
DA Hike Announcement: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. ఉద్యోగుల డియర్నెస్ అలవెన్స్ ఎంతనేది నిర్ధారణ అయింది. మొన్నటి వరకూ డీఏ 2 శాతం ఉంటుందా లేక 3 శాతం ఉంటుందా అనే చర్చ నడిచింది.కొన్ని నివేదికల ప్రకారం డీఏ 2 శాతమే ఉంటుందనే అంచనాలు విన్పించాయి. ఇప్పుడు దీనిపై క్లారిటీ వచ్చింది.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్ అప్డేట్. ఉద్యోగుల డియర్నెస్ అలవెన్స్ అనేది 3 శాతంగా నిర్ధారణైంది. దాంతో ఉద్యోగులు బిగ్ రిలీఫ్ లభించనుంది. ముందు ఊహించినట్టు 2 శాతం కాకుండా 3 శాతం డీఏ పెంచేందుకు నిర్ధారించారు. దాంతో మార్చ్ నెల జీతంలో ఉద్యోగులకు 2187 రూపాయలు పెరగనుంది. డీఏ 3 శాతం పెరుగుతుందని తెలియడంతో ఉద్యోగులకు ఆనందపడుతున్నారు. ఎందుకంటే నవంబర్ వరకు వచ్చిన ఏఐసీపీఐ ఇండెక్స్ ప్రకారం ఈసారి డీఏ 2 శాతమే ఉండవచ్చని దాదాపుగా చాలా వార్తలు విన్పించాయి. కానీ తాజాగా డీఏ 3 శాతం పెంచేందుకు నిర్ణయించారు. డీఏ పెంచడం ద్వారా మొత్తం 1.15 కోట్ల మంది ఉద్యోగులకు లబ్ది చేకూరనుంది. వీరిలో 50 లక్షల మంది ఉద్యోగులు కాగా, 65 లక్షల మంది రిటైర్డ్ ఉద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది.
ప్రస్తుతం 7th Pay Commission ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 53 శాతం డీఏ అందుతోంది. డీఏ అనేది ప్రతి యేటా రెండు సార్లు ప్రకటిస్తుంటారు. డీఏ పెంపు ప్రకటన ఆలస్యమైనా సరే జనవరి 1, 2025 నుంచి అమల్లోకి వస్తుంది. గత ఏడాది అంటే 2024 జూలై నుంచి డిసెంబర్ వరకు ఉన్న ఏఐసీపీఐ ఇండెక్స్ ఆధారంగా ఇది నిర్ణయమౌతుంది. నవంబర్ వరకు ఏఐసీపీఐ ఇండెక్స్ 0.49 కాగా డిసెంబర్ నెలలో అది 0.44 ఉంది. ద్రవ్యోల్బణం రేట్ అనేది 55.99 శాతం ఉంది. అందుకే డీఏ ఈసారి 3 శాతం పెరిగి 56 శాతానికి చేరుతుందని తెలుస్తోంది. మార్చ్ నెల జీతంతో రెండు నెలల ఎరియర్లు కూడా కలవడంతో జీతం భారీగా అందుకోనున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి