)
12 dead after tractor plunges into river in mp: దేశ మంతట కూడా దసరా పండగను చేసుకుంటున్నారు. పలు చోట్ల ఈరోజు దుర్గామాత విగ్రహాల్ని నిమజ్జనం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దుర్గామాత విగ్రహాల్ని నిమజ్జనంకు తీసుకెళ్లే క్రమంలో మధ్య ప్రదేశ్ లోని ఖాండ్వాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.
Nine dead as tractor carrying idols of goddess Durga for immersion plunges into lake in MP's Khandwa district: police pic.twitter.com/lW3dloYR4k
— Raajeev Chopra (@Raajeev_Chopra) October 2, 2025
ఖాండ్వాలో.. దుర్గామాతను ట్రాక్టర్ మీద కూర్చుండ బెట్టుకుని నిమజ్జనంకు తీసుకెళ్తున్నారు. ఇంతలో ట్రాక్టర్ అదుపు తప్పి అక్కడే ఉన్న పెద్ద చెరువులోకి దూసుకునిపోయింది. ఈ ఘటనతో ఒక్కసారిగా ఆ ప్రాంతంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. అంతే కాకుండా.. వెంటనే చుట్టుపక్కల వారు తెరుకుని వారికి సాయం చేసేందుకు ప్రయత్నించారు .
తాళ్ల సాయంతో ట్రాక్టర్ ను చెరువులో నుంచి బైటకు లాగేందుకు ప్రయత్నించారు. కానీ అప్పటికే ట్రాక్టర్ నీళ్లలోకి మునిగిపోవడం, దాని కింద చాలా మంది చిక్కుకునిపోయారు. ఈ నేపథ్యంలో ట్రాక్టర్ కింద పడి పోయి.. దాదాపు 12 మంది దుర్మరణం చెందారు. వెంటనే అక్కడున్న వారు ఘటన స్థలంలోకి వెళ్లి సహాయక చర్యల్ని ముమ్మరం చేశారు.
మొత్తంగా ఈ ఘటనతో మరణాల సంఖ్య మరింతగా పెరిగా చాన్స్ ఉంది. అధికారులు, పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.ఈ ఘటన ప్రస్తుతం దసరా పండగ రోజు విషాదకరంగా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook