Hyderabad: హైదరాబాద్ వాహనదారులకు గుడ్‌న్యూస్‌.. నగరంలో రూ. 345 కోట్లతో మరో ఫ్లైఓవర్‌

GHMC: హైదరాబాద్ వాహనదారులకు అదిరిపోయే శుభవార్త. జీహెచ్‌ఎంసీ పరిధిలో ట్రాఫిక్ సమస్యను తప్పించేందుకు మరో ఫ్లైఓవర్‌ అందుబాటులోకి రానుంది. దీంతో సికింద్రాబాద్, ఉప్పల్, ఎల్బీనగర్‌ నుంచి శంషాబాద్‌ విమానాశ్రయం వెళ్లే వెహికిల్స్‌ సిగ్నల్‌ ఫ్రీగా వెళ్లే అవకాశం ఉంటుంది.  

Written by - Aruna Maharaju | Last Updated : Jan 20, 2026, 04:02 PM IST
Hyderabad: హైదరాబాద్ వాహనదారులకు గుడ్‌న్యూస్‌.. నగరంలో రూ. 345 కోట్లతో మరో ఫ్లైఓవర్‌

Rs 345 Crore Flyover Project Hyderabad: హైదరాబాద్ వాహనదారులకు అదిరిపోయే శుభవార్త. జీహెచ్‌ఎంసీ పరిధిలో ట్రాఫిక్ సమస్యను తప్పించేందుకు మరో ఫ్లైఓవర్‌ అందుబాటులోకి రానుంది. దీంతో సికింద్రాబాద్, ఉప్పల్, ఎల్బీనగర్‌ నుంచి శంషాబాద్‌ విమానాశ్రయం వెళ్లే వెహికిల్స్‌ సిగ్నల్‌ ఫ్రీగా వెళ్లే అవకాశం ఉంటుంది. ఈ ప్రాజెక్టును 345 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో జీహెచ్‌ఎంసీ చేపట్టనుంది. 

Add Zee News as a Preferred Source

హై సిటీ-హైదరాబాద్‌ సిటీ ఇన్నోవేటివ్‌ అండ్‌ ట్రాన్స్‌ఫార్మేటివ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ప్రాజెక్ట్‌ కింద 6 లేన్లతో ఫ్లై ఓవర్‌ పనులు త్వరలోనే షురూ కానున్నాయి. ఈ ప్రాజెక్టు కోసం టెండర్లు  ఆహ్వానించినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. కాటేదాన్‌ జంక్షన్‌ వద్ద మూడు లేన్లతో డౌన్‌ర్యాంప్‌ ఉంటుంది. టెండర్‌ ద్వారా ప్రాజెక్ట్‌ దక్కించుకునే ఏజెన్సీయే సర్వే, డిజైన్, డ్రాయింగ్స్, నిర్మాణ పనులు చేయాల్సి ఉంది. కాంట్రాక్టు అగ్రిమెంట్‌ జరిగినప్పటి నుంచి రెండు సంవత్సరాల్లో పనులు పూర్తి కావాలి. 

యుటిలిటీ షిఫ్టింగ్, ఫుట్‌పాత్‌లు, ల్యాండ్‌స్కేపింగ్, సైనేజీలు, లైటింగ్, పేవ్‌మెంట్‌ మార్కింగ్స్‌ తదితర పనులు కూడా చేయాలి. మెట్రోకు సమాంతరంగా.. ఎయిర్‌పోర్ట్‌ మెట్రోలైన్‌కు పక్క నుంచి ఈ ఫ్లై ఓవర్‌ రానుంది. ఫ్లై ఓవర్‌ కంటే మెట్రోమార్గం ఎక్కువ ఎత్తులో ఉంటుంది. దీంతోపాటు టీకేర్‌ కాలేజ్‌ జంక్షన్, గాయత్రినగర్‌ జంక్షన్, మంద మల్లమ్మ జంక్షన్‌ల మీదుగా ఆరు లేన్లతో మరో ఫ్లైఓవర్‌ పనులకు టెండర్ల గడువు ముగిసింది. టెండర్లు ఖరారు కావాల్సి ఉంది.    

ఈ ఫ్లైఓవర్‌ పూర్తయితే.. విమానాశ్రయానికి వెళ్లేవారు మైలార్‌దేవ్‌పల్లి, కాటేదాన్‌ జంక్షన్‌ల వంటివాటి వద్ద వాహనాలను ఆపకుండానే వెళ్లిపోవచ్చు. ఇరు వైపులా సాఫీగా ప్రయాణం సాగుతుంది. అంతేగాక, షాద్‌నగర్‌తో పాటు మహబూబ్‌నగర్, అత్తాపూర్, మెహదీపట్నం వెళ్లే వారికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఈ 6 లేన్లతో ఫ్లై ఓవర్‌ పనులు పూర్తయితే వాహనదారులు ఆయా మార్గాల్లో ట్రాఫిక్‌ సమస్యల నుంచి తప్పించుకోవచ్చు.

Also Read: Pan Card Loan: బ్యాంక్‌కు వెళ్లాల్సిన పనిలేదు.. పాన్ కార్డ్‌తో రూ. 5 లక్షల లోన్.. 24 గంటల్లో డబ్బు మీ అకౌంట్‌లో..!

Also Read: WPL 2026: డ‌బ్ల్యూపీఎల్‌లో స్మృతి మంధాన సేన‌ దూకుడు.. ప్లేఆఫ్స్‌లో అడుగుపెట్టిన ఆర్సీబీ..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Aruna Maharaju

అరుణ మహరాజు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. లైఫ్‌స్టైల్‌, హెల్త్‌,  స్పోర్ట్స్, వినోదం, జాతీయ, అంతర్జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో ఆరేళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News