)
Teenagers molested girl on bike in hyderabad video: ఇటీవల కాలంలో అమ్మాయిలు తరచుగా వేధింపులను ఎదుర్కొంటున్నారు. బస్టాండ్, మెట్రోలు, రద్దీగా ఉన్న ప్రదేశాలు, ఆఫీసులు ఇలా ప్రతి చోట కూడా వేధింపులకు బలౌతున్నారు. కొంత మంది కామాంధులు పసిపాప నుంచి పండు ముసలి వరకు ఏ ఒక్కర్ని సైతం వదలడంలేదు. మొత్తంగా అసలు ఆడది కన్పిస్తే చాలు కామంతో రెచ్చిపోతున్నారు.
పశువుల కన్నా కూడా హీనంగా ప్రవర్తిస్తున్నారు.ఈ క్రమంలో ప్రస్తుతం సమాజంలో దారుణ ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. పోలీసులు ఎన్ని కఠిన చట్టాల కింద కేసులు బుక్ చేస్తున్న మాత్రం కామాంధుల్లో మార్పులు రావడం లేదు. ఈ క్రమంలో ఆడది కన్పిస్తే చాలు అసభ్యంగా తాకడం, వెకిలి చేష్టలు వేయడం వంటివి చేస్తున్నారు. హైదరాబాద్ లో అచ్చం ఇలాంటి కోవకు చెందిన ఘటన వార్తలలో నిలిచింది.
Bike no. TS 13 ES 1865@CPHydCity @hydcitypolice
These 3 pieces of shit were following the girls in front of them and touching them with the peacock feather till I pulled down the window & yelled at them. Would’ve chased them further but the car in front of me didn’t give way pic.twitter.com/pqtOdnSKTr
— Aniketh Shetty (@AnikethShetty1) August 25, 2025
హైదరాబాద్ లో జూబ్లిహిల్స్ లో కొంత మంది ఆకతాయిలు రెచ్చిపోయారు. ముగ్గురు ఒకే బైక్ మీద వెళ్తున్నారు. అది కూడా వాళ్లకు హెల్మెట్ లేదు. వారు తమ పక్కన స్కూటీమీద వెళ్తున్న యువతుల్ని వేధిస్తున్నారు. నెమలి ఈకలతో వారిని వెనుక నుంచి ప్రైవేటు పార్ట్స్ లను అసభ్యంగా తాకుతూ పైశాచికంగా ప్రవర్తించారు.
పాపాం.. అమ్మాయిలు వారి బారి నుంచి తప్పించుకొవడానికి వేగంగా వెళ్తే .. కేటుగాళ్లు వారిని వదలకుండా ఫాలో అవుతున్నారు. అయితే.. వీరి వెనక వస్తున్న కారులోని వారు ఈ దుర్మార్గుల చర్యల్ని తమ ఫోన్లలో రికార్డు చేశారు. వారిని బెదిరింపులకు గురిచేశారు.
దీంతో వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు. వీరి యవ్వారంను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. సిటీ పోలీసులను ట్యాగ్ చేసి, వీరిపై చర్యలు తీసుకొవాలని బైక్ నెంబర్‌తో సహా ట్యాగ్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.దీనిపై నెటిజన్లు మండిపడుతున్నారు . హైదరాబాద్ ఇజ్జత్ తీస్తున్నారంటూ మండిపడుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.