Hyderabad: గ్లోబల్ సమ్మిట్ వేళ హైదరాబాద్‌ ఉలిక్కిపడే ఘటన..నడి రోడ్డు మీద రియల్టర్ దారుణ హత్య..

Real estate man murdered in Hyderabad: స్కూటీపై వెళ్తున్న రియల్టర్ ను దుండగులు వెంబడించి మరీ కత్తితో దారుణంగా హతమార్చారు. దీంతో అతను ఘటనస్థలంలోనే రక్తపు మడుగులో మునిగిపోయాడు.  ఈ ఘటన జవహర్ నగర్ లో చోటు చేసుకుంది.  

Written by - Inamdar Paresh | Last Updated : Dec 8, 2025, 11:33 AM IST
  • హైదరాబాద్ లో దారుణం..
  • నడిరోడ్డు మీద రియల్టర్ హత్య..
Hyderabad: గ్లోబల్ సమ్మిట్ వేళ హైదరాబాద్‌ ఉలిక్కిపడే  ఘటన..నడి రోడ్డు మీద రియల్టర్ దారుణ హత్య..

Real estate business man brutally murdered in Jawahar nagar: ఇటీవల హైదరాబాద్ లో శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పాయని చెప్పుకొవచ్చు. ఎక్కడ చూసిన గ్యాంగ్ వార్ లు, తరచుగా మర్డర్ లు, చోరీలు ఎక్కువగా వార్తలలో ఉంటున్నాయి. పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్న కూడా క్రైమ్ లు మాత్రం ఆగడంలేదు. దీంతో హైదరాబాద్ లో శాంతి భద్రతలపై ప్రజలు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సీపీ సజ్జనార్ ఆధ్వర్యంలో రాత్రిళ్లు పలు చోట్ల నాకా బంధీ నిర్వహించి రాత్రి పూట సోదాలు నిర్వహించారు.

Add Zee News as a Preferred Source

అయిన కూడ పలు చోట్ల ఆధిపత్యం కోసం గ్యాంగ్ వార్ లు మాత్రం ఆగడంలేదు. తాజాగా.. హైదరాబాద్ లోని జవహర్ నగర్ లో దారుణ హత్య ప్రస్తుతం హైదరాబాద్ వాసుల్ని ఉలిక్కిపడేలా చేసింది. హైదరాబాద్ లోని మల్కాజిగిరి పరిధిలోని జవహర్ నగర్ లో రియల్టర్ దారుణహత్యకు గురయ్యాడు.  సోమవారం ఉదయం మల్కాజిగిలోని జవహర్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఉన్న సాకేత్‌ కాలనీలో ఈ ఘటన సంభవించింది.

ఫోస్టర్‌ బిల్లాబాంగ్‌ స్కూల్‌ సమీపంలో ..  వెంకటరత్నం అనే రియల్టర్‌ తన స్కూటీమీద వెళ్తున్నాడు. ఇంతలో అతడ్ని వెంబడించిన కొంత మంది దుండగులు కత్తులతో, గన్ తో కాల్చి అత్యంత దారుణంగా హతమార్చారు. దీంతో రియల్టర్ ఘటనస్థలంలో రక్తపు మడుగులో విగత జీవిలా మారిపోయాడు.  స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.  

పోలీసులు వెంటనే.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. ఘటన స్థలంకు చేరుకున్న రియల్టర్ కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదిస్తున్నారు.  ఈ క్రమంలో కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. మరోవైపు.. ఇప్పటికే రియల్టర్ వెంకటరత్నంపై ధూల్‌పేట పోలీస్‌స్టేషన్‌లో రౌడీషీట్‌ నమోదై ఉన్నట్లు గుర్తించారు.

Read more: Telangana global Summit 2025: అరెవావ్.. గ్లోబల్ సమ్మిట్ అతిథులకు అదిరిపోయే యమ్మీ.. యమ్మీ వంటకాలు.. లిస్ట్ ఇదే..

దీనితో పాటు జంట హత్యల కేసులో ఇతగాడు నిందితుడిగా ఉన్నట్లు తేలింది. ఈ క్రమంలో ప్రతీకారంతో ప్రత్యర్ధులే చంపి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. హైదరాబాద్ లో గ్లోబల్ సమ్మిట్ వేళ ప్రజలను  ఈ ఘటన ఉలిక్కిపడేలా చేసింది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News