Aunty Date With Student: ఇద్దరు భర్తలను వదిలేసిన 30 ఏళ్ల ఆంటీ.. 12వ తరగతి విద్యార్థితో డేటింగ్‌

30 Years Aunty Date With Class 12 Student: ముగ్గురు పిల్లల తల్లీ.. 30 ఏళ్ల వయసు. అప్పటికే ఇద్దరు భర్తలను వదిలేసిన ఆమె 12వ తరగతి చదివే కుర్రాడితో వివాహేతర సంబంధం ఏర్పరుచుకుని ఇప్పుడు ఆ కుర్రాడితో సహజీవనం చేస్తోంది. ఈ సంఘటన వైరల్‌గా మారింది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Apr 9, 2025, 09:44 PM IST
Aunty Date With Student: ఇద్దరు భర్తలను వదిలేసిన 30 ఏళ్ల ఆంటీ.. 12వ తరగతి విద్యార్థితో డేటింగ్‌

Aunty Date With Student: కామం ముసుగులో వావి వరుసలు మరచిపోతున్నారు.. వయసు బేధం చూడడం లేదు. కామం మైకంలో పడి కాపురాలను ఎంతో మంది కూల్చుకుంటున్నారు. దీని ఫలితంగా వారి పిల్లల బతుకు అగమ్యగోచరంగా మారుతోంది. ఇటీవల తెలంగాణలో ముగ్గురు పిల్లలను హత్యచేసి తన ప్రియుడితో వెళ్లాలనుకున్న తల్లి ఉదంతాన్ని మరచిపోకముందే దేశంలో మరో సంచలన సంఘటన చోటుచేసుకుంది. ముగ్గురు పిల్లలు ఉన్నా కూడా ఆమె తన వయసులో సగం ఉన్న విద్యార్థిని ఆమె పెళ్లి చేసుకుంది. 30 ఏళ్ల వయసున్న ఆంటీ 12వ తరగతి విద్యార్థిని పెళ్లి చేసుకున్న సంఘటన సంచలనం రేపుతోంది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.

Add Zee News as a Preferred Source

Also Read: Granddaughter Shot Dead: మాజీ ముఖ్యమంత్రి మనవరాలు గుండెల్లో దూసుకెళ్లిన నాటు తుపాకీ

యూపీలోని అమ్రోహ జిల్లా హసన్‌పూర్‌ ప్రాంతానికి చెందిన శివానీ అలియాస్‌ శబ్నమ్‌కు గతంలోనే రెండు వివాహాలు అయ్యాయి. కానీ ఆమె కుటుంబంతో నివసించడం లేదు. మీరట్‌లో ఓ వ్యక్తిని వివాహం చేసుకోగా.. అది పెటాకులు అయ్యింది. అనంతరం సైదన్‌వాలీ గ్రామానికి చెందిన తౌఫీక్‌ అనే వ్యక్తిని శివానీ వివాహం చేసుకోగా.. భర్త 2011లో రోడ్డు ప్రమాదానికి గురయి దివ్యాంగుడిగా మారాడు. చేసుకున్న భర్త దివ్యాంగుడిగా మారడంతో ఆమె భర్తను పట్టించుకోవడం లేదు. కాగా ఆమెకు ముగ్గురు పిల్లలు కలిగారు.

Also Read: America vs China Tariff War: అమెరికాకు చైనా భారీ షాక్‌.. 80 శాతం టారిఫ్‌లు పెంచిన డ్రాగన్‌ దేశం

ఈ క్రమంలోనే స్థానిక ప్రాంతానికి చెందిన 12వ తరగతి విద్యార్థితో వివాహేతర సంబంధం ఏర్పరచుకుంది. ఆమె వయసు 30 ఏళ్లు కాగా.. విద్యార్థి వయసు 18 ఏళ్లు. వయసుతో సంబంధం లేకుండా ఆ కుర్రాడితో లైంగిక వాంఛ తీర్చుకుంటోంది. విద్యార్థితో సహజీవనం చేయడం ప్రారంభించిన శివానీ వికలాంగుడిగా మారిన తన భర్త తౌఫీక్‌కు వారం కిందట విడాకులు ఇచ్చేసింది. ఈ వార్త స్థానికంగా చర్చనీయాంశం కావడంతో పోలీసులకు తెలిసింది. దీంతో శివానీ, ఆ విద్యార్థిని పోలీసులు అదుపులోకి తీసుకుని కౌన్సిలింగ్‌ ఇస్తున్నారు. అయితే అప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకుని ఇద్దరిని వదిలేసిన ఆమె ఇప్పుడు కుర్రాడిని బుట్టలో వేసుకోవడంతో స్థానికులు ఆమెపై మండిపడుతున్నారు. ఆ విద్యార్థి భవిష్యత్‌ను ఆమె నాశనం చేస్తుందని.. ఆమెకు కౌన్సిలింగ్‌ ఇచ్చి కుటుంబాలను కాపాడాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు

ఈ సంఘటన సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తోంది. ముగ్గురు పిల్లలు ఉండి.. ఇద్దరు భర్తలను వదిలేశావా తల్లీ అంటూ నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు. పిల్లాడి భవిష్యత్‌ ఎందుకు నాశనం చేస్తావమ్మా? అని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఎంతమంది జీవితాలు నాశనం చేస్తావని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 'ఆంటీ దెబ్బకు పిల్లాడు తట్టుకోగలడా?' కొందరు అసభ్యంగా వ్యాఖ్యానిస్తున్నారు. ఇలాంటి సంఘటనలు తరచూ చోటుచేసుకుంటుండడంతో సమాజంలో బంధాలకు విలువలేకుండా పోతుందని మానసిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News