Major Encounter: నారాయణపూర్‎లో భీకర ఎన్ కౌంటర్.. మరో 25 మంది మావోయిస్టులు మృతి..!!

Major Encounter: భారీ ఎన్ కౌంటర్ తో నారాయణ్ పూర్ దద్దరిల్లింది. మావోయిస్టులకు భద్రతా దళాలకు మధ్య జరిగిన భీకర కాల్పుల్లో 25 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. మరికొంత మందికి తీవ్రగాయాలు అయ్యాయి.   

Written by - Bhoomi | Last Updated : May 21, 2025, 11:52 AM IST
Major Encounter: నారాయణపూర్‎లో భీకర ఎన్ కౌంటర్.. మరో 25 మంది మావోయిస్టులు మృతి..!!

Major Encounter: భారీ కాల్పులతో దండకారణ్యం మరోసారి దద్దరిల్లింది. ఛత్తీస్ గఢ్ లోని నారాయణపూర్ జిల్లాల్లో జరిగిన భారీ ఎన్ కౌంటర్ లో 25 మంది మావోయిస్టులు మరణించారు. ఇది మావోయిస్టులకు బిగ్ షాక్ అని చెప్పవచ్చు. భద్రతా దళాలు, మావోయిస్టులకు మధ్య భీకర కాల్పులు జరిగాయి. 25 మంది మావోలు మరణించగా..మరికొంతమందికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం.

ఈ ఆపరేషన్ లో బీజాపూర్, నారాయణపూర్, దంతేవాడ డీఆర్జీ బలగాలు భారీగా పాల్గొన్నాయి. నేడు బుధవారం ఉదయం నుంచి భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య భారీగా ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. మ్రుతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టుల ఏరివేతకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకున్న సంగతి తెలిసిందే. 

Also Read:  IPL 2025: బ్యాట్‌తోనే కాదు.. మంచి మనసులోనూ నువ్వు తోపే తమ్ముడు.. ధోనీ పాదాలను తాకిన వైభవ్..!!  

కాగా అబుజ్మద్ లోని బటైల్ అడవుల్లో ఈ ఎదురుకాల్పులు జరుగుతున్నట్లు సమాచారం. అక్కడ మావోయిస్టు అగ్రనాయకులు ఉన్నట్లు పక్కా సమాచారంతోనే భద్రతా బలగాలు కాల్పులకు దిగినట్లు తెలుస్తోంది. ఈ ఎదురు కాల్పుల్లో మావోయిస్టు అగ్రనేత మరణించినట్లు సమాచారం. బస్తర్ లోని నాలుగు జిల్లాల నుంచి ఉమ్మడి భద్రతా దళాలు ఈ ఎన్ కౌంటర్లో పాల్గొన్నట్లు అబుజ్మద్ ఎస్పీ ప్రభాత్ కుమార్ తెలిపారు. ఈ ఎన్ కౌంటర్ ను ఆయన ధ్రువీకరించారు. 

Also Read:  LIC: మీ పిల్లల పేరిట రోజుకు రూ.26 ప్రీమియం చెల్లిస్తే చాలు.. రూ. 4,70,000 మీ సొంతం..ఎలాగంటే..?  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News