Six Sisters Drowned: ఇన్‌స్టాగ్రామ్‌ మిగిల్చిన విషాదం‌.. యమునలో మునిగి ఒకే కుటుంబానికి చెందిన 6 గురు అమ్మాయిలు మృతి..

Insta Reels 6 Sisters Drowned In Yamuna: ఇంస్టాగ్రామ్ రీల్ చేస్తూ ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు అమ్మాయిలు మృతి చెందారు. ఈ  ఘటన ఉత్తర ప్రదేశ్‌లోని నగ్లా స్వామి గ్రామంలో చోటుచేసుకుంది. యమునా నదిలో రీల్స్ తీస్తుండగా ఆరుగురు అమ్మాయిలు మునిగిపోవడంతో ఆ గ్రామం అంతా విషాదఛాయలు అలుముకున్నాయి. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం 

Written by - Renuka Godugu | Last Updated : Jun 4, 2025, 11:54 AM IST
Six Sisters Drowned: ఇన్‌స్టాగ్రామ్‌ మిగిల్చిన విషాదం‌.. యమునలో మునిగి ఒకే కుటుంబానికి చెందిన 6 గురు అమ్మాయిలు మృతి..

Insta Craze 6 Sisters Drowned In Yamuna: ఇంస్టాగ్రామ్ పిచ్చి నానాటికి పెరిగిపోతుంది. ఒక్కొక్కరికి ఒక్కోక్కరు ఒక్కో విధంగా తమకు ఇన్‌స్టా మీద ఉన్న క్రేజ్‌ ను చూయిస్తారు. ఈ నేపథ్యంలో కొంతమంది రన్నింగ్‌ ట్రైన్ ..దిగుతూ పిచ్చి రీల్స్‌ చేస్తుంటే మరి కొంతమంది నీళ్లలో రీల్స్ చేస్తూ ప్రాణాలే పోగొట్టుకుంటున్నారు. కొండలపైన, గుట్టల పైన, చివరకు చెట్లను కూడా వదలడం లేదు. ఈ ఇన్‌స్టా పిచ్చి నానాటికి పెరిగిపోతుంది. కొంతమంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. అలాంటి దుర్ఘటన ఉత్తరప్రదేశ్ లోని నగ్లా స్వామి గ్రామంలో చోటుచేసుకుంది. ఇంస్టాగ్రామ్ రీల్స్ పిచ్చితో ఒకటే కుటుంబానికి చెందిన ఆరుగురు అమ్మాయిలు మృత్యువాత పడ్డారు. యమునా నదిలో రీల్స్ తీసుకోవడానికి ఈ అమ్మాయిలు వెళ్లారు. కానీ ప్రమాదవశాత్తు ఓ అమ్మాయి మునిగిపోవడంతో మిగతా వాళ్ళు రక్షించడానికి ప్రయత్నించి అందరూ మునిగిపోయారు. ఇక సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరి గాలించగా నలుగురు డెడ్ బాడీలు దొరికాయి మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. 

Add Zee News as a Preferred Source

 పోలీసుల వివరాల ప్రకారం.. ముగ్గురు సోదరీమణులు తమ వయసున్న అత్త కూతుళ్లతోపాటు కలిసి స్నానం చేయడానికి యమునా నది ఒడ్డుకు వెళ్లారు. అయితే అక్కడ లోతు ఎక్కువగా ఉంది. దీంతో రీల్స్ తీసుకుంటూ, సెల్ఫీలు దిగుతూ ఫోటోలు తీసుకున్నారు. అయితే యమునా నదిలో వీళ్ళు తరచుగా రీల్స్ చేస్తూ సరదాగా గడిపే వారని గ్రామస్థులు చెబుతున్నారు. ఏసీపీ వినాయక్ భోంస్లే మాట్లాడుతూ చనిపోయిన వారు పెద్ద ముస్కాన్ (18), దివ్య (13), సంధ్య (12), నైనా (14), సోనమ్ (12), శివాని (17) ఉన్నారు. వీళ్లు సోమవారం కూడా యమునలో స్నానం చేయడానికి వచ్చారు. ఆరోజు కూడా రీల్స్ చేశారు. అదేవిధంగా మంగళవారం కూడా మొబైల్లో సెల్ఫీలు తీసుకుంటూ స్నానం చేశారు. ఈ రీల్స్ ఇంస్టాగ్రామ్ వేదికగా పోస్ట్ కూడా చేశారు .

ఇలా స్నానం చేసే క్రమంలో ఒక అమ్మాయి ఒక హఠాత్తుగా మునిగిపోవటంతో మిగతా వాళ్ళు అమ్మాయిని రక్షించడాని వెళ్లారు. స్థానికంగా పొలాల్లో పనిచేస్తున్న వాళ్లు శబ్దాలు వినడంతో అక్కడికి చేరుకొని ముగ్గురిని బయటకు తీశారు. అయితే ఆ ముగ్గురు ప్రాణులతో కొట్టుమిట్టా ఆడుతూ ఉండటంతో సీపీఆర్‌ కూడా చేశారు. అయితే గ్రామం రహదారి అతి చిన్నగా ఉండటంతో మారుమూల గ్రామం అవడంతో ఆంబులెన్స్ రావడానికి రెండు గంటల సమయం పట్టింది. ఒకవేళ సకాలంలో చికిత్స అంది ఉంచి ఉంటే అమ్మాయిలు బతికే వారని గ్రామస్తులు చెబుతున్నారు. పోలీస్ స్టేషన్ నుంచి కూడా 6 కిలోమీటర్ల దూరం గా ఉంది. ఈ రోడ్లన్నీ ఇరుకుగా ముళ్లపొదలతో ఉంటాయి.

Also Read:  తిరుపతి భక్తులకు శుభవార్త.. ఇప్పుడే మీ టిక్కెట్లు బుక్ చేసుకోండి..!  

Also Read:  మహిళలకు రేవంత్‌ సర్కార్‌ గుడ్‌న్యూస్‌.. 20 ఏళ్ల పాటు ఆదాయం పొందే సువర్ణావకాశం..!    

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

About the Author

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.

...Read More

Trending News