)
Telangana Weather Red Alert: తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కుదిపేస్తున్నాయి. హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో వాతావరణ కేంద్రం వర్షాలపై మరో కీలక అప్డేట్ ఇచ్చింది. రానున్న మూడు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది. అవసరం ఉంటే తప్పా.. ఎవరు బయటికి రావద్దని సూచించింది.
హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కురుస్తోంది. అమీర్ పేట్, ఎస్.ఆర్.నగర్, మధురా నగర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, కూకట్ పల్లి, మూసాపేట, మాదాపూర్, గచ్చిబౌలి, ఖైరతాబాద్, కోటి, మలక్ పేట్, దిల్సుఖ్ నగర్, వనస్థలిపురం, ఎల్బీనగర్, అబ్దుల్లాపూర్ మేట్, హయత్ నగర్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదయింది. రోడ్లపైకి వరద నీరు ఒక్కసారిగా చేరడంతో వాహనదారులు అవస్థలు పడుతున్నారు. ఇప్పటికే జిహెచ్ఎంసి అధికారులు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపడుతున్నారు.
మరోవైపు ఐటీ కారిడార్ ప్రాంతాలైన హైటెక్ సిటీ, గచ్చిబౌలి, రాయదుర్గ్, కొండాపూర్ ప్రాంతాల్లో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అత్యవసరం అయితే తప్ప బయటకి రావద్దని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాబోయే రెండు రోజులు కూడా హైదరాబాద్ నగరం అంతటా విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలియజేసింది.
భారీ వర్షాల నేపథ్యంలో జిహెచ్ఎంసి, పోలీస్, ట్రాఫిక్, హైడ్రా విభాగాలు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ సీఎం రేవంత్ రెడ్డికి సమాచారాన్ని చేరవేస్తున్నారు. అన్ని విభాగాలు కలిసి పనిచేసి తగు ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. అవసరమైతే తప్ప బయటికి రావొద్దని వీలైతే ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని సీఎం రేవంత్ సూచించారు.
నిండుకుండలా హిమాయత్ సాగర్
గురువారం కురిసిన భారీ వర్షపాతానికి శివారులో ఉన్న హిమాయత్ సాగర్ నిండుకుండని తలపిస్తుంది. దీంతో మరికాసేపట్లో హిమాయత్ సాగర్ గేట్లు తెరిచి నీటిని మూసీ నదిలోకి విడుదల చేయనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. ఇదే విషయమై జిహెచ్ఎంసి అధికారులు మూసీ నది పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. ఏదైనా సహాయం కోసం 040 - 2111 1111 నంబర్ కు సంప్రదించాలని అధికారులు సూచించారు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook