Free Electricity: కేంద్ర ప్రభుత్వం భారీ కానుక.. ప్రతినెలా 150 యూనిట్ల విద్యుత్‌ ఉచితం..!

150 Units Free Electricity: కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను ప్రారంభించింది. ఈ నేపథ్యంలో ప్రధాన మంత్రి సూర్య ఘర్‌ ఉచిత విద్యుత్‌ పథకంలో వినియోగదారులకు భారీ గుడ్‌న్యూస్‌ చెప్పింది. ప్రతినెలా 150 యూనిట్‌ల వరకు ఉచిత విద్యుత్‌ సరఫరా ఇవ్వనుంది. సోలార్‌ ఎనర్జీ ఉత్పత్తిని పెంచడమే ఈ పథక లక్ష్యం.. పేద మధ్య తరగతి కుటుంబం పై భారం తగ్గించడానికి ఈ పథకాన్ని తీసుకువచ్చారు.  ​ఆ పూర్తి సమాచారం తెలుసుకుందాం.

Written by - Renuka Godugu | Last Updated : Dec 9, 2025, 05:39 PM IST
Free Electricity: కేంద్ర ప్రభుత్వం భారీ కానుక.. ప్రతినెలా 150 యూనిట్ల విద్యుత్‌ ఉచితం..!

150 Units Free Electricity:  కేంద్ర ప్రభుత్వం విద్యుత్‌ వినియోగదారులకు భారీ గుడ్‌న్యూస్‌ చెప్పింది. ప్రధాన మంత్రి సూర్య ఘర్‌ ఉచిత విద్యుత్‌ పథకం ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ స్కీమ్‌లో లబ్దిదారులకు ఉచితంగా విద్యుత్‌ అందిస్తుంది. సోలార్‌ రూఫ్‌టాప్‌లు ఏర్పాటు చేసుకున్నవారికి ప్రతినెలా దాదాపు 150 యూనిట్‌ల వరకు ఉచిత విద్యుత్‌ అందించనుంది. ఈ పథకాన్ని అధికారికంగా గోండా జిల్లాలో ప్రారంభించారు. మొత్తంగా 20 వేల సోలార్‌ ప్లాంట్‌ల ఏర్పాటునకు అక్కడ లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రధానంగా ఇళ్లలో కరెంటు ఖర్చులను తగ్గించడానికి ఈ పథకాన్ని ప్రారంభించారు.

Add Zee News as a Preferred Source

ప్రధానంగా ఈ జిల్లాల్లో విద్యుత్‌ ప్లాంట్‌ల ఏర్పాటు రాను రాను పెరుగుతోంది.  ఈ ప్లాంట్‌ ఏర్పాటు చేసుకున్న తర్వాత ప్రతి ఒక్క కుటుంబం దాదాపు 150 యూనిట్‌ల వరకు ఉచిత విద్యుత్‌ పొందుతున్నారని అధికారులు ప్రకటించారు. ఇది మధ్య తరగతి కుటుంబానికి ఎంతగానో ఊరట ఇస్తుంది. ప్రధాన మంత్రి సూర్యఘర్‌ యోజన పథకం ద్వారా మిగులు విద్యుత్‌ జనరేటు అవుతుంది దాన్ని గ్రిడ్‌కు సప్లై చేయవచ్చు. ఇది ఎనర్జీ ఉత్పత్తి, సరఫరాను సమతులం చేస్తుంది. ఈ విధానం వల్ల విద్యుత్‌ వినియోగం ఆదా అవ్వడం మాత్రమే కాదు.. పర్యావరణ పరిరక్షణకు కూడా గట్టి పునాది కూడా పడుతుంది.

ప్రభుత్వ సబ్సిడీ..
సోలార్‌ ఎనర్జీ ఉత్పత్తిని పెంచడమే ఈ పథక లక్ష్యం.. పేద మధ్య తరగతి కుటుంబం పై భారం తగ్గించడానికి ఈ పథకాన్ని తీసుకువచ్చారు.  పీఎం సూర్య ఘర్‌ పథకం ద్వారా 1kW ప్లాంట్‌కు రూ.45 వేలు, 2kW ప్లాంట్‌ ఏర్పాటునకు రూ.90,000, 3-10 kW ప్లాంట్‌ ఏర్పాటునకు రూ.1,08,000 సబ్సిడీ అందిస్తోంది. దీంతోపాటు వినియోగదారులు మరింత డబ్బును కూడా కంట్రిబ్యూట్‌ చేయాల్సి ఉంటుంది. kW కు రూ.65000,  2kW రూ.1,30000, 3-10 kW రూ.60 వేలు లబ్దిదారులు చెల్లించాల్సి ఉంటుంది.

విద్యుత్‌ ఖర్చుల తగ్గింపు..
సోలార్‌ ఎనర్జీ వల్ల మారుమూ, పట్టణ ప్రాంతాల్లోని ప్రజలు అతిగా సాంప్రదాయ విద్యుత్‌పై ఆధారపడాల్సిన అవసరం ఉండదు. దీంతోపాటు రాను రాను మిగులు విద్యుత్‌ విక్రయించి డబ్బులు కూడా పొందవచ్చు. పీఎం సూర్యఘర్‌ ఎంతో ఈజీ ప్రక్రియ. సులభంగా దరఖాస్తు చేసుకోవచ్చు. పీఎం సూర్యఘర్‌ పథకం ఈజీ ప్రక్రియ. ప్రభుత్వం పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికి మీ వద్ద కేవలం ఆధార్‌ కార్డు వివరాలు, విద్యుత్‌ కనెక్షన్‌ నెంబర్‌, ఇంటి అడ్రస్‌, బ్యాంకు వివరాలు తప్పనిసరి. అప్లికేషన్‌ ప్రక్రియ పూర్తయిన తర్వాత మీ ఇంటికి ఇన్‌స్పెక్షన్‌ చేస్తారు. వెరిఫికేషన్‌ పూర్తయిన తర్వాత సోలార్‌ ప్లాంట్‌లను ఇన్‌స్టాల్‌ చేస్తారు. 

ఇదీ చదవండి: Video: పెళ్లిలో డ్యాన్స్‌ చేస్తుండగా కుప్పకూలిన రూఫ్‌.. పరిస్థితి విషమం డ్రోన్ విజువల్ వైరల్‌..!

ఇదీ చదవండి: ఎయిర్‌టెల్‌ మైండ్‌బ్లోయింగ్‌ మంత్లీ ప్లాన్‌.. రూ.154 కే 365 రోజుల నెలవారీ వ్యాలిడిటీ ప్లాన్‌..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News