Tomorrow School Holiday: అక్టోబర్ నెలలో విద్యార్థులు ఫుల్ పండుగ చేసుకుంటున్నారు. వరుసగా సెలవులు వస్తుండడంతో విద్యార్థులు ఆనంధాలకు అవధుల్లేవు. ఇటీవల దసరా సెలవులు ముగిసిపోగా.. అప్పుడే దీపావళి పండుగ సెలవులు వచ్చేశాయి. దసరా మాదిరి దాదాపు రెండు వారాల సెలవులు స్కూళ్లకు వచ్చాయి. దీపావళి పండుగ ఓ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు సుదీర్ఘ సెలవులు ఇచ్చింది. రేపటి నుంచే ఆ సెలవులు ప్రారంభం కానున్నాయి. పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Also Read: Telangana Bandh: అక్టోబర్ 14న తెలంగాణ బంద్..! స్కూల్స్, కాలేజ్‌లకు సెలవు?
దీపావళి పండుగను రాజస్థాన్‌లో అంగరంగ వైభవంగా చేసుకుంటారు. తెలంగాణలో బతుకమ్మ, దసరా మాదిరిగా రాజస్థాన్‌లో దీపావళిని జరుపుకుంటారు. ఈ సందర్భంగా పాఠశాలలకు భారీగా సెలవులు అక్కడి ప్రభుత్వం ఇచ్చింది. ఏకంగా 14 రోజుల పాటు సెలవులు ఇవ్వడం గమనార్హం. ఆ సెలవులు రేపటి నుంచే ప్రారంభమవుతున్నాయి. రాజస్థాన్ విద్యా శాఖ ఆదేశాల ప్రకారం.. రాజస్థాన్ అంతటా దీపావళి సెలవులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఈ సంవత్సరం అక్టోబర్ 13వ తేదీ నుంచి అక్టోబర్ 24వ తేదీ వరకు అన్నీ పాఠశాలలకు దీపావళి సెలవులు ఉంటాయి.
Also Read: Jubilee Hills: రేవంత్ రెడ్డికి భారీ షాక్.. జూబ్లీహిల్స్‌లో కుప్పలు కుప్పలుగా నామినేషన్లు
స్కూళ్లకు సెలవులు ఇవ్వగా.. విద్యార్థులకు తోడు ఉపాధ్యాయులకు కూడా మొత్తం 13 రోజులు సెలవులు లభిస్తాయి. అక్టోబర్ 12వ తేదీ ఆదివారం కలిపితే 13 రోజుల సెలవు అవుతాయి. పాఠశాలల్లో దీపావళి సెలవులు అధికారికంగా అక్టోబర్ 13వ తేదీ అంటే సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సెలవులతో విద్యార్థులు, ఉపాధ్యాయులకు ముందే దీపావళి పండుగ వచ్చేసింది.
Also Read: Harish Rao: జోర్డాన్‌లో గల్ఫ్ కార్మికులకు హరీశ్ రావు భరోసా.. 'మేమున్నాం' అంటూ ఫోన్ కాల్
కానీ వరుస సెలవులతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. వారికి ఇన్నేసి సెలవులు ఇస్తుంటే ఇక వారు చదివేది ఎప్పుడూ? అని ప్రశ్నిస్తున్నారు. దీనికితోడు పిల్లలను ఇంట్లో భరించడం కన్నా స్కూళ్లకు పంపిస్తే హాయిగా ఉండవచ్చనే అభిప్రాయం తల్లిదండ్రుల్లో వ్యక్తమవుతోంది. కానీ 13 రోజుల దీపావళి సెలవులు ఇవ్వడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఎలాగో సెలవులు వచ్చాయని భావించి విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలతో పర్యటనలు చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook









