Lowest DA Hike: ఈ ఏడాది జనవరి నెలలో పెరగాల్సిన డీఏ పెంపు ప్రకటన ఈ వారంలో వెలువడనుంది. కేంద్ర కేబినెట్ డియర్‌నెస్ అలవెన్స్‌పై తుది నిర్ణయం తీసుకోనుంది. అదే జరిగితే రెండు నెలల ఎరియర్లతో కలిపి ఉద్యోగులకు డీఏ అందనుంది. ఈ క్రమంలో మార్చ్ నెల జీతం భారీగా అందుకోనున్నారు.
ఏఐసీపీఐ ఇండెక్స్ నివేదికల ప్రకారం ఈసారి డియర్‌నెస్ అలవెన్స్ కేవలం 2 శాతమే ఉండవచ్చని తెలుస్తోంది. ప్రతిసారీ 3-4 శాతం డీఏ పెరుగుతుండేది. కానీ ఈసారి డీఏ-డీఆర్ విషయంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు నిరాశే ఎదురుకానుంది. ఏఐసీపీఐ ఇండెక్స్ ప్రకారం నిర్ణయించే డీఏ ఈసారి గతంలో ఎన్నడూ లేనంత తక్కువ ఉండనుంది. గత ఏడేళ్లలో ఎప్పుడూ లేనంత తక్కువ 2 శాతం ఉంటుందని ఆర్ధిక నిపుణులు అంచనా వేస్తున్నారు. 2018 జూలై తరువాత అంటే దాదాపుగా 78 నెలల సుదీర్ఘ కాలంలో డీఏ కేవలం 2 శాతం పెరగనుండటం ఇదే తొలిసారి. 2018 జూలై, డిసెంబర్ మధ్యలో డీఏ కేవలం 2 శాతం పెరిగింది. ఆ తరువాత ప్రతిసారీ అంటే ఏడేళ్లలో 14 సార్లు కూడా 3-4 శాతం పెరుగుతూ వచ్చింది.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ, పెన్షనర్లకు డీఆర్ ఏడాదిలో రెండు సార్లు పెరుగుతుంటుంది. మొదటిది జనవరి నెలలో అయితే రెండవది జూలైలో. తాజాగా గత ఏడాది జూలై 2024లో డీఏ 3 శాతం పెరగడంతో 50 నుంచి 53 శాతమైంది. అంతకుముందు జనవరి నెల డీఏ మార్చ్ లో ప్రకటించినప్పుడు 4 శాతం ఉండింది. దాంతో మొత్తం డీఏ 46 నుంచి 50 శాతానికి చేరుకుంది. గత ఏడాది జూలై డీఎను కేంద్ర ప్రభుత్వం అక్టోబర్ నెలలో 3 శాతంగా ప్రకటించింది. ప్రస్తుతం అమల్లో ఉన్న 7వ వేతన సంఘం ప్రకారం ఇది సాధ్యమైంది. అయితే ఈసారి మాత్రం డీఏ కేవలం 2 శాతమే పెరిగే పరిస్థితి ఉండటంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు బిగ్ షాక్ అని చెప్పవచ్చు.
ఈ ఏడాది జనవరి 16వ తేదీన కేంద్ర ప్రభుత్వం 8వ వేతన సంఘం ప్రకటించింది. కొత్త వేతన సంఘం సిఫార్సులు వచ్చే ఏడాది 2026 జనవరి 1 నుంచి అమల్లోకి వస్తాయి. అంటే 7వ వేతన సంఘం పరిధిలో డీఏ మరోసారి మాత్రమే పెరగనుంది. అంటే ఈ ఏడాది దీపావళికి పెరిగే డీఏ ఈ వేతన సంఘంలో చివరిది కానుంది. ఆ తరువాత మొత్తం డీఏ కనీస వేతనంలో విలీనమై జీరో నుంచి లెక్క మొదలవుతుంది. 8వ వేతన సంఘం వర్తించేది 2026 జనవరి నుంచే అయినా అమల్లోకి వచ్చేటప్పటికి వచ్చే ఏడాది మార్చ్ నెల కావచ్చు.
Also read: Sunita Williams: సునీతా విలియమ్స్ రాక మరింత ఆలస్యం, క్రూ 10 మిషన్ ఎందుకు ఆగిపోయింది
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









