7th Pay Commission DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు గత కొద్ది కాలంగా ఎదురు చూస్తున్న డీఏ పెంపు ప్రకటన రానుంది. హోలీ నజరానాగా అందించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైందని తెలుస్తోంది. డీఏ పెంపుతో ఉద్యోగుల జీతం భారీగా పెరగనుంది. దేశవ్యాప్తంగా 1.2 కోట్ల ఉద్యోగులు, పెన్షనర్లు ప్రయోజనం పొందనున్నారు.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు బిగ్ రిలీఫ్ లభించనుంది. ఉద్యోగులకు డియర్‌నెస్ అలవెన్స్, పెన్షనర్లు డియర్‌నెస్ రిలీఫ్ హోలీ పండుగ బహుమతిగా అందనుంది. దేశవ్యాప్తంగా 1.2 కోట్ల మంది ఉద్యోగులు, పింఛన్‌దారులకు ప్రయోజనం కలగనుంది. డియర్‌నెస్ అలవెన్స్ అనేది ఏడాదికి రెండుసార్లు పెరుగుతుంది. జనవరిలో మొదటిసారి, జూలైలో రెండవ సారి పెరుగుతుంటుంది. ఇప్పుడు ఈ ఏడాది జనవరి డీఏ కోసం ప్రభుత్వ ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు. ఈ రెండు డీఏ ప్రకటనలు వెలువడేది మాత్రం మార్చ్ నెలలో హోలీ సందర్భంగా, ఆ తరువాత అక్టోబర్ నెలలో దీపావళి సందర్భంగా.
గత ఏడాది జూలై డీఏను 3 శాతం పెంచడంతో మొత్తం డీఏ 53 శాతానికి చేరుకుంది.
అంతకు ముందు అంటే 2024 మార్చ్ నెలలో డీఏ 4 శాతం పెంచడంతో 46 నుంచి 50 శాతానికి చేరింది. ఈసారి డీఏ 2-3 శాతం పెరగవచ్చని అంచనా ఉంది. అంటే మొత్తం డీఏ 55-56 శాతం కావచ్చు. ఏఐసీపీఐ ఇండెక్స్ ప్రకారం 2 శాతం పెరుగుతుందని తెలుస్తోంది. అంటే 18 వేలు కనీస వేతనం ఉన్న ఉద్యోగులకు నెలకు అదనంగా 360 రూపాయలు పెరుగుతుంది. మొత్తం డీఏ లెక్కగడితే నెలకు 9540రూపాయల నుంచి 9900 రూపాయలు అవుతుంది. అదే డీఏ 3 శాతం పెరిగితే మాత్రం కనీస వేతనంలో 540 రూపాయలు పెరుగుతుంది. మొత్తం డీఏ 10,080 రూపాయలు అవుతుంది.
Also read: Jio Hotstar Plans: 100 రూపాయలకే 3 నెలలు జియో హాట్‌స్టార్ ఉచితం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









