Secunderabad Rly Station:కేంద్రంలో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత మౌలిక వసతుల విషయంలో పలు మార్పులు వస్తున్నాయి. . అందులో రైల్వేల వ్యవస్థ కూడా ఒకటి. ఒకపుడు రైల్వే స్టేషన్స్ మురికి కూపాలుగా ఉండేవి. అందులో టాయిలెట్ వ్యవస్థ కూడా అస్తవ్యస్తంగా ఉండేది. ఇక మోడీ అధికారం చేపట్టిన తర్వాత రైల్వే రంగంపై దృష్టి సారించారు. అంతేకాదు ప్రపంచంలోనే అతి ఎక్కువ మంది పనిచేసే సంస్థగా భారతీయ రైల్వేకు పేరుంది. అందులో భాగంగా ఇపుడు రైల్వేలకు ఆధునిక సొగబులు అద్దుతున్నారు. ఈ క్రమంలో దేశ వ్యాప్తంగా పలు స్టేషన్ లను దశల వారీగా అభివృద్ది చేస్తున్నారు. ఇప్పటికే పాత స్టేషన్ ను పడగొట్టి కొత్తగా అంతర్జాతీయ విమానాశ్రయం తరహాలో కట్టబోతున్నారు. అంతేకాదు ప్రతి ఫ్లాట్ ఫామ్ కు ఎస్కలేటర్ సౌకర్యంతో పాటు లిఫ్ట్ లు, ఫుట్ ఓవర్ వంతెనలు, భారీ స్కై కాంకోర్స్, సరికొత్తగా ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే ఉన్న వాటిని అప్ గ్రేడ్ చేయనున్నారు. ఇందులో భాగంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ను అత్యాధునిక హంగులతో తీర్చిదిద్దబోతున్నారు.
రాబోయే వందేళ్ల కోసం ఈ ప్రణాళిక రూపొందించినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లోఆరు ఫ్లాట్ ఫామ్ లను ఈ రోజు నుంచి 100 రోజులు పాటు క్లోజ్ చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఓ ప్రకటనలో తెలియజేసారు. ఈ నేపథ్యంలో 120 జతల రైళ్లను దారి మళ్లిస్తున్నారు. వీటిలో ఎక్కువ భాగం చర్లపల్లి నుంచి నడపనున్నారు.
సికింద్రాబాద్ స్టేషన్ లో నిర్మించే స్కై కాంకోర్స్ కోసమే 100 రోజులు సమయం పట్టే అవకాశాలున్నాయి. ఇందులో భాగంగా రెండస్తుల్లో భారీ స్కై కాంకోర్స్ ను నిర్మిస్తున్నారు. సికింద్రాబాద్ స్టేషన్ లో ఇదే ముఖ్యమైన కట్టడంగా పేర్కొంటున్నారు. ఇది 120 మీటర్ల పొడవు.. 110 మీటర్ల వెడల్పు ఉంటుంది. ప్రయాణికులకు సకల సదుపాయాలు ఇందులోనే ఉండనున్నాయి. మరోవైపు స్టేషన్ లో రెస్టారెంట్స్, కియోస్క్ లు లాంటివి ఏర్పాటు చేయనున్నారు. ఇవి ఎస్కలేటర్స్ తో పాటు ఫుట్ ఓవర్ బ్రిడ్జితో లింకంప్ అయి ఉంటాయి. ఈ భారీ నిర్మాణానికి పునాదులు తీసే ప్రక్రియలో భాగంగా స్టేషన్ లోని 6 ఫ్లాట్ ఫారాలను మూసివేయనున్నారు.
ముఖ్యంగా సికింద్రాబాద్ లో ఒకటో నెంబర్ ఫ్లాట్ ఫారమ్ నుంచి పదో నెంబర్ ఫ్లాట్ ఫారమ్ వరకు ఫుట్ ఓవర్ బ్రిడ్డి నిర్మించనున్నారు. ఇందులో భాగంగా 5-6 ఫ్లాట్ ఫామ్స్ మధ్యలో 500 టన్నుల సామర్ధ్యం ఉన్న హోవీ క్రేన్ ను ఏర్పాటు చేస్తున్నారు. దీని కోసం ఫ్లాట్ ఫారాల మధ్య గ్యాప్ ను ఇసుక బస్తులతో నింపి దానిపై క్రేన్ తో పనులు చేపట్టనున్నారు. మొత్తంగా చూసుకుంటే.. సికింద్రాబాద్ స్టేషన్ లో 1 నెంబర్ తో పాటు 10 వ నెంబర్ ఫ్లాట్ ఫారాలు మాత్రమే ప్రయాణికులకు అందుబాటులో ఉండనున్నాయి. ప్రస్తుతం 100 రోజులు అని చెబుతున్నా.. వీటి నిర్మాణం పూర్తయ్యే వరకు దాదాపు ఆరు నెలల నుంచి యేడాది కాలం పట్టొచ్చని ఇంజినీరింగ్ నిపుణులు చెబుతున్న మాట.
ఇదీ చదవండి: బడా స్టార్స్ సహా 900 సినిమాల్లో నటించిన నటి.. భర్త చనిపోవడంతో తాగుడుకు బానిసై జీవితం నాశనం..
ఇదీ చదవండి: ఈ చెట్లు ఉంటే.. పాములకు మీ ఇంట్లోకి రెడ్ కార్పెట్ పరిచినట్టే.. తస్మాత్ జాగ్రత్త..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









