)
కథ విషయానికొస్తే..మాజీ హోం మంత్రి, పార్టీకి నమ్మిన బంటు. నంది కిషోర్ పౌర సరఫరా శాఖలో జరిగిన భారీ స్కామ్ ను బట్టబయలు చేస్తాడు. దీంతో ఇతను ఒక్కసారిగా రాష్ట్రంలో కీలక వ్యక్తిగా మారతాడు. స్కామ్ ను బయటపెట్టడంతో ప్రజల్లో ఇతని పలుకుబడి కూడా అదే రేంజ్ లో పెరుగుతుంది. తాము చేసే అవినీతిని బయటపెట్టడాడనే కసితో కొంత మంది అతనికి వ్యతిరేకంగా తయారవుతాడు. ఇక నంది కిషోర్‌ను హత మార్చేందుకు కుల్దీప్ను హైర్ చేస్తుంది ఈ మాఫియా. ఈ క్రమంలో ఆపరేషన్ పద్మ అని అవంతిక నేతృత్వంలో ఓ టీంని ఏర్పాటు చేస్తారు. ఈ టీంలో వాసు, రమణ, పద్మ అకా సుధ, రూప వంటి వారు టీం మెంబర్లుగా ఉంటారు. మరి కిల్లర్‌ను పట్టుకునేందుకు ఆపరేషన్ పద్మ టీమ్ ఏం చేసింది. ప్రజలకు మంచి చేస్తోన్న నంది కిషోర్ ను ఈ టీమ్ కాపాడగలిగిందా.. ? లేదా అనేదే ఆపరేషన్ పద్మ స్టోరీ.
కథనం, టెక్నికల్ విషయానికొస్తే..
తెలుగులో రాజకీయ చదరంగం నేపథ్యంలో పలు చిత్రాలు వచ్చాయి. ముఖ్యంగా ఇలాంటి కథల్లో ముఖ్యంగా ప్రభుత్వంలో ఉన్న కొందరు అందులోని లొసుగులను ఉపయోగించుకొని .. ప్రజలకు దక్కాల్సిన వాటిని వారికి పూర్తిగా దక్కకుండా అడ్డదారుల్లో ఆంబోతుల్లా భోంచేసే వాళ్లు బోలేడు మంది ఉన్నారు. అలాంటి అవినీతి పరులను బట్టబయలు చేసి వారి చేసిన స్కామ్ ను బయటపెట్టడం అనే కాన్సెప్ట్ తో పలు చిత్రాలు తెరకెక్కినా.. తాజాగా కార్తికేయ ఈ సినిమాను అలాంటి కాన్సెప్ట్ ను ఎంచుకోవడం ఒక ఎత్తు. దాని అదే రీతిలో ఎక్కడా పట్టు తప్పకుండా చివర వరకు నడిపించిన తీరు పర్వాలేదనిపిస్తోంది. ముఖ్యంగా అవినీతి పరులు తమ అవినీతి బయటపెట్టే వ్యక్తిని .. చంపాలనుకుంటారు. ఇందుకోసం ఓ కిల్లర్ ను హైర్ చేయడం.. దాన్ని ఇంటెలిజెన్స్ డిపార్ట్ మెంట్ ముందే కనిపెట్టే క్రమంలో చోటు చేసుకునే సీన్స్.. యాక్షన్ తో పాటు ఉత్కంఠను రేకెత్తిస్తోంది. మొత్తంగా సినిమా చూస్తోన్న ప్రేక్షకులకు ఓ మైండ్ గేమ్ లాగనే ఉంటుంది.
సమాజంలో పెద్ద మనుషులుగా చెలామణి అయ్యే వారి సీక్రెట్ వ్యవహారాల చుట్టూ ఈ సినిమా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ ఓ పార్టీ.. ఆ తర్వాత అందులో అధికార పార్టీలో ఉండే ఓ వ్యక్తి ప్రభుత్వంలో జరిగిన స్కామ్ ను బయటపెట్టడంతో అతను మిగతా వాళ్లకు టార్గెట్ కావడం.. హైర్ కిల్లర్.. అవినీతిని బట్టబయలు చేసిన విజిల్ బ్లోయర్ ను చంపాలనుకోవడం.. అతన్ని కాపాడాడానికి ఆపరేషన్ పద్మ టీమ్ పడే కష్టంతో పాటు విలన్ ఎత్తులకు ఆపరేషన్ పద్మ టీమ్ వేసే పై ఎత్తులు మాస్ ప్రేక్షకులను మెప్పిస్తాయి. నిర్మాణ విలువలతో పాటు సినిమాటోగ్రఫీ బాగుంది. తెరపై ఖర్చు పెట్టిన ప్రతి పైసా కనబడుతుంది.
నటీనటుల విషయానికొస్తే..
రణధీర్ బీసు కుల్దీప్ పాత్రలో స్టైలీష్ పర్ఫామెన్స్తో అట్రాక్ట్ చేసాడు. అతని సీన్లో లేకపోయినా కూడా ఆ ఇంపాక్ట్‌ను మాత్రం సినిమా మొత్తం కనిపిస్తూ ఉంటుంది. డిటెక్టివ్ టీమ్ లో ఉణ్న వారంతా చక్కని నటన కనబరిచారు. ముఖ్యంగా రఘుపతి రెడ్డి గుండా, రజిత శాండీ నటన ఆకట్టుకుంటుంది. ఈ చిత్రంలోని ఉమెన్ కారెక్టర్స్ అన్నీ కూడా హై ఎనర్జిటిక్ గా కనిపిస్తాయి. మిగిలిన పాత్రలన్నీ కూడా పరిధి మేరకు మెప్పిస్తాయి.
చివరి మాట.. యాక్షన్ పొలిటికల్ థ్రిల్లర్ ఇష్టపడే ప్రేక్షకులకు ‘ఆపరేషన్ పద్మ’ నచ్చుతుంది.. ఈ వీకెండ్ సరదగా ఫ్యామిలీతో చూడొచ్చు.
రేటింగ్: 2.5/5
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.