7th Pay Commission DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి ఏటా రెండు సార్లు డీఏ పెరుగుతుంటుంది. జనవరి 2025 డీఏ పెంపు ప్రకటన కోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఎదురు చూస్తున్నారు. హోలీ పండుగకు కేంద్ర ప్రభుత్వం నజరానా అందించేందుకు సిద్దమౌతోంది.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గత ఏడాది జూలై డీఏను అక్టోబర్‌లో ప్రకటించారు. డీఏ 3 శాతం పెంచడంతో మొత్తం డీఏ 53 శాతానికి చేరుకుంది. తిరిగి ఈ ఏడాది జనవరిలో పెంచాల్సి ఉంది. సాధారణంగా జనవరి నెల డీఏ పెంపు మార్చ్‌లో, జూలై డీఏ పెంపు సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలల్లో ఎరియర్లతో సహా ఉంటుంది. అటు పెన్షనర్లకు డియర్‌నెస్ రిలీఫ్ పెరుగుతుంది. ప్రస్తుతం జనవరి నెల డీఏ ప్రకటన కోసం అటు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఇటు పెన్షనర్లు ఎదురుచూస్తున్నారు. వచ్చే ఏడాది నుంచి 8వ వేతన సంఘం అమల్లోకి రానుంది. ఈ క్రమంలో 7వ వేతన సంఘంలో భాగంగా ఈ ఏడాది చివరి వరకూ మరో రెండు డీఏలు అందుకుంటారు. మార్చ్ నెలలో హోలీ నాటికి డీఏ పెంపు ప్రకటన ఉండవచ్చని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అంచనా వేస్తున్నారు. డీఏ పెరిగితే కనీస వేతనం కూడా పెరుగుతుంది.
గత ఏడాది 2024 అక్టోబర్ లో డీఏ 3 శాతం పెంచినప్పుడు మొత్తం డీఏ 50 నుంచి 53 శాతానికి చేరింది. అటు పెన్షనర్లకు కూడా అదే విధంగా డీఆర్ పెరిగింది. ఈసారి కూడా డీఏ 3-4 శాతం పెరగవచ్చనే అంచనా ఉంది. లెవెల్ 1 ఉద్యోగులకు ప్రస్తుతం కనీస వేతనం 18 వేలు ఉంది. డీఏ పెంపుతో ఇది కాస్తా 540-720 రూపాయలు పెరగవచ్చు. అంటే కనీస వేతనం 18 వేలు ఉన్నవారికి డీఏ 9 వేలు ఉంటుంది. డీఏ 3 శాతం పెరిగితే మొత్తం డీఏ రూపంలో 9,540 రూపాయలు అందుతుంది. అదే డీఏ 4 శాతం పెరిగితే మొత్తం డీఏ 9,720 రూపాయలు అవుతుంది.
ఏఐసీపీఐ ఇండెక్స్ 12 నెలల సరాసరి ఆధారంగా డీఏ, డీఆర్ ఎంతనేది నిర్ణయమౌతుంది. జనవరి నెల డీఏ పెంపు అనేది జూలై నుంచి డిసెంబర్ వరకు ఉన్న ఏఐసీపీఐ ఇండెక్స్ ఆధారంగా ఉంటుంది. ఇక జూలై నెల డీఏ పెంపు అనేది జనవరి నుంచి జూన్ వరకు ఉన్న ఏఐసీపీఐ ఇండెక్స్‌ను బట్టి ఉంటుంది.
Also read: 7th Pay Commission: ఆ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక ఇన్సెంటివ్ మూడేళ్లు పొడిగింపు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









