Corona Updates in India: దేశంలో పెరుగుతున్న రికవరీ రేటు..తాజాగా కేసులు ఎన్నంటే..!
Corona Updates in India: దేశంలో కరోనా తగ్గుముఖం పడుతోందా..? కొత్త కేసుల కంటే రికవరీ రేటు పెరగడం వెనుక కారణాలేంటి..? 24 గంటల్లో ఎంత మంది వైరస్ నుంచి కోలుకున్నారు..? తాజాగా కరోనా బులిటెన్‌ను ఇప్పుడు చూద్దాం..
Corona Updates in India: దేశంలో 4.25 లక్షల మందికి కరోనా పరీక్షలు చేయగా..18 వేల 313 మందిలో వైరస్ ఉందని తేలింది. పాజిటివిటీ రేటు 4.31 శాతంగా ఉంది. ఇటు రికవరీ రేటు పెరుగుతుండటం కలవరాన్ని తగ్గిస్తోంది. తాజాగా 20 వేల 742 మంది కరోనా నుంచి కోలుకుని వారియర్‌గా నిలిచారు. రికవరీ రేటు 98.47 శాతంగా ఉంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా యాక్టివ్ కేసులు 1.45 లక్షలుగా ఉన్నాయి. క్రియాశీల రేటు 0.33 శాతతంగా ఉంది.
గడిచిన 24 గంటల్లో కరోనా వల్ల 57 మంది మృతి చెందారు. ఇప్పటివరకు 4.39 కోట్ల మందికి కోవిడ్ సోకింది. 4.32 కోట్ల మంది వైరస్‌ను జయించారు. 5.26 లక్షల మంది మృత్యుఒడికి చేరారు. మొత్తంగా కేసులు హెచ్చు తగ్గుల మధ్య నమోదవుతుండటంతో భయాందోళనలు కల్గిస్తోంది. రానున్న రోజుల్లో ఫోర్త్ వేవ్ వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. దేశప్రజలంతా కరోనా మార్గదర్శకాలను పాటించాలంటున్నారు.
మరోవైపు దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరందుకుంది. 24 గంటల వ్యవధిలో 27.37 లక్షల మందికి టీకా అందించారు. ఇప్పటివరకు 202.79 కోట్ల డోసులను పంపిణీ చేశారు. ఈమేరకు కేంద్ర ఆరోగ్య శాఖ కరోనా బులిటెన్‌ను విడుదల చేసింది.
Also read:Jubilee Hills Rape Case: జూబ్లీహిల్స్ మైనర్ రేప్ కేసులో మరో ట్వీస్ట్..నిందితులకు బెయిల్ మంజూరు..!
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook