)
south east dcp chaitanya gun firing on chain snatcher in Hyderabad: హైదరాబాద్ లో ఇటీవల వరుసగా కాల్పుల ఘటన ప్రజల్ని షాక్ కు గురిచేస్తున్నాయి. తాజాగా.. చాదర్ ఘాట్ పరిధిలో సీపీ కార్యాలయంకు మీటింగ్ కు వెళ్లి వస్తుండగా ఇద్దరు చైన్ స్నాచర్ లను సౌత్ ఈస్ట్ డీసీపీ గమనించారు. వెంటనే తన గన్ మెన్ తో కలిసి వారిని వెంబడించారు.
ఇంతలో ఒక చైన్ స్నాచర్ కత్తితో డీసీపీపై దాడికి యత్నించడంతో డీసీపీ కిందపడిపోయారు. అప్పుడు వెంటనే డీసీపీ తెరుకుని వెంటనే.. గన్ తో చైన్ స్నాచర్ లపై మూడు రౌండ్ల కాల్పులు జరిపారు. దీంతో ఇద్దరు దొంగలు కింద పడిపోయారు.
వెంటనే పోలీసులు, స్థానికులతో సాయంతో ఇద్దర్ని అదుపులోకి తీసుకున్నారు. తీవ్రంగా గాయపడ్డ ఒక చైన్ స్నాచర్ ను పోలీసులు ఆస్పత్రికి తరలించారు. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.ఈ ఘటన ప్రస్తుతం హైదరాబాద్ లో తీవ్ర కలకలంగా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook