)
Sasivadane Trailer Trailer Talk Review :‘ప్రేమించాలని డిసైడ్ అయితే ఎన్నొచ్చిన యుద్ధం చేయాల్సిందే’ అని ‘శశివదనే’ సినిమా ట్రైలర్ లో చూపించారు. ఈ చిత్రాన్ని సాయి మోహన్ ఉబ్బన డైరెక్షన్ చేశారు. అక్టోబర్ 10న ఈ సినిమా రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.‘గల గల పారే ఏపీ గోదావరి జిల్లా నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్టు ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. అక్కడమైన అందమైన గోదారి పల్లెటూరు అమ్మాయిని చూడగానే తొలి చూపులోనే అబ్బాయికి లవ్ పుడుతుంది. ‘లంకలోని సీత కోసం రాముడు సముద్రాలు దాటినట్లు.. నీ సైకిల్ పాప కోసం నువ్వు ఈ గోదారి దాటుతున్నావన్నమాట’ అనే డైలాగ్ తో ఈ సినిమా ఎలా ఉండబోతుందో చెప్పారు మేకర్స్. చివరకు హీరోయిన్ కనపడగానే హీరో పడే భావోద్వేగ సీన్స్ ఆడియన్స్ ను అట్రాక్ట్ చేసేలా ఉన్నాయి.
ఆడపిల్లలు మన జీవితంలోకి కోరికలతోను, ఆశలతోను రారురా..జీవితంలో తోడుగా ఉంటామని భరోసాతో వస్తారనే డైలాగ్ ఆకట్టుకునే విధంగా ఉంది. మనతో చెయ్యి పట్టుకుని ఏడడుగులు నడుస్తారన్నారు. ‘నాకు ఊహ తెలియని వయసు నుంచి నా అనుకున్న బంధం నాన్న.. ఊహ తెలిసిన తర్వాత నా అనుకున్న బంధం మీరు’ అంటూ హీరోయిన్‌కి హీరో తన ప్రేమను చెబితే.. ‘ఇంత ప్రేమ నా నుంచి ఎప్పటికీ దూరం కాదుగా రాఘవ’ అంటూ హీరోయిన్ ప్రేమగా హీరోని రిక్వెస్ట్ చేసే సీన్ ఇద్దరి మధ్య ఉన్న లవ్ డెప్త్ ను చూపిస్తోంది.
‘ప్రేమించాలని డిసైడ్ అయితే ఎన్నొచ్చిన యుద్ధం చేయాల్సిందే’ అని హీరోకి తండ్రి చెప్పటం చూస్తే ప్రేమలో హీరోకి ఎదురైన సమస్య గురించి చెబుతుంది. అక్కడి నుంచి మనకు విలన్ పాత్ర ఎలా ఉండబోతుందని చెప్పుకొచ్చారు. హీరోయిన్ వల్ల హీరో పడ్డ ఇబ్బందులను ట్రైలర్లో చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు.
‘జాగ్రత్తగా వెళ్లి.. జాగ్రత్తగా తిరిగి రా’ అంటూ హీరోకి హీరోయిన్ జాగ్రత్త చెప్పటం, ‘ప్రేమతో వెళ్తున్నా..వచ్చాక ప్రపంచాన్నే గెలుద్దామని హీరో చెప్పటం.. దానికి హీరో నుంచి హీరోయిన్ ప్రామిస్ తీసుకోవటంతో ట్రైలర్ ఎండ్ చేయడం ప్రామిసింగ్ గా ఉంది. గోదావరి నేపథ్యంలో సాగే ఈ ప్రేమకథలోని సీన్స్ ట్రైలర్లోనే హృదయాలను హత్తుకునేలా ఉంది. శరవణ వాసుదేవన్ అందించిన సంగీతం బాగుంది. ఈ చిత్రానికి అనుదీప్ దేవ్ నేపథ్య సంగీతాన్ని అందిస్తున్నారు. సాయికుమార్ దారా అందించిన విజువల్స్ చాలా రిచ్‌గా ఉన్నాయి. గ్యారీ బి.హెచ్.ఎడిటర్‌గా పనిచేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.