Video Viral: ఫ్రీ బస్ జర్నీకి ఇంత రుబాబా..?.. మహిళపై రెచ్చిపోయిన సీనియర్ సిటిజన్.. వీడియో వైరల్..

Woman arguments with senior citizen in Hyderabad:   మహిళ సీనియర్ సిటిజన్ తో గొడవకు దిగింది. అంతటితో ఆగకుండా అతను వీడియో తీస్తుంటే ఫోన్ లాక్కునేందుకు ప్రయత్నం చేసింది.ఈ వీడియో వైరల్గా మారింది.  

Written by - Inamdar Paresh | Last Updated : Nov 10, 2025, 04:27 PM IST
  • పటాన్ చెరులో రచ్చ..
  • ఫ్రీబస్సులో సీటుకోసం వివాదం..
Video Viral: ఫ్రీ బస్ జర్నీకి ఇంత రుబాబా..?.. మహిళపై రెచ్చిపోయిన సీనియర్ సిటిజన్.. వీడియో వైరల్..

Woman arguments with senior citizen in free bus Hyderabad: రెండు తెలుగు రాష్ట్రాలు సైతం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంను కల్పిస్తున్నాయి. ప్రభుత్వాలు ఆర్టీసీ భారంను భరిస్తు ఎన్నికలలో ఇచ్చిన హమీల మేరకు ఫ్రీబస్సు పథకంను అమలు చేస్తున్నాయి. మరోవైపు ఇటీవల ఉచిత బస్సులో కొంత మంది మహిళలు వివాదాలు రాజేస్తున్నారు. సీట్ల కోసం వాగ్వాదం, కొట్టుకొవడం వంటివి చేస్తున్నారు.

Add Zee News as a Preferred Source

 

ఉచిత బస్సును వారి ప్రైవేటు ప్రాపర్టిలా ఫీలవుతున్నారు. దీంతో తరచుగా కొంత మంది మహిళలు అవసరం ఉన్నా లేకున్న కూడా ఉచిత బస్సులో ప్రయాణాలు చేస్తున్నారు. దీంతో ఉచిత బస్సు పథకం కాస్త అభాసుపాలు అవుతుంది. ఈ క్రమంలో ప్రతిరోజు ఉచిత బస్సు జర్నీలు ఏదో ఒక రచ్చతో వార్తలలో ఉంటున్నాయి. తాజాగా.. హైదరాబాద్ లోని పటాన్ చెరులో ఉచిత బస్సులో ఒక మహిళ సీనియర్ సిటిజన్ తో వాగ్వాదంకు దిగింది. ఈ వీడియో వైరల్ గా మారింది.

హైదరాబాద్ లో.. పటాన్‌చెరు నుండి కోఠికి వెళ్ళే బస్సులో సీనియర్ సిటిజన్‌కు రిజర్వ్ అయిన సీటులో మహిళ కూర్చుంది.  అది రిజర్వ్ సీటు అని లేవాలని పెద్దాయన మహిళను కోరాడు. ఆమె మాత్రం లేవడానికి ఒప్పుకోలేదు. దీంతొ ఇద్దరి మధ్య గొడవ కాస్త పీక్స్ కు చేరింది. ఫ్రీ జర్నీకి ఇంత రుబాబా? అంటూ మహిళపై  సీనియర్ సిటిజన్ ఆగ్రహం వ్యక్తంచేశాడు.

Read more: Snake Video: మీ కారును చెట్ల కింద పార్కింగ్ చేస్తున్నారా..?.. ఒక్కసారి ఈ వీడియో చూడండి..

ఆ తర్వాత ఫోన్ తీసి మహిళను, సీటును రికార్డుకు ప్రయత్నించగా ఆమె దానికి నిరాకరించింది. తోటి ప్రయాణికులు సైతం మహిళలకు సపోర్ట్ చేస్తుంగా.. ఆయనమరింత కోపంతో ఊగిపోయాడు. మొత్తంగా ఆమె స్టేజీ రాగానే దిగిపోయింది. ఈ ఘటనను కొంతమంది వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది కాస్త వైరల్గా మారింది. 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News