)
17 women molested by delhi ashram baba swami Chaitanya Natha saraswati: దేశంలో ప్రస్తుతం ఎక్కడ చూసిన కూడా దేవీ శరన్నవ రాత్రుల ఉత్సవాలను ఎంతో భక్తి, భావనలతో నిర్వహించుకుంటున్నారు. ప్రజలంతా కూడా దుర్గమ్మ తల్లిని పూజించుకుంటున్నారు. తొమ్మిది రోజుల పాటు ప్రతిరోజు.. ఒక అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఇలాంటి తరుణంలో ఢిల్లీలోని శ్రీ శారదా ఆశ్రమంలో జరిగిన ఘటన అందరిని కలిచి వేసింది.
దేశ రాజధాని ఢిల్లీలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. పేద విద్యార్థినులకు విద్యాదానం చేయాల్సిన ఓ స్వామీజీనే వారిపై కన్నేసి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ ఘటన ప్రస్తుతం సంచలనంగా మారింది. వసంత్ కుంజ్ ప్రాంతంలోని శ్రీ శారదా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ మేనేజ్మెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న స్వామి చైతన్యానంద సరస్వతి అలియాస్ పార్థసారథి తమను లైంగికంగా వేధించాడంటూ 17 మంది విద్యార్థినులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ శారదా ఇనిస్టిట్యూట్‌లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (ఈడబ్ల్యూఎస్) కోటాలో స్కాలర్‌షిప్‌తో పోస్ట్-గ్రాడ్యుయేట్ మేనేజ్మెంట్ కోర్సులు చదువుతున్నారు. ఈ నేపథ్యంలో స్వామిజీ వీరి బలహీనతను ఆసరాగా చేసుకుని, ప్రతిరోజు అసభ్య మెస్సెజ్ లతో పాటు లైంగిక సంబంధం పెట్టుకొవాలని కూడా బలవంతం చేసేవాడని యువతులు వాపోయారు. వల్గర్ మెసెజ్ లు, బలవంతంగా తాకడం, వంటివి చేసేవాడని విద్యార్థినులు ఫిర్యాదు చేశారు.
మరొవైపు.. స్వామి డిమాండ్లకు ఒప్పుకోవాలంటూ కొందరు వార్డెన్లు, మహిళా సిబ్బంది కూడా తమపై ఒత్తిడి తెచ్చారని వారు ఆరోపించారు. ఈ నేపథ్యంలో బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అయితే, విషయం బయటకు పొక్కడంతో నిందితుడు పరారయ్యాడు.
పోలీసులు అతని కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. చివరిసారిగా ఆగ్రా సమీపంలో అతని కదలికలను గుర్తించినట్లు తెలుస్తొంది. దర్యాప్తులో భాగంగా పోలీసులు ఇనిస్టిట్యూట్ బేస్మెంట్లో నిందితుడు ఉపయోగించిన వోల్వో కారును గుర్తించారు. ఆ కారుకు నకిలీ డిప్లొమాటిక్ నంబర్ ప్లేట్ (39 యూఎన్ 1) ఉన్నట్లు తేలడంతో దాన్ని స్వాధీనం చేసుకున్నారు.
శృంగేరి పీఠం సీరియస్..
ఈ క్రమంలో సదరు స్వామిజీ చర్యలు చట్టవిరుద్దమని, పీఠం నియమాలకు పూర్తిగా వ్యతిరేకమని పీఠం వారు ఒక ప్రకటన విడుదల చేశారు. అతడ్ని వెంటనే పదవి నుంచి తొలగించడమే కాకుండా.. ఆ స్వామిజీతో తమ పీఠానికి ఎలాంటి సంబంధాలు లేవని పీఠం నిర్వహకులు స్పష్టం చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.