)
Musi Floods: భాగ్యనగరాన్ని మూసి వణికిస్తోంది. ఎన్నడు లేనట్టుగా హైదరాబాద్ కు పెను గండం ముంచుకొచ్చింది. కొన్ని రోజులుగా గ్యాప్ లేకుండా కురుస్తోన్న భారీ వర్షాలతో కృష్ణా నది ఉప నది అయిన మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో ఎగువన ఉన్న హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ లు నిండి పోవడంతో గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 35 వేల క్యూసెక్కుల నీటిని వదలడంతో మూసీ పొడవునా భయాందోళనలు నెలకొన్నాయి. దీంతో అత్తపూర్, లంగర్ హౌస్, కార్వాన్, పురానపూల్, నయాపూల్ తో పాటు చాదర్‌ఘాట్ లోలెవల్ వంతెన పైనుంచి ఆరు అడుగుల మేర...., మూసారాంబాగ్ వంతెనపై నుంచి 10 అడుగుల మేర వరద ప్రవహిస్తోంది. ముఖ్యంగా ఎంజీబీఎస్‌లోకి వెళ్లే రెండు బ్రిడ్జిలు నీట మునిగాయి. మూసీ వరద బస్డాండ్‌లోకి చేరింది. వేల మంది ప్రయాణికులు బస్డాండ్‌లో చిక్కుకుపోయారు. ప్రయాణికులను సురక్షితంగా బయటికి తీసుకురావాలని సీఎం రేవంత్‌రెడ్డి పోలీసు, హైడ్రా, జీహెచ్ఎంసీ అధికారులను అప్రమత్తం చేశారు.
పరిస్థితిని స్వయంగా అర్ధరాత్రి సమీక్షించారు. మూసీ అంతకంతకు పెరగడంతో పరీవాహక కాలనీల్లో జనాలు అర్ధరాత్రి బిక్కుబిక్కుమంటూ గడిపారు. ఈ పరిస్థితి ఇంకా ఎన్నాళ్లు ఉంటుందని ప్రజలు బెంబేలేత్తుతున్నారు. కనీవినీ ఎరగని రీతిలో వరదల ముంచెత్తడంతో ప్రజలు దిక్కు తోచని స్థితి నెలకొంది.
మరోవైపు వాయుగుండం ప్రభావం తెలంగాణపై ఎక్కువగా వుంది. దీంతో ఇవాళ , రేపు తెలంగాణలో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరతణ శాఖ హెచ్చరించింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల్లో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.
హైదరాబాద్ లో మరో రెండు రోజులు వర్షాలు పడే అవకాశం ఉండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా పోయింది. మిగతా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు ప్రజలకు సూచించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.