)
75 Years Old Man Marriage: ఒక ఊర్లో 75 ఏళ్ల ముసలాడు 35 ఏళ్ల మహిళను పెళ్లి చేసుకున్నాడు. ఈ సంఘటన మిమ్మల్ని షాక్‌కు గురిచేస్తుందా? ఇది జరిగింది నిజమే. అయితే పెళ్లైన రెండో రోజు ఆ వృద్ధుడు మరణించాడు. ఇంతకీ ఈ విచిత్ర సంఘటన ఎక్కడ జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.
ఏం జరిగిదంటే?
ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ లోని జౌన్ పూర్ లో జరిగింది. కుచ్ ముచ్ ప్రాంతంలోని సంగురు రామ్ అనే 75 ఏళ్ల వ్యక్తి తన భార్య మరణించిన తర్వాత ఒక ఏడాది ఒంటరిగా ఉన్నాడు. అతనికి పిల్లలు లేరు. కుటుంబాన్ని పోషించడానికి వ్యవసాయం చేస్తున్నాడు.
భార్యను కోల్పోయిన తర్వాత అతను ఒంటరితనంతో బాధపడుతున్నాడట. దీన్ని అధిగమించడానికి అతను వేరే స్త్రీని వివాహం చేసుకోవాలనుకున్నాడట. తన కోరిక గురించి తన బంధువులకు కూడా తెలియజేశాడట.
ఇది విన్న అతని బంధువులు కొందరు దీనిని సమర్థించారు. కొందరు “75 ఏళ్ల వయసులో వివాహం అవసరమా?” అని విమర్శించారట. కొంతమంది గ్రామస్తులు కూడా దీనికి మద్దతు తెలిపారట. ఇలాంటి సంఘర్షణల నడుమ ఆ వృద్ధుడు 35 ఏళ్ల మహిళను వివాహం చేసుకున్నాడు.
పెళ్లి తర్వాత రోజే మరణం!
అయితే ముసలాడిని పెళ్లాడిన ఆమెకు కూడా ఇది రెండో వివాహమే. ఆమె మొదటి భర్తకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. తనకంటే చాలా పెద్దవాడిని వివాహం చేసుకోవడానికి ఎందుకు అంగీకరించారని అడిగినప్పుడు.. ఇంటిని తాను చూసుకుంటానని, తన పిల్లలను తాను చూసుకుంటానని అతనికి మాట ఇచ్చానని ఆమె సమాధానం ఇచ్చింది.
మనబావతి మాట్లాడుతూ, తమ పెళ్లి రోజు రాత్రి, వారు చాలా మాట్లాడుకున్నారని, జీవితం గురించి చాలా ముఖ్యమైన విషయాలను చర్చించుకున్నారని అన్నారు.
ఉదయం సంగురురామ్ పరిస్థితి అకస్మాత్తుగా మారిపోయింది. ఆ తర్వాత అతన్ని ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు అతను చనిపోయినట్లు ప్రకటించారు. అతని మరణానికి కారణం ఇంకా తెలియలేదు.
అంత్యక్రియల నిలుపుదల
75 ఏళ్ల సంగురురామ్ హఠాత్తుగా ఎలా మరణించాడనే దానిపై అనుమానాలు తలెత్తుతున్నాయి. గ్రామస్తులు దీని గురించి రకరకాల ఊహాగానాలు లేవనెత్తారు. ఈ వృద్ధుడి ముఖ్యమైన బంధువులు కొందరు ఢిల్లీలో ఉన్నారు. ఈ మరణం కూడా వారికి అనుమానాలను రేకెత్తించింది. అంత్యక్రియలను నిలిపివేయాలని వారు అన్నారు. దీనిపై నిజనిజాలు తెలుసుకునేందుకు పోలీసులను ఆశ్రయించే అవకాశం ఉంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook