500 Note Ban News: గత కొద్ది రోజులుగా ఇంటర్నెట్‌లో రూ.500 నోట్ల భవిష్యత్తుపై పెద్ద ఎత్తున పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో సామాన్యుల్లో నెలకొన్న ఆందోళనను తొలగిస్తూ ప్రభుత్వం అధికారికంగా స్పందించింది. సోషల్ మీడియాలో రూ.500 నోట్ల రద్దు గురించి జరుగుతున్న ప్రచారంలో ఎంత నిజం ఉందో వివరిస్తూ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) కీలక స్పష్టతనిచ్చింది.
వైరల్ అవుతున్న వార్త ఏమిటి?
మార్చి 2026 తర్వాత ఏటీఎంలలో రూ.500 నోట్లు అందుబాటులో ఉండవనే ప్రచారం జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వం మరోసారి డీమోనిటైజేషన్ (Demonetization 2.0) కి సిద్ధమవుతున్న క్రమంలో.. ఇకపై దేశంలో రూ.100 నోటే అతిపెద్ద కరెన్సీగా ఉండబోతోదనే వార్తలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఈ వార్తలు నెట్టింట విపరీతంగా షేర్ కావడంతో, పదేళ్ల క్రితం జరిగిన నోట్ల రద్దు కష్టాలను గుర్తుచేసుకుంటూ ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
పీఐబీ (PIB) ఫ్యాక్ట్ చెక్ నివేదిక..
ఈ పుకార్లను ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) ఫ్యాక్ట్ చెక్ విభాగం తీవ్రంగా ఖండించింది. 500 రూపాయల నోట్లను నిషేధించే ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి లేదని PIB స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని, అటువంటి తప్పుడు సమాచారాన్ని ఎవరూ నమ్మవద్దని కోరింది. కరెన్సీ మార్పుల గురించి ఆర్‌బీఐ (RBI) గానీ, కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ గానీ ఎలాంటి ప్రకటన చేయలేదని తేల్చి చెప్పింది.
తప్పుడు సమాచారాన్ని బహిర్గతం చేస్తూ, ఒక స్క్రీన్ షాట్‌ను కూడా PIB షేర్ చేసింది. ప్రభుత్వ విధానాలు లేదా ఆర్థిక నిర్ణయాలకు సంబంధించిన సమాచారం కోసం కేవలం అధికారిక వెబ్‌సైట్లు, ధ్రువీకరించబడిన ప్రభుత్వ సోషల్ మీడియా ఖాతాలను మాత్రమే అనుసరించాలని సూచించింది.
కాబట్టి, మీ దగ్గర ఉన్న రూ.500 నోట్లు పూర్తి సురక్షితం. వాటి రద్దు గురించి వస్తున్న వార్తలు కేవలం సృష్టించిన పుకార్లు మాత్రమే. ఇటువంటి మెసేజ్‌లను ఫార్వార్డ్ చేయకుండా ఉండటం బాధ్యతాయుతమైన పని.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook









