22 Pakistani women with Pakistani citizenship: పహల్గం ఉగ్రఘటన తర్వాత భారత్ చాలా సీరియస్ గా ఉంది. ఏప్రిల్ 22న ఉగ్రవాదులు ఆర్మీదుస్తులో వచ్చి టూరిస్టులను అత్యంత అమానుషంగా కాల్చి చంపారు. అంతే కాకుండా... ఈ ఘటనపై యావత్ భారతావణి మండిపడింది. ఉగ్రవాదుల కోసం ఆర్మీ జమ్ములోని అడవులన్ని జల్లెడపడుతున్నారు.
ఈ క్రమంలో ప్రస్తుతం టెర్రరిస్టులకు సపోర్ట్ చేస్తున్న పాక్ నడ్డివిరిచేపనుల్ని భారత్ చేస్తుంది. అయితే.. ఇప్పటికే సింధుజలాలు, బాగ్లీహర్ నీటి సరఫరాల్ని నిలిపివేసింది. అంతే కాకుండా.. భారత్ జలాలు, ఎయిర్ వేస్ లపై పాక్ ను పూర్తిగా నిషేధం విధించింది.
పాక్ నుంచి అన్ని దిగుమతులపై నిషేధం విధించింది. ఈ క్రమంలో పాక్ పౌరుల్ని తిరిగి ఆదేశంకు పంపించింది. ఈ క్రమంలో ఇప్పటికే కేంద్ర హోంశాఖ కూడా దీనిపై డెడ్ లైన్ ను విధించింది. దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లోని పాక్ సిటిజన్ లను తిరిగి వారి దేశానికి పంపించేవిధంగా ఏర్పాట్లు చేయాలని ఆయాస్టేట్స్ ల పోలీసుల్ని ఆదేశించారు.
అయితే..ఉత్తర ప్రదేశ్ లోని మొరాదాబాద్ లో ఇటీవల పాక్ నుంచి వచ్చిన 22 మంది యువతులు ఇక్కడి వాళ్లను పెళ్లి చేసుకొని.. వంద మందికి పైగా పిల్లల్ని కన్నారని విషయం వెలుగులోకి వచ్చింది.
అంతే కాకుండా.. పాక్ నుంచి వచ్చిన మహిళల వల్ల దాదాపుగా.. కొడుకులు, మనవలు, మనవరాళ్లతో కలిసి దాదాపు.. 500 వరకు కూడా వీరి కుటుంబం సంఖ్య పెరిగిందని విషయం వెలుగులోకి వచ్చింది. వీరిలో కొంత మంది అక్రమంగా కూడా వచ్చినట్లు కూడా విషయం వెలుగులోకి వచ్చింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









