Pakistan Citizens: పహల్గమ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్‌పై భారతదేశం తీవ్ర నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ప్రతిచర్యకు సిద్ధమవుతున్న సమయంలో పాకిస్థాన్ పౌరులను దేశంలో ఉండకూడదని ఆదేశించింది. అందులో భాగంగా భారతదేశాన్ని పాకిస్థాన్ పౌరులు వరుసగా వీడుతున్నారు. దేశంలో ఉన్న పౌరులు దేశాన్ని విడిచివె్తున్నారు. ఉగ్రవాద సంఘటన జరిగినప్పటి నుంచి ఇప్పటివరకు పాకిస్థాన్‌కు 786 పౌరులు వెళ్లిపోయారు.
Also Read: Indus Waters Treaty: సింధు నది జలాల ఒప్పందం ఏమిటి? టాప్ 10 ముఖ్యాంశాలు ఇవే!
పహల్గామ్ ఉగ్రదాడి ఘటన అనంతరం దాయాది దేశం పాకిస్థాన్‌పై తీవ్ర ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. సింధు నదీ జలాలను తక్షణమే నిలిపివేయగా.. పాకిస్థాన్ పౌరులను దేశం విడిచివెళ్లిపోవాలని ఆదేశించిన విషయం తెలిసిందే. పాకిస్తాన్ జాతీయులు ఏప్రిల్ 27వ తేదీ వరకు భారతదేశాన్ని విడిచిపెట్టాలని, వైద్య వీసాలు ఉన్నవారికి ఏప్రిల్ 29వ తేదీ వరకు వెళ్లిపోవాలని ఏప్రిల్ 24వ తేదీన భారతదేశం ఆదేశించిన విషయం తెలిసిందే. రెండు గడువులు ముగియడంతో భారతదేశాన్ని ఎంత మంది వీడారనే లెక్కలు బయటకు వచ్చాయి.
Also Read: Caste Census: కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. దేశవ్యాప్తంగా కులగణనకు నిర్ణయం
అయితే దౌత్య, అధికారిక, దీర్ఘకాలిక వీసాలు ఉన్నవారిని 'లీవ్ ఇండియా' నోటీసు నుంచి భారతదేశం మినహాయించింది.చా పాకిస్తానీయులకు 12 వర్గాలలో దేనినైనా స్వల్పకాలిక వీసాలు కలిగి ఉన్న గడువు ఆదివారం ముగిసింది. దీంతో 786 పాకిస్తానీయులు భారతదేశం విడిచిపెట్టి వెళ్లారని తెలిసింది. ప్రభుత్వం వెళ్లిపోవాలని ఆదేశించడంతో పాకిస్థాన్ పౌరులు అట్టారి-వాఘా సరిహద్దు ద్వారా భారతదేశాన్ని విడిచిపెట్టారు. హైదరాబాద్, ముంబై, గుజరాత్‌తోపాటు దేశంలోని వివిధ ప్రాంతాల్లో పాకిస్థాన్ పౌరులు ఉన్నారు. వారి లెక్కలు తీసి అందరినీ దేశం విడిచివెళ్లేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
ప్రస్తుతం పాకిస్తాన్‌లో ఉన్న భారత పౌరులు కూడా స్వదేశానికి తిరిగి రావాలని భారత్ సూచించింది. పాకిస్తాన్‌కు భారత్ నుంచి నేరుగా ప్రత్యక్ష విమాన ప్రయాణం లేకపోవడంతో చాలా మంది దుబాయ్ లేదా ఇతర మార్గాల ద్వారా విమానంలో బయలుదేరారు. ఇక దేశంలోని వివిధ ప్రదేశాలలో నివసిస్తున్న పాకిస్తాన్ పౌరులను ఆయా రాష్ట్ర పోలీసులు, ఇతర కేంద్ర సంస్థలు గుర్తించి ఎక్కువ మంది పాకిస్తాన్ జాతీయులు దేశాన్ని విడిచిపెట్టాలని కేంద్రం ఆదేశించింది. అన్ని రాష్ట్రాల్లో పాక్ పౌరుల ధృవీకరణ డ్రైవ్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలతో సమన్వయంతో జరుగుతోంది. భారత్ ఆదేశాలతో ఏప్రిల్ 29 తర్వాత ఇంకా దేశంలో ఉంటే వారిని చట్టవిరుద్ధ వ్యక్తులుగా పరిగణిస్తామని ఓ విదేశాంగ శాఖ అధికారి తెలిపారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









