ’ ఆగస్ట్ 7 నుంచి సోనీ లివ్‌‌‌లోకి స్ట్రీమింగ్ కు రాబోతుంది. ‘ప్రస్థానం’, ‘రిపబ్లిక్‌’‌లా ‘మయసభ’ నిలిచిపోతుందన్నారు. రెండో సీజన్ కోసం నేను ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నాన్నారు. 

*చైతన్య రావ్ మాట్లాడుతూ ..* ‘మా కోసం వచ్చిన తేజ్‌కు థాంక్స్. దేవా కట్టా  చేసిన ‘వెన్నెల’ నాకు చాలా ఇష్టం. ఇంత మంచి పాత్రను ఇచ్చిన ఆయనకు ధన్యవాదాలు. ఈ ప్రయాణంలో నాకు కిరణ్ అన్న ఎంతో సహకరించారు. శక్తి అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. నిర్మాత హర్ష గ చాలా మంచి వ్యక్తి. దివ్యా మేడం, నాజర్  సాయి కుమార్ వంటి యాక్టర్లతో పని చేయడం తన అదృషమన్నారు.  ఆదితో నటించడం ఛాలెంజింగ్‌గా అనిపించింది. నేను ఈ ఇండస్ట్రీలో ఉన్నంత వరకు ‘మయసభ’ ఎప్పటికీ ప్రత్యేకంగానే నిలుస్తుందన్నారు. 

*నిర్మాత శ్రీ హర్ష మాట్లాడుతూ ..‘మయసభ’ కోసం పని చేసిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు. ఎనిమిదేళ్ల క్రితం కలలు కన్న ప్రాజెక్ట్‌కి ఇప్పుడు కార్యరూపం దాల్చింది.  

నిర్మాత విజయ్ కృష్ణ లింగమనేని మాట్లాడుతూ ..* ‘‘మయసభ’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు వచ్చిన తేజ్ కి థాంక్స్. దేవా  ఈ ప్రాజెక్ట్‌ని అద్భుతంగా తెరకెక్కించారన్నారు. ఆది, చైతన్య రావు, సాయి కుమార్ ఇలా అందరూ అద్భుతంగా నటించారన్నారు. శక్తి కాంత్ మ్యూజిక్ అద్భుతంగా వచ్చింది. ఈ సిరీస్ అందరినీ ఆకట్టుకునేలా ఉంటుందన్నారు.  

ఇదీ చదవండి:   మాజీ ఎంపీ..  ఏకంగా మాజీ ప్రధానితో  ఎఫైర్.. నాగ్ సరసన నటించిన స్టార్ హీరోయిన్.. 

ఇదీ చదవండి:   చిన్న చిత్రం అసాధారణ విజయం.. బాలీవుడ్ బాక్సాఫీస్ ను షేక్ చేస్తోన్న ‘సైయారా’ మూవీ..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News