7th Pay Commission: ఉద్యోగులకు బిగ్ అప్‌డేట్, ఏప్రిల్ 1 నుంచి కొత్త పెన్షన్ స్కీమ్, ఎలా నమోదు చేయాలంటే

7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్. దేశవ్యాప్తంగా ఉద్యోగుల కోసం కొత్త స్కీమ్ అమలు కానుంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఇప్పటికే విడుదలైంది. ఈ కొత్త స్కీమ్ పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 24, 2025, 11:28 PM IST
7th Pay Commission: ఉద్యోగులకు బిగ్ అప్‌డేట్, ఏప్రిల్ 1 నుంచి కొత్త పెన్షన్ స్కీమ్, ఎలా నమోదు చేయాలంటే

7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్ అప్‌డేట్ ఇది. ఏప్రిల్ 1 నుంచి అంటే మరో వారం రోజుల వ్యవధిలో కొత్త పెన్షన్ స్కీమ్ ప్రారంభం కానుంది. కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రారంభిస్తున్న యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ ద్వారా దేశవ్యాప్తంగా 23 లక్షల మంది ఉద్యోగులు లబ్ది పొందనున్నారు. 

Add Zee News as a Preferred Source

కేంద్ర ప్రభుత్వం కొత్తగా యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ ప్రవేశపెట్టింది. దీనికి సంబంధించి పెన్షన్ రెగ్యులేటరీ డెవలప్‌మెంట్ అథారిటీ తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది. యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ప్రభుత్వ ఫిస్కల్ పాలసీకు ఉద్యోగి ప్రయోజనాలకు మధ్య బ్యాలెన్స్ సరి చేసేందుకు ఈ కొత్త పెన్షన్ స్కీమ్ ఉపయోగపడుతుంది. గత 12 నెలల కనీస వేతనం సరాసరి నుంచి 50 శాతం రిటైర్మెంట్ సమయంలో పెన్షన్ కింద అందిస్తారు. కనీసం పదేళ్లు సర్వీసు ఉన్న ఉద్యోగులకు కనీస పెన్షన్ నెలకు 10 వేలు అందించే వెసులుబాటు కూడా ఉంది. అయితే పాత పెన్షన్ స్కీమ్‌లో కనీస పెన్షన్ గ్యారంటీ లేదు. రిటైర్మెంట్ అనంతరం  50 శాతం పెన్షన్ కింద లభిస్తుంది. ప్రస్తుతం నేషనల్ పెన్షన్ స్కీమ్‌లో ఉన్న ఉద్యోగులకు ఇది ఓ ఆప్షన్ కానుంది. 

మరో వైపు ఫ్యామిలీ పెన్షన్‌లో భాగంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి కుటుంబం ఉద్యోగి మరణానంతరం 60 శాతం పెన్షన్ కింద అందుకుంటుంది. ఉద్యోగి కనీస వేతనం నుంచి 10 శాతం వాటాగా వసూలు చేస్తారు. అటు ప్రభుత్వ వాటాగా 18.5 శాతం ఉంటుంది. అదే నేషనల్ పెన్షన్ స్కీమ్‌లో మాత్రం ప్రభుత్వ వాటా 14 శాతమే ఉంటుంది. 

యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్‌లో ఆన్‌లైన్ విధానంలో ఉద్యోగి నమోదు చేసుకోవచ్చు. దీనికోసం సీఆర్ఏ పోర్టల్ https://npscra.nsdl.co.in లో ఏప్రిల్ 1 నుంచి నమోదు ప్రక్రియ ప్రారంభమౌతుంది. ప్రస్తుతం ఎన్‌పీఎస్‌లో ఉన్నవారికి యూపీఎస్ మారేందుకు ఆప్షన్ ఉంది. 

Also read: Aadhaar Card Update: ఆధార్‌లో పేరు, అడ్రస్, పుట్టిన తేదీ ఎన్ని సార్లు మార్చుకోవచ్చో తెలుసా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Trending News