100 KG Gold Seize: ప్రపంచ దేశాల్లో బంగారం ధరలు తగ్గుతున్నా భారతదేశంలో మాత్రం భారీగా పెరుగుతున్నాయి. రూ.లక్ష దిశగా తులం బంగారం ధర పరుగులు పెడుతోంది. బంగారాన్ని సామాన్య, మధ్య తరగతి ప్రజలు కొనలేని పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో బంగారం స్మగ్లింగ్ భారీగా పెరుగుతోంది. దొంగ దారిన బంగారం సరఫరా చేస్తున్న సంఘటనలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఓ అపార్ట్‌మెంట్‌లో తనిఖీలు చేయగా.. కళ్లు చెదిరే రీతిలో బంగారం లభించింది. వంద కిలోలకు పైగా ఉన్న బంగారం విలువ దాదాపు రూ.వంద కోట్లకు పైగా ఉంది. ఎందుకు? ఎక్కడ? ఏం జరిగింది? అనేవి తెలుసుకుందాం.
Also Read: KA Paul: 'నా ఆస్తులు కొట్టేయాలని కుట్ర'.. చంద్రబాబు, పవన్‌పై కేఏ పాల్ సంచలన ఆరోపణలు
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో బంగారం అక్రమ రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. అక్రమంగా బంగారం తరలిస్తున్నారనే సమాచారం స్థానిక పోలీసులకు తెలిసింది. స్మగ్లింగ్ చేసిన బంగారాన్ని పాల్దీ అనే ప్రాంతంలో ఉన్న ఆవిష్కార్ అపార్ట్‌మెంట్‌లో ఉంచారని తెలియడంతో పోలీసులు దాడులు చేశారు. ఏటీఎస్ అధికారులు, పోలీసులు కలిసి సంయుక్తంగా ఆపరేషన్ చేశారు.
Also Read: Bumper Bonanza: ఐపీఎల్ బంపర్ బొనాంజా.. మ్యాచ్‌లకు ఉచిత ప్రయాణం
అపార్ట్‌మెంట్‌లోని ఓ ఫ్లాట్‌పై దాడి చేయగా అందులో బంగారం భారీగా పట్టుబడింది. ఆ ఇంట్లో 88 కిలోల బంగారు కిడ్డీలు, 19.66 కిలోల బంగారు ఆభరణాలు లభించాయి. వాటిని గుర్తించి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన బంగారం విలువ రూ.100 కోట్లకు పైగా ఉంటుందని అధికారులు తెలిపారు. ఆ బంగారం ఎక్కడిది? ఎక్కడికి తరలిస్తున్నారనే పోలీసులు విచారణ చేపట్టగా వివరాలు వెలుగులోకి వచ్చాయి.
ఆ ఇల్లు గాంధీనగర్‌లోని కలోల్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. అయితే ఆయన తన ఇంటిని మహేంద్ర షా అనే స్టాక్ మార్కెట్ ఆపరేటర్‌కు అద్దెకు ఇచ్చారు. ఈ బంగారాన్ని అతడే అక్రమంగా తరలిస్తున్నారని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఎలా తరలిస్తున్నారు? ఎందుకు తరలిస్తున్నారనేది పోలీసులు విచారణ చేపడుతున్నారు. సముద్ర తీరం కావడంతో జల రవాణా ద్వారా బంగారం అక్రమంగా స్మగ్లింగ్ అవుతుందనే వార్తలు వస్తున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









