)
Panchayath Sarpanch Theft: దాదాపు 15 ఏళ్లుగా దొంగతనాలకు పాల్పడుతున్న ఓ లేడీ సర్పంచ్ భాగోతం ఎట్టకేలకు బయటపడింది. తమిళనాడులోని తిరుపత్తూరు నరియంపట్టు సర్పంచ్ భారతి (DMK) గత కొన్నేళ్లుగా దొంగతనాలు చేస్తున్నారు. వృత్తి సర్పంచ్ అయినా ఆమె దొంగతనాలు మాత్రం ఆపలేదు. అయితే, పేరు పలుకుబడి ఆమెకు సమాజంలో ఉంది కానీ, దొంగతనంలో ఉండే కిక్కే వేరు అందుకే ఇలా చోరీలకు పాల్పడుతున్నట్లు పోలీసుల విచారణలో చెప్పారట..
దీంతో పోలీసులే విస్తుపోతున్నారు. తాజాగా ఆమె ఓ బస్సులో ప్రయాణిస్తున్న సమయంలో ఓ మహిళ మెడలో నుంచి బంగారు చైన్ కొట్టేయడంతో సదరు మహిళ పోలీసు కంప్లైయింట్ ఇచ్చారు. దీంతో ఈ లేడీ సర్పంచ్ చోరీ పురాణం బయటపడింది.
పోలీసుల ప్రకారం.. నెర్కుండానికి చెందిన ఓ మహిళ బస్సులో ప్రయాణిస్తుండగా ఆమె మెడలో నుంచి 5 బంగారు గొలుసులు చోరీ అయ్యాయి. ఈ నేపథ్యంలో సదరు మహిళ పోలీసు కేసు నమోదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. వెంటనే సర్పంచ్ భారతిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఆమెను పోలీసులు విచారించగా విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఒకటి కాదు.. రెండు కాదు దాదాపు 15 ఏళ్లుగా ఆమె ఇలా దొంగతనాలకు పాల్పడుతున్న విషయాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో పోలీసులు సైతం విస్తుపోతున్నారు. సమాజంలో ఇలా డబ్బు, పేరు ఉన్న మహిళ ఇలా దొంగతనాలకు పాల్పడటం ఏంటని ఆశ్చర్యపోతున్నారు. కానీ ఆమె టార్గెట్ కిక్కు కోసం అని తెలియడంతో అందరూ అవాక్కయ్యారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook