7th Pay Commission DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు షాక్, డీఏ ప్రకటనపై సందిగ్ధత

7th Pay Commission DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఈసారి నిరాశగానే ఉన్నారు. హోలీ ముగిసినా డీఏ విడుదల కాలేదు. అటు గత ఏడేళ్లలో ఎన్నడూ లేనంత తక్కువ డీఏ లభించనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 17, 2025, 03:39 PM IST
7th Pay Commission DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు షాక్, డీఏ ప్రకటనపై సందిగ్ధత

7th Pay Commission DA Hike: 7వ వేతన సంఘంలో భాగంగా ఈసారి డియర్‌నెస్ అలవెన్స్ 2 శాతం ఉంటుందని అంచనా ఉంది. గత ఏడేళ్లలో ఇంత తక్కువ డీఏ ఉండటం ఇదే తొలిసారి. ఎప్పుడూ 3-4 శాతం డీఏ ఉంటుంది. అటు పెన్షనర్లకు కూడా డీఏ 2 శాతమే పెరగనుంది. అయితే హోలీ ముగిసినా డీఏ ప్రకటించకపోవడంలో మార్చ్ నెల జీతంతో అందుకుంటారా లేదా అనేది అనుమానంగా మారింది. 

Add Zee News as a Preferred Source

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 7వ వేతన సంఘం ప్రకారం ప్రతి ఏటా రెండు సార్లు డీఏ - డీఆర్ పెరుగుతుంటుంది. గత ఏడాది జూలై డీఏ పెంపు 3 శాతంగా ఉండటంతో మొత్తం 53 శాతానికి చేరుకుంది. ఈ ఏడాది జనవరి నెలలో డీఏ పెంపు బాకీ ఉంది. సాధారణంగా జనవరి డీఏ పెంపు ప్రకటన ఎప్పుడూ మార్చ్ నెలలో హోలీ నాటికి ఉంటుంది. కానీ ఈసారి హోలీ పండుగ ముగిసినా డీఏ మాత్రం ప్రకటించలేదు. దాంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో తీవ్రమైన నిరాశ ఉంది. వాస్తవానికి హోలీ నాటికి డీఏ ప్రకటించి ఉంటే మూడు ఎరియర్లతో పాటు మార్చ్ నెల జీతం ఎక్కువగా తీసుకునేవారు. అటు రిటైర్ అయిన ఉద్యోగులు కూడా డీఆర్ కోసం ఎదురు చూశారు. 

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ అనేది ఎప్పుడూ కేంద్ర కార్మిక శాఖ జారీ చేసే ఏఐసీపీఐ ఇండెక్స్ ఆధారంగా నిర్ణయిస్తారు. ఈ ఇండెక్స్ ఎప్పుడూ ద్రవ్యోల్బణం, నిత్యావసర వస్తు ధరలు, కాస్ట్ ఆఫ్ లివింగ్‌ను బట్టి ఉంటుంది. ఈసారి కూడా ఎప్పటి లానే డీఏ 3-4 శాతం ఉంటుందని అంచనా వేసినా పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ఈసారి డీఏ కేవలం 2 శాతం ఉండవచ్చు. అదే జరిగితే మొత్తం డీఏ 55 శాతానికి చేరుతుంది. అంటే కనీస వేతనం 20 వేలు ఉన్న ఉద్యోగికి 2 శాతం డీఏ అంటే 400 రూపాయలు జీతం పెరుగుతుంది. ఇక పెన్షనర్లకు ఇచ్చే డీఆర్ కూడా అంతే పెరుగుతుంది. 

రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ ఇచ్చిన వివరాల ప్రకారం సీపీఐ ఇండెక్స్ ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో 4.8 శాతం అంచనా ఉంది. అటే డీఏ కేవలం 2 శాతమే పెరగవచ్చు. అందుకే ఉద్యోగులకు ఈసారి నిరాశే ఉంది. డీఏ తక్కువగా పెరగనుండటంతో పాటు ఇంకా ప్రకటన రాకపోవడంతో కాస్త ఆందోళనలో ఉన్నారు. 

Also read; APPSC Exams Hall Tickets: ఏపీపీఎస్సీ పరీక్షల హాల్ టికెట్లు వచ్చేశాయి, ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలంటే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Trending News